బలం బాగా పెరుగుతున్నట్లుందిగా?
ఉత్తరాంధ్ర జిల్లాలు నెమ్మదిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నాయా అంటే అవును అనే జవాబు చెప్పాలేమో. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలు 2019 ఎన్నికల్లో అనూహ్యంగా ఫ్యాన్ [more]
ఉత్తరాంధ్ర జిల్లాలు నెమ్మదిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నాయా అంటే అవును అనే జవాబు చెప్పాలేమో. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలు 2019 ఎన్నికల్లో అనూహ్యంగా ఫ్యాన్ [more]
ఉత్తరాంధ్ర జిల్లాలు నెమ్మదిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నాయా అంటే అవును అనే జవాబు చెప్పాలేమో. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలు 2019 ఎన్నికల్లో అనూహ్యంగా ఫ్యాన్ నీడకు చేరాయి. మూడు జిల్లాలలో ఆరంటే ఆరు సీట్లు తప్ప సైకిల్ పార్టీకి పెద్దగా ఏదీ దక్కలేదు. అయితే మొదటి నుంచి బలంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఇపుడిపుడే రాజకీయ మార్పు కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీకి బలమైన నేతలు ఉండడమే అందుకు కారణం. వారికి పార్టీ పదవులు ఇచ్చి చంద్రబాబు పార్టీ గేరు మార్చారు. జోరు కూడా పెంచారు. దాంతో టీడీపీకి కొత్త ఏడాదిలో మేలి మలుపు, గెలుపు పిలుపు శ్రీకాకుళం నుంచేనని అంటున్నారు.
అచ్చెన్న దూకుడుతో …
ఎన్ని చెప్పుకున్నా శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబానికి రాజకీయంగా మంచి పలుకుబడి ఉంది. అచ్చెన్నాయుడుని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా సరైన సమయంలో నియమించి అధినేత చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అచ్చెన్న విమర్శలు చేయడమే కాదు, వాటిని నిజం అని జనాలను నమ్మించడంతో సిద్ధహస్తుడు. పైగా ఆయన ధాటిని ధీటుగా ఎదుర్కొనే నేతలు శ్రీకాకుళం వైసీపీలో ఎవరూ లేరని చెప్పాలి. వైసీపీకి గట్టి నేతలు ఉన్నా కూడా వారంతా గ్రూపులుగా విడిపోవడం కూడా టీడీపీకి బాగా కలసివస్తోంది. దాంతో అచ్చెన్న సైకిల్ పార్టీ జోరు ఒక్క లెక్కన పెంచేస్తున్నారు.
కలసికట్టుగా సీన్ లోకి ….
జిల్లాలో టీడీపీ నాయకులు అంతా 2019 ఎన్నికల నుంచి గుణపాఠం నేర్చుకున్నట్లుగా కనిపిస్తోంది. జిల్లా ప్రెసిడెంట్ గా నోరున్న కూన రవికుమార్ ని చంద్రబాబు నియమించడంతో ఆయన తనదైన శైలిలో వైసీపీని గట్టిగా తగులుకుంటున్నారు. అదే విధంగా ఇప్పటిదాకా అంటీ ముట్టనట్లుగా ఉన్న మాజీ మంత్రి గౌతు శ్యామ సుందర శివాజీ కుటుంబం కూడా ఇపుడు చేతులు కలిపింది. గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూల్చేస్తామంటూ మంత్రి సీదరి అప్పలరాజు చేసిన హడావుడి బూమరాంగ్ అయి టీడీపీని మరింత ఐక్యం చేసింది. ఇంకో వైపు మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ కుటుంబం కూడా పార్టీ నేతలతో కలసి వీధి పోరాటాలకు రెడీ అయిపోయింది. మొత్తానికి సిక్కోలు టీడీపీ రాజకీయాన్ని ఒక్క తాటిపైకి తేవడంతో అచ్చెన్నాయుడు సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
బలమొచ్చిందిగా…?
ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే శ్రీకాకుళం జిల్లాల్లో సగం దాకా ఎమ్మెల్యే సీట్లు టీడీపీ గెలుచుకునే సీన్ ఉందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే పరిమితం అయిన పసుపు పార్టీ రెండేళ్ళు కూడా తిరగకుండానే రెట్టింపు బలం పుంజుకోవడమ అంటే మాటలు కాదు, అదే విధంగా స్థానిక ఎన్నికలు ఎపుడు జరిగినా అధికార వైసీపీకి గట్టి పోటీ ఇవ్వడమే కాదు, సగానికి పైగా సీట్లను తన ఖాతాలో వేసుకోవడానికి పరుగులు తీస్తోంది. వైసీపీలో అనైక్యత, అనుభవ రాహిత్యం మూలంగానే టీడీపీ పుంజుకుంటోంది అని అంటున్నారు. సిక్కోలు కనుక సైకిలెక్కితే ఉత్తరాంధ్రాలోని మిగిలిన రెండు జిల్లాలు కూడా అదే బాట పడతాయా అన్నది చూడాలి మరి.