రంగూ, రూపూ పూర్తిగా మార్చేశారుగా?
ఒపీనియన్స్ చేంజ్ చేసుకోకపోతే పొలిటీషియన్ కాడని కన్యాశుల్కం నాటకంలో ఒక పాత్రధారి అంటాడు. మరి చంద్రబాబు లాంటి రాజకీయ నాయకులు ఆధునిక భారతంలో ఉద్భవిస్తారు అని ఊహించి [more]
ఒపీనియన్స్ చేంజ్ చేసుకోకపోతే పొలిటీషియన్ కాడని కన్యాశుల్కం నాటకంలో ఒక పాత్రధారి అంటాడు. మరి చంద్రబాబు లాంటి రాజకీయ నాయకులు ఆధునిక భారతంలో ఉద్భవిస్తారు అని ఊహించి [more]
ఒపీనియన్స్ చేంజ్ చేసుకోకపోతే పొలిటీషియన్ కాడని కన్యాశుల్కం నాటకంలో ఒక పాత్రధారి అంటాడు. మరి చంద్రబాబు లాంటి రాజకీయ నాయకులు ఆధునిక భారతంలో ఉద్భవిస్తారు అని ఊహించి రాశారో ఏమో కానీ వాస్తవంలో అదే జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఏకంగా ఇపుడు తానే మారిపోయారు అని తెలుగుదేశంలో అతి పెద్ద చర్చ సాగుతోంది. ఈ దేశంలో హిందూత్వ అజెండా ఎవరిది అంటే కచ్చితంగా చెప్పే పేరు బీజేపీదే. ఆ పార్టీతో దోస్తీ చేయాలని చంద్రబాబు గత రెండేళ్లుగా చేయని ప్రయత్నం లేదు. చివరాఖరుకు బాబు తానూ, తన పార్టీని కూడా మార్చేసే రేంజిలోకి వెళ్ళిపోయారు.
ఏ రంగు అయితేనేం…?
పసుపు రంగు టీడీపీది, కాషాయం రంగు బీజేపీది, ఈరెండూ కలిస్తే పారాణి అవుతుంది. పాలిటిక్స్ లో బంపర్ బోణీ కుదురుతుంది అని భావించారో ఏమో కానీ చంద్రబాబు ఒక్కసారిగా రంగూ రూపూ కూడా చేంజ్ చేసేశారు. హిందూత్వ కార్డు తో ఆయన బీజేపీ కంటే రెండు అడుగులు దూరం ముందున్నారు. ఏదో హిందూ కార్డుని అడ్డం పెట్టుకుని తెలుగు రాష్ట్రాలో పాగా వేయాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు చంద్రబాబు అడ్డంగా గండి కొట్టడం కమలం పెద్దలనే విస్తుపోయేలా చేస్తోంది.
ఇది టూమచ్….
ఏ పార్టీ అయినా పొత్తులు పెట్టుకోవడంలో తప్పులేదు. తమకు సిద్ధాంతాలతో సంబంధం లేని పార్టీలతో కూడా రాజకీయ అవసరాల కోసం చాలా పార్టీలు కలుస్తాయి. అంత మాత్రం చేత వారి మూల సిధ్దాంతాలను అసలు మార్చుకోవు. అవే ఏ పార్టీకైనా ఆత్మ. మరి చంద్రబాబు ఎంత దూరం వెళ్లారంటే బీజేపీ పొత్తు కోసం తన పార్టీ మూల సిధ్ధాంతాలకే తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. తాను సైతం బీజేపీ వాదినని గట్టిగానే చెప్పేసుకుంటున్నారు. ఒకనాడు గుళ్ళూ గోపురాల పార్టీ, మసీదులను కూలగొట్టే పార్టీ అని విమర్శలు చేసిన చంద్రబాబుకు ఇపుడు అదే పార్టీ ఫిలాసఫీ దిక్కు అయినా అన్న విమర్శలు వస్తున్నా ఖాతరు చేయడంలేదు.
ఇంతకంటే దారి లేదా…?
ఏపీలో జగన్ ని కొట్టాలంటే ఇంతకంటే పదునైన ఆయుధం వేరేది లేదని చంద్రబాబు బాగా డిసైడ్ అయినట్లుగా ఉందని అంటున్నారు. కులం కార్డు కంటే మతం కార్డు ఇంకా పెద్దది. బీజేపీ బీహార్, యూపీ లాంటి రాష్ట్రాలలో అమలు చేస్తున్నది అదే. చిన్న గీత పక్కన పెద్ద గీత గీసి రాజకీయాలను అనువుగా మార్చుకోవడం అన్న మాట. ఇక ఏపీలో చూస్తే జగన్ అన్ని వర్గాలాకూ చేరువ అవుతున్నారు. దాంతో ఆయన క్రిస్టియన్ మతాన్ని ఆసరా చేసుకుని దెబ్బ కొట్టాలని చంద్రబాబు ఫిక్స్ అయిపోయారు. బీజేపీ హిందూత్వ అజెండా తీసుకున్నా ఏపీలో ఆ పార్టీకి బలం లేదు, దాంతో తానే ఆ కార్డుతో గేరు మారిస్తే ఆశించిన ఫలితాలు వస్తాయని బాబు కొత్త ఆలోచనలే చేస్తున్నారు. అయితే దీని మీద టీడీపీలో రచ్చ అవుతోంది. పార్టీలో చాలా మంది తమ్ముళ్ళు అసంతృప్టి వ్యక్తం చేస్తున్నారుట. జగన్ కోసం మూల సిద్ధాంతాలను వదిలేయడమేంటి అన్న చర్చ అయితే పసుపు శిబిరంలో సాగుతోందిట.