బాబు హోప్స్ అన్నీ దానిపైనే నట
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చాలా ఆశలు పెట్టుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్న నమ్మకం చంద్రబాబు లో కన్పిస్తుంది. ఫిబ్రవరిలో స్థానిక [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చాలా ఆశలు పెట్టుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్న నమ్మకం చంద్రబాబు లో కన్పిస్తుంది. ఫిబ్రవరిలో స్థానిక [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చాలా ఆశలు పెట్టుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్న నమ్మకం చంద్రబాబు లో కన్పిస్తుంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఫలితాల్లో కన్పిస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్ గా వెళ్లకుండా నిరోధించడానికి చంద్రబాబు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఫిబ్రవరిలో జరిగితే…..
స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో జరపాలని రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించారు. ఆయన రెండురోజుల కొకసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తున్నారు. న్యాయస్థానంలో వచ్చే తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవిలో ఉన్నప్పుడే ఎన్నికలు జరిపితే కొంత తమకు వాతావరణం అనుకూలంగా ఉంటుందన్నది చంద్రబాబు అభిప్రాయం.
అందుకే వ్యూహంతో……
ఆన్ లైన్ లో నామినేషన్లను దాఖలు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు అనేక మంది టీడీపీ నేతలు భయపడి నామినేషన్లు వేయడానికి కూడా ముందుకు రాలేదు. డోన్ వంటి ప్రాంతంలోనూ కేఈ కృష్ణమూర్తి వంటి నేతలు ఎన్నికల బహిష్కరణకు సిద్ధపడ్డారు. ఇవన్నీ లేకుండా ఎన్నికలు సజావుగా జరగాలంటే ఫిబ్రవరిలోనే ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు.
ఎంతో కొంత పుంజుకున్నా……
అందుకే న్యాయపరంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై పోరాడేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఏమాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కొంత పుంజుకున్నా తిరిగి నేతలు పూర్వ స్థితికి వస్తారని భావిస్తున్నారు. తాను పూర్తి స్థాయిలో కమిటీలు వేసినా నేతలు యాక్టివ్ గా లేరు. అదే చంద్రబాబును కలచివేస్తుంది. తిరుపతి ఉప ఎన్నికలో గెలవడం అంత సులువు కాదు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలపైనే చంద్రబాబు ఆశలన్నీ పెట్టుకున్నారు. మరి ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.