బాబు ఇక ఉపేక్షించరట.. ఆయనకు ఊస్టింగ్ తప్పదట
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ముందుగానే టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించారు. ఎన్నికల వ్యూహకర్తను కూడా నియమించుకున్నారు. కాని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోని [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ముందుగానే టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించారు. ఎన్నికల వ్యూహకర్తను కూడా నియమించుకున్నారు. కాని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోని [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ముందుగానే టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించారు. ఎన్నికల వ్యూహకర్తను కూడా నియమించుకున్నారు. కాని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోని కొన్ని అసెంబ్లీ సెగ్మంట్లలో ఇప్పటికీ టీడీపీ నేతలు యాక్టివ్ గా లేకపోవడం టీడీపీని కలవరపర్చే అంశమే. ప్రధానంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ టీడీపీ నేతలు పూర్తిగా ఇన్ యాక్టివ్ అవ్వడం ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవంటున్నారు.
పత్తా లేకుండా….
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఉంది. గత ఎన్నికలలో ఇక్కడ వైసీపీ గెలిచింది. పార్లమెంటు ఎన్నికల్లోనూ కూడా ఇక్కడ వైసీపీ అభ్యర్థికే మెజారిటీ వచ్చింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన బొజ్జల సుధీర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత నుంచి ఆయన పత్తా లేకుండా పోయారు. బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయన హైదరాబాద్ కే పరిమితమయ్యారు.
వార్నింగ్ ఇచ్చి….
దీంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీని పట్టించుకునే నేత లేకుండా పోయారు. ఇటీవల చంద్రబాబు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఒకరకంగా బొజ్జల సుధీర్ కు చంద్రబాబు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు. రాజకీయ భవిష్యత్ కావాలంటే నిత్యం ప్రజల్లోనే ఉండాలని, పార్టీ అప్పగించిన కార్యక్రమాలను చేపట్టాలని సూచించినట్లు తెలిసింది. లేకుంటే ఇన్ ఛార్జిని మార్చాల్సి ఉంటుందని ఆయన బొజ్జల సుధీర్ రెడ్డికి చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
అవసరమైతే మార్చాలని….
శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పెట్టని కోట, 1989 నుంచి జరిగిన వరసగా ఆరు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఒక్క 2004లోనే ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో చంద్రబాబు ఈ నియోజకవర్గాన్ని తిరిగి గ్రిప్ లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తన సొంత జిల్లాలోనూ ఈ నియోజకవర్గం ఉండటంతో చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారని చెబుతున్నారు. మరి ఇప్పటికైనా బొజ్జల సుధీర్ రెడ్డి వ్యవహార శైలిలో మార్పు వస్తుందా? లేక ఆయననే మార్చాలా? అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.