ప్రవాసిగానే బాబు కంటిన్యూ ?
అదేదో సినిమాలో పాత పాట ఒకటి ఉంది. నేనొక పేమ పిపాసిని అని. ఇపుడు దాన్ని కాస్తా మార్చితే నేనొక ప్రవాసిని అని చంద్రబాబు పాడుకోవచ్చేమో. ఏకంగా [more]
అదేదో సినిమాలో పాత పాట ఒకటి ఉంది. నేనొక పేమ పిపాసిని అని. ఇపుడు దాన్ని కాస్తా మార్చితే నేనొక ప్రవాసిని అని చంద్రబాబు పాడుకోవచ్చేమో. ఏకంగా [more]
అదేదో సినిమాలో పాత పాట ఒకటి ఉంది. నేనొక పేమ పిపాసిని అని. ఇపుడు దాన్ని కాస్తా మార్చితే నేనొక ప్రవాసిని అని చంద్రబాబు పాడుకోవచ్చేమో. ఏకంగా ఎనిమిది నెలల నుంచి చంద్రబాబు హైదరాబాద్ లోని తన వందల కోట్ల విలాస భవనంలోనే బాబు నివాసం, విలాసం. అక్కడ నుంచి అడుగు తీసి చంద్రబాబు బయటకు రావడం లేదు. ఒకటి రెండు సార్లు బలవంతం మీద విజయవాడ దాకా వచ్చినా టచ్ మీ నాట్ అంటూ ఎవరినీ కలవకుండానే మళ్ళీ హైదరాబాద్ కి వెళ్ళిపోయారు. ఇక ఆయన కుమారుడు లోకేష్ తో బండి సాగదన్న సంగతి అందరికీ తెలిసిందే.
ఎన్నారై అంటున్న సోము….
ఇక చంద్రబాబు ని పొలిటికల్ గా ర్యాగింగ్ చేయడంతో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుని మించిన వారు లేరు. ఆయన ఈ మధ్య చంద్రబాబుని ముద్దుగానో అల్లరిగానో ఎన్నారై అని షార్ట్ కట్ లో పిలిచారు. ఫుల్ ఫార్మ్ లో నాన్ రెసిడెంట్ ఆంధ్రా అని దాని అర్ధమట. ఆయన ఏపీ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఇక్కడ అసలు ఉండడం లేదు. మరి ఆయనకు క్యాబినేట్ ర్యాంక్ మంత్రితో సమానమైన హోదా ఉంది. సిబ్బంది ఉంటారు. జీత భత్యాలు ఉంటాయి. సదుపాయాలు కూడా ఉంటాయి. అవన్నీ చంద్రబాబుకు ఎందుకు ఇస్తున్నారు. ఆయన ఏపీకే రానపుడు ఆ జీత భత్యాలు అన్నీ కట్ చేసి పారేయండి అంటూ సోము గట్టిగానే గర్జించారు. వైసీపీ సర్కార్ కి ఇలా తనదైన సలహా కూడా ఇచ్చారు.
అలా చేస్తారా …?
ఒక విధంగా అది లాజిక్ పాయింటే. ప్రజా ప్రతినిధులకు ఎవరికీ లేని సదుపాయాలు ఇస్తున్నారు. వారి కోసం ఎంతో ఖర్చు బడ్జెట్ నుంచి తీసి పెడుతున్నారు. మరి వారి విధులు వారు నిర్వహించనపుడు ఆ ఖర్చు కూడా దండుగే కదా. ఇదే ప్రశ్న కాస్తా రాజకీయం మిళాయించి సోము వీర్రాజు వైసీపీ సర్కార్ ని అడిగారు. కానీ చంద్రబాబు వూసు ఎత్తితేనే అనుకూల మీడియా విరుచుకుపడిపోతుంది. ఇక ఆయన జీత భత్యాలు కనుక రద్దు అంటే ఇంకేమైనా ఉందా. ఆకాశాన్ని, భూమినీ కలిపేయదూ. అయినా సరే జగన్ ఈ విషయంలో ఆలోచించాలని మేధావులు, తటస్థులు కూడా అంటున్నారు. ఏపీకి ఏ విధంగానూ ఉపయోగం లేని ప్రతిపక్ష నేత చంద్రబాబు అని బీజేపీయే అనేస్తోంది మరి.
ఇలా అయితే కష్టమే…
చంద్రబాబు అన్నీ బాయ్ కాట్ అంటున్నారు. జూం యాపే ముద్దు అంటున్నారు. ఎందుకంటే కరొనా బయట ఉంది. ఆయన కాలు బయట పెడితే రిస్కేనని వయసు దృష్ట్యా, ఆయనకు ఉన్న అనారోగ్య సమస్యల రిత్యా వైద్యులు కూడా సూచించారని అంటున్నారు. అందువల్ల చంద్రబాబు విషయంలో సానుభూతితోనే చూడాలి. ఆయన ఇదివరకు మాదిరిగా జనాల్లో తిరగాలి అంటే కరోనా అయినా తగ్గాలి. లేక వ్యాక్సిన్ అయినా రావాలి. అప్పటిదాక ఆయన ప్రవాసి గానే ఉంటారు. బీజేపీ లాంటి పార్టీలు ఎన్నారై అని ఎన్ని కామెంట్స్ చేసినా చంద్రబాబు మాత్రం ఇలాగే ఉంటారని అంటున్నారు. ఒకవేళ తన జీత భత్యాలు కానీ వైసీపీ సర్కార్ రద్దు చేస్తే దాన్ని కూడా సానుభూతిగా ఆయన మార్చుకుంటారు అంటున్నారు. అయితే ఆయన ఇలా పక్క రాష్ట్రంలో నెలల తరబడి ఉండడం మాత్రం పార్టీకి తీరని నష్టం, కష్టమనే అంటున్నారు.