పనబాక “తప్పు”లో కాలేస్తుంది అక్కడేనా?
“మా నాయకుడికే వ్యూహం లేదు. ఇంక మాకు ఎక్కడి నుంచి వ్యూహం వస్తుంది?“- ఇదీ గుంటూరుకు చెందిన ఓ కీలక నాయకుడు.. ఆఫ్‌ది రికార్డుగా మీడియాతో అన్న [more]
“మా నాయకుడికే వ్యూహం లేదు. ఇంక మాకు ఎక్కడి నుంచి వ్యూహం వస్తుంది?“- ఇదీ గుంటూరుకు చెందిన ఓ కీలక నాయకుడు.. ఆఫ్‌ది రికార్డుగా మీడియాతో అన్న [more]
“మా నాయకుడికే వ్యూహం లేదు. ఇంక మాకు ఎక్కడి నుంచి వ్యూహం వస్తుంది?“- ఇదీ గుంటూరుకు చెందిన ఓ కీలక నాయకుడు.. ఆఫ్‌ది రికార్డుగా మీడియాతో అన్న మాట. “సార్ ఇప్పుడు అమరావతిపై పోరాడుతున్నారు. కానీ, తిరుపతి ఉప ఎన్నికల్లో పాత అభ్యర్థికే టికెట్ ఇచ్చారు. పనబాక లక్ష్మి ఇప్పటి వరకు రాజధాని విషయంలో తన మనసులో మాటను వ్యక్తీకరించలేదు. పోనీ.. టీడీపీతో కలిసి.. ఎన్నడూ పోరాటాల్లో పాల్గొన్నదీ లేదు. ఎస్సీ మహిళా రైతులకు ఇక్కడ అవమానం జరిగినా.. ఆమె పట్టించుకోలేదు. మరి ఆమెకు టికెట్ ఇచ్చి ఏం సాధిస్తారు? అసలు టీడీపీ వ్యూహం ఏంటి?“ అన్న ప్రశ్నకు సదరు మాజీ మంత్రి చెప్పిన మాట అది!! ఒక్క గుంటూరు జిల్లాలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో తమ్ముళ్ల పరిస్థితి ఇలానే ఉంది.
ఏకపక్షంగా నిర్ణయాలు…..
సాధారణ రాజకీయాలు ఎలా ఉన్నా.. ఎన్నికల విషయానికి వచ్చే సరికి చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహాలపై తమ్ముళ్లు తల పట్టుకుంటున్నారు. “నేను అన్నీ చర్చించే నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఈ విషయంలో దాపరికం ఏమీ లేదు“ అని పదేపదే చంద్రబాబు ప్రకటిస్తున్నా రు. కానీ, క్షేత్రస్థాయిలోకి వచ్చే సరికి తమ్ముళ్లు మాత్రం పెదవి విరుస్తున్నారు. “ఎవరిని అడిగి నిర్ణయాలు తీసుకుంటున్నారో.. ఎవరితో చర్చిస్తున్నారో.. మా నాయకుల వారికే తెలియాలి. నిర్ణయాలు తీసుకుని.. తేడా వచ్చినప్పుడు.. మాత్రమే.. ఇలా అంటున్నారు. ఎవరూ మాట్లాడకపోతే.. అది కూడా లేదు.
కష్టమొచ్చినప్పుడు మాత్రం…..
పనబాక లక్ష్మి ఎంపిక విషయంలో సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారు. దీంతో అందరినీ అడిగే నిర్ణయం తీసుకున్నానంటూ.. పేరు చెప్పకుండా నెపం మా మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు“ అని ప్రకాశం జిల్లాకు చెందిన మరో సీనియర్ నాయకుడు అభిప్రాయపడ్డారు. “మా సార్‌కి కష్టం వచ్చినప్పుడు మేం గుర్తుకు వస్తాం. పార్టీలో పదవుల పంపకమే బాగోలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ దగ్గరకు రానివ్వలేదు. ఓ కోటరీ ఏర్పడిపోయింది.. దానిని పక్కకు తప్పించండి.. అని మేం నెత్తీనోరూ కొట్టుకుని చెప్పాం.
జంబోకమిటీ లను ……
అయినా.. ఆయన పట్టించుకోలేదు. ఇక, ఇప్పుడు పార్టీలో జంబో కమిటీలను ఏర్పాటు చేశారు. ఎందుకు? అంటే.. పార్టీని బలోపేతం చేస్తానని అంటున్నారు. మంది ఎక్కువైతే.. మజ్జిగ పలచనవుతుందనే సామెత మా చంద్రబాబుకు తెలియదా? ఏం చేస్తాం..“ అని నిట్టూర్పు విడిచారు.. విజయవాడకు చెందిన ఓ ప్రజాప్రతినిధి. ఇలా .. ఎక్కడికక్కడ చంద్రబాబు నిర్ణయాలపై అంతర్గతంగా తమ్ముళ్ల మధ్య చాలా చర్చే నడుస్తుండడం గమనార్హం. కానీ, వినేవారు.. చంద్రబాబు చెవిన వినిపించేవారే కరువవ్వడం గమనార్హం.