బాబులో ఇంత పిరికితనం ఉందా?
చంద్రబాబు సీనియర్ మోస్ట్ నాయకుడు. సుదీర్ఘ అనుభవం ఉన్న నేత. నలభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో ఆటుపోట్లను చూశారు. కానీ గత ఇరవై నెలలుగా చంద్రబాబు [more]
చంద్రబాబు సీనియర్ మోస్ట్ నాయకుడు. సుదీర్ఘ అనుభవం ఉన్న నేత. నలభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో ఆటుపోట్లను చూశారు. కానీ గత ఇరవై నెలలుగా చంద్రబాబు [more]
చంద్రబాబు సీనియర్ మోస్ట్ నాయకుడు. సుదీర్ఘ అనుభవం ఉన్న నేత. నలభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో ఆటుపోట్లను చూశారు. కానీ గత ఇరవై నెలలుగా చంద్రబాబు అనుసరిస్తున్న తీరు, ఆయన వ్యవహారాన్ని పరిశీలిస్తే చంద్రబాబు లో పిరికితనం ఎక్కువగా ఉందని చెప్పక తప్పదు. గత ఇరవై నెలలుగా చంద్రబాబు ఉన్న అవకాశాన్ని కూడా వినియోగించుకోవడం లేదు. పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న దానిపైనే దృష్టి పెట్టిన చంద్రబాబు తాను చేస్తున్న తప్పులను గుర్తించడం లేదు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు…..
చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. జగన్ ప్రభుత్వం ఎటూ కేసులతో తమ పార్టీ నేతలను ఇబ్బంది పెడుతుంది. మరోవైపు ఏపీకి అన్యాయం జరిగిందన్న భావనలో ప్రజలు కూడా ఉన్నారు. అమరావతి అంశంతో పాటు పోలవరం ప్రాజెక్ట్ వంటి వాటిపై బీజేపీ అనుసరస్తున్న తీరు ను అందరూ ఆక్షేపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు మాత్రం మౌనంగా ఉంటున్నారు.
ఇరవై నెలలుగా….
చంద్రబాబు మౌనంగా ఉండటమే కాదు గత ఇరవై నెలలుగా మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసిచడమే పనిగా పెట్టుకున్నారు. అంతెందుకు ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే చంద్రబాబు తాను మోదీ ప్రభుత్వంతో వైరం పెట్టుకుని తప్పు చేశానని బహిరంగంగా పశ్చాత్తాప పడ్డారు. తన పార్టీలో ఉన్న రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపారు. ఇలా తొలి నుంచి బీజేపీతో సఖ్యతగా ఉండేందుకే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు మోదీ అంటేనే మండి పడిన చంద్రబాబు అకస్మాత్తుగా స్వరం మార్చడాన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారు.
ఎలా నమ్ముతారు?
అయితే పార్టీలో మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేక ఉందని క్షేత్రస్థాయిలో పల్స్ ను నేతలు చెబుతున్నా బీజేపీ పట్ల ఎందుకంత సానుకూలత చూపుతున్నారన్న ప్రశ్న ను వేస్తున్నారు. జగన్ బీజేపీ వైపు ఉంటే కేసుల కోసం భయపడి అని మనం విమర్శలు చేస్తూ, బీజేపీని మనం పొగిడితే ప్రజలు ఎలా నమ్ముతా రంటున్నారు. అయితే ఎన్నికల నిర్వహణ, వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసమే చంద్రబాబు బీజేపీతో సఖ్యతగా ఉంటున్నారని, జాతీయ రాజకీయాలు కూడా పూర్తిగా వదిలేశారని సీనియర్ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు పిరికితనం అంటూ సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కొత్త సంవత్సరమైనాచంద్రబాబు తన వైఖరి మార్చుకుంటారో? లేదో? చూడాలి.