బాబు బ్యాలన్స్ చేయలేకపోతున్నారే?
టీడీపీ అధినేత ఇప్పుడు సామాజిక వర్గ ఓటు బ్యాంకు విషయంలో ఫుల్లు డైలమాలో ఉన్నారని ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నాయి. గత ఎన్నికలకు ముందు సామాజిక [more]
టీడీపీ అధినేత ఇప్పుడు సామాజిక వర్గ ఓటు బ్యాంకు విషయంలో ఫుల్లు డైలమాలో ఉన్నారని ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నాయి. గత ఎన్నికలకు ముందు సామాజిక [more]
టీడీపీ అధినేత ఇప్పుడు సామాజిక వర్గ ఓటు బ్యాంకు విషయంలో ఫుల్లు డైలమాలో ఉన్నారని ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నాయి. గత ఎన్నికలకు ముందు సామాజిక సమీకరణలు బ్యాలెన్స్ చేసే విషయంలో చంద్రబాబు ఫెయిల్ అవ్వగా దానిని క్యాష్ చేసుకునే జగన్ చాలా సామాజిక వర్గాలను తమ వైపునకు తిప్పుకుని భారీ మెజార్టీతో అధికారం సొంతం చేసుకున్నారు. ముఖ్యమైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలు, కాపుల విషయంలో ఆయన అనుసరిస్తున్న విధానాలు, వైసీపీ దూకుడు వంటివి చంద్రబాబును కలవరపెడుతున్నాయి. గత ఏడాది ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరిగి గెలిచేందుకు ఉన్న మార్గాలను అన్వేషించిన చంద్రబాబు బీసీ, కాపుల ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన కాపులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. వాస్తవానికి బీసీలు అందరూ తనతోనే ఉన్నారని అతి విశ్వాసం పెంచుకున్నారు.
కాపుల కోసం….
పార్టీ అధికారంలో ఉన్న క్రమంలో ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం లేవనెత్తగానే చంద్రబాబు కాపులను ఆకర్షించేందుకు కాపు కార్పొరేషన్, కాపు విద్యార్థులకు విదేశీ రుణాల నుంచి, కాపుల మంత్రులకు ప్రాధాన్యం ఇవ్వడం ఇలా అనేక కార్యక్రమాలు చేశారు. ఈ క్రమంలో కాపులను మరింత మచ్చిక చేసుకునేందుకు బీసీ రిజర్వేషన్లపై 5 శాతం కోటా కాపులకు ఇస్తూ తీర్మానం చేశారు. ఇది బీసీలకు ఆగ్రహం తెప్పింది. పోనీ.. దీనిని సాధించారా ? అంటే.. అది కూడా లేదు. ఇది సాధ్యం కాదని తెలిసీ.. చంద్రబాబు తమను మోసం చేశారని కాపులు ప్రచారం చేశారు. ఎన్నికల వేళకు మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ డబ్ల్యుఎస్ 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం గుండుగుత్తుగా చంద్రబాబు ..కాపులకు ఇస్తున్నట్టు ప్రకటించారు. అయినా.. వారు చంద్రబాబుపై విశ్వాసం చూపలేదు.
బ్యాలన్స్ చేయడానికి……
ఎన్నికల్లో మాత్రం కాపుల్లో జనసేనకు మెజార్టీ కాపుల ఓట్లు పడ్డాయి. కాపుల ఓట్లు సొంతం చేసుకోవడంలో టీడీపీ మూడో ప్లేస్‌లో ఉందని కాపుల ఓట్లు ఎక్కువుగా ఉన్న నియోజకవర్గాల ఫలితాలే చెప్పేశాయి. జనసేన గెలిచిన రాజోలు లాంటి చోట్ల టీడీపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవడమే ఇందుకు నిదర్శనం. అదే సమయంలో బీసీలు జగన్‌వైపు మళ్లారు. దీంతో చంద్రబాబు తన జీవితంలో ఎన్నడూ చూడని ఓటమిని ఎదుర్కొన్నారు. ఇక, వచ్చే ఎన్నికల నాటికి ఈ పరిస్థితిని మార్చుకునేందుకు బాబు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. బీసీలను తనవైపు తిప్పుకొనడంతోపాటు .. కాపులను కూడా మరోసారి తనవైపు చూసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ రెండు వర్గాల మధ్య బ్యాలెన్స్ చేసే విషయంలో చంద్రబాబు ముప్పు తిప్పలు పడుతోన్న పరిస్థితి ఉంది.
కాపులకు ప్రాధాన్యత ఇస్తూ…..
కాపులు, బీసీల్లో కొందరు నాయకులకు చంద్రబాబు ఎక్కువ ప్రయార్టీ ఇస్తున్నారు. కాపు వర్గానికి చెందిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు ప్రాధాన్యం ఇస్తున్నారనే టాక్ ఉంది. అటు విజయవాడకు చెందిన బొండా ఉమాకు కూడా మితిమీరిన ప్రయార్టీ ఇస్తున్నారు. ఇక, బీసీ వర్గానికి చెందిన అచ్చెన్నాయుడుకు టీడీపీ రాష్ట్ర చీఫ్ ఇచ్చారు. మరి ఇంత చేసినా.. ఈ రెండు వర్గాలు సైకిల్ వైపు దృష్టి సారిస్తాయా ? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. జగన్ బీసీల విషయంలో పక్కా స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నారు. భారీ ఎత్తున బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. పింఛన్లు ఇస్తున్నారు. దీంతో బీసీలు ఆయన వెంటే ఉన్నారని తెలుస్తోంది.
శక్తికి మించిన పని…..
ఇంకా చెప్పాలంటే జగన్ కాపుల కంటే బీసీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ బీసీ ఓటు బ్యాంకును టీడీపీకి దూరం చేసే ప్లాన్‌తోనే ముందుకు వెళుతున్న పరిస్థితి. దీంతో తమ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను తమ వైపునకు తిప్పుకోవడం ఇప్పుడు చంద్రబాబుకు శక్తికి మించిన పని అవుతోంది. ఇక కాపులను సవరదీస్తోన్నా పవన్-సోము వీర్రాజులు సంయుక్తంగాకాపు ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు అడుగులు వేస్తున్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు కిం కర్తవ్యం అంటూ.. డోలాయమానంలో పడ్డారని అంటున్నారు పరిశీలకులు.