ఆ తప్పులే వెంటాడుతున్నాయా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు అర్థం లేకుండా పోయింది. ఆయన గతంలో చేసిన ఒప్పులే ఇప్పుడు తప్పులుగా చూపుతుండటంతో చంద్రబాబు విమర్శలకు విలువ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు అర్థం లేకుండా పోయింది. ఆయన గతంలో చేసిన ఒప్పులే ఇప్పుడు తప్పులుగా చూపుతుండటంతో చంద్రబాబు విమర్శలకు విలువ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు అర్థం లేకుండా పోయింది. ఆయన గతంలో చేసిన ఒప్పులే ఇప్పుడు తప్పులుగా చూపుతుండటంతో చంద్రబాబు విమర్శలకు విలువ లేకుండా పోతుంది. చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని విషయంలో చూపిన నిర్లక్ష్యం ఇప్పుడు ఆయన వెంటాడుతుంది. జగన్ ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేస్తుందని చెప్పినా నాడు తాను అమరావతిలో చేసిందేమిటన్న ప్రశ్న సహజంగానే తలెత్తుంది.
పోలవరం విషయంలోనూ….
ఇక పోలవరం విషయంలోనూ చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు పసలేకుండా పోతున్నాయి. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో చంద్రబాబు పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ప్రతి సోమవారం పోలవారం అంటూ చంద్రబాబు సమీక్షలు చేసినా ప్రాజెక్టు ముందుకు సాగలేదు. కాంట్రాక్టర్లను మార్చాల్సి వచ్చింది. అలాగే పట్టిసీమ పై ఉన్న శ్రద్ధ బాబుకు పోలవరంపై లేదన్న విమర్శలు నాడే విన్పించాయి. ఇప్పుడు పోలవరం విషయంలో చంద్రబాబు చేస్తున్న వాదనను కూడా ఎవరూ పట్టించుకోక పోవడానికి అదేకారణమంటున్నారు.
హోదాపై నాడు….
ఇక తాజాగా చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా విషయాన్ని జగన్ పూర్తిగా పక్కన పెట్టేశారని చంద్రబాబు అంటున్నారు. మరి నాడు చంద్రబాబు చేసిన విషయాన్ని మాత్రం మర్చిపోయినట్లున్నారు. హోదా సంజీవిని కాదని, ప్రత్యేక ప్యాకేజీయే బెటర్ అని చంద్రబాబు నాడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చంద్రబాబు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ కేవలం అమరావతిపైనే దృష్టి పెట్టారు. అది కూడా పూర్తి చేయలేదు.
కావాలని పెండింగ్ లో పెట్టి…..
రానున్న ఎన్నికల్లో తాను తిరిగి అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు అమరావతి, పోలవరం పనులను కావాలని పూర్తి చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. ఇద్దరికీ పెద్ద తేడా ఏమీ లేకపోవడంతో చంద్రబాబు చేస్తున్న విమర్శలను ప్రజలుకూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయన చేస్తున్న కామెంట్స్ కు పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం విశేషం. గతంలో చంద్రబాబు చేసిన తప్పులే ఇప్పుడు ఆయనను వెంటాడుతున్నాయని చెప్పక తప్పదు.