బాబు ముందస్తు వ్యూహం అందుకేనా?
చంద్రబాబు బుర్ర ఎపుడూ రాజకీయాల గురించే ఆలొచిస్తూ ఉంటుంది. ఒక ఎన్నిక నుంచి మరో ఎన్నిక. ఒక ఎత్తు తరువాత మరో ఎత్తు. ఇలా బుర్రకు కనీస [more]
చంద్రబాబు బుర్ర ఎపుడూ రాజకీయాల గురించే ఆలొచిస్తూ ఉంటుంది. ఒక ఎన్నిక నుంచి మరో ఎన్నిక. ఒక ఎత్తు తరువాత మరో ఎత్తు. ఇలా బుర్రకు కనీస [more]
చంద్రబాబు బుర్ర ఎపుడూ రాజకీయాల గురించే ఆలొచిస్తూ ఉంటుంది. ఒక ఎన్నిక నుంచి మరో ఎన్నిక. ఒక ఎత్తు తరువాత మరో ఎత్తు. ఇలా బుర్రకు కనీస విశ్రాంతి ఇవ్వకుండా అర్ధ శతాబ్ద కాలంగా చంద్రబాబు బిజీగానే గడిపేస్తున్నారు. తాజాగా ఆయన తిరుపతి ఎంపీ సీటుకు అభ్యర్ధిని అందరి కంటే ముందు ప్రకటించి గట్టి షాక్ ప్రత్యర్ధులకు ఇచ్చేశారు. నిజానికి ఉప ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉన్నాయి. బాబు నైజం చూస్తే నామినేషన్ వేయడానికి రెండు రోజుల ముందు మాత్రమే క్యాండిడేట్ ని డిసైడ్ చేస్తారు. కానీ ఈసారి రూట్ మార్చేసారు.
వైసీపీకి సేఫ్ జోన్….
అధికార వైసీపీకి ఈ ఎన్నికలు క్యాట్ వాక్ అని అంటున్నారు. ఇప్పటికైతే పొలిటికల్ సీన్ అలాగే ఉంది. ఎందుకంటే తిరుపతి పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీకి ఇక్కడ రెండున్నర లక్షలకు పైగా ఓట్ల మెజారిటీ వచ్చింది. పైగా సిట్టింగ్ వైసీపీ ఎంపీ చనిపోయింది కరోనా కారణంగా. దాంతో ఆ సానుభూతి ఎటూ ఉంటుంది. ఇక ఆ కుటుంబం నుంచే జగన్ అభ్యర్ధిని డిసైడ్ చేస్తారు అంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలను పంచుతూ వైసీపీ జనంలోనే ఉంది కాబట్టి ఆ పార్టీకి ఢోకా లేదన్న భావన అయితే అంతటా ఉంది.
ప్లస్ అవుతుందా ..?
అయితే ఇక్కడే చంద్రబాబు తన మాస్టర్ ప్లాన్ బయటకు తీశారు. అంతే కాదు కధను కూడా అడ్డంగా తిప్పాలనుకుంటున్నారు. పనబాక లక్ష్మికే మళ్ళీ టికెట్ ఇవ్వడం వెనక గట్టి వ్యూహమే ఉంది. ఆమె ఇప్పటికి నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగా చాలా కాలం పనిచేశారు. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో ఆమె ఓడారు. ఇక ఆమె ముందు వైసీపీ ఎంపీ అభ్యర్ధి ఎవరు ఉన్నా జనాలకు అయితే పెద్దగా పరిచయం అయి ఉండరు అన్నది గ్యారంటీ. వారు వారసులు మాత్రమే. జగన్ బొమ్మ చూసి ఓటు వేయాలి. అందుకే అభ్యర్ధిని ముందు ప్రకటిస్తే అది ప్లస్ అవుతుందనే చంద్రబాబు ఎత్తుగడ వేశారని అంటున్నారు. పైగా ఆమెను గతసారి ఓడించామన్న సానుభూతి జనాల్లోకి ముందే వెళ్తుంది అన్నది చంద్రబాబు ప్లాన్.
దుబ్బాక స్ట్రాటజీ …..
అచ్చం దుబ్బాక ఉప ఎన్నికల మాదిరిగా అన్నమాట. అక్కడ బీజేపీ అభ్యర్ధి రఘునందనరావు వ్యక్తిగత ఇమేజ్ గెలుపునకు బాగా పనిచేసింది. ఆయన నోటిఫికేషన్ రాక ముందు నుంచే జనంలోకి వెళ్లారు. ఆయన్ని కూడా అంతకు ముందు ఓడించారు. దాంతో అన్నీ సర్దుకుని టీయారెస్ క్యాండిడేట్ గా రామలింగారెడ్డి భార్యను ప్రకటినేసరికి ఒక రౌండ్ ప్రచారం రఘునందన్ కానిచ్చేశారు. ఇపుడు కూడా నాలుగు నెలల సుదీర్ఘ సమయం తిరుపతి ఎన్నికలు ఉంది. ఇప్పటి నుంచే పనబాక లక్ష్మి జనంలో ఉంటే ఆమెకు ప్లస్ అవుతుందని, ఆ మీదట ఎన్నికలు దగ్గరచేసి గట్టిగా వైసీపీని తగులుకుంటే విజయం వరిస్తుందని చంద్రబాబు ప్లాన్ వేశారు. ఇక ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్న బీజేపీకి క్యాండిడేట్ సమస్య ఉండనే ఉంది. దాంతో వైసీపీ వ్యతిరేక ఓట్లు ముందుగానే తమ వైపు మళ్ళించుకోవడానిక్ చంద్రబాబు పన్నిన వ్యూహంగా ఇదని చెబుతున్నారు. మొత్తానికి తిరుపతి లడ్డూ మీదనే బాబు కన్నేశారని అర్ధమవుతోంది