బిగ్ టాస్క్ లో చంద్రబాబు ?
చంద్రబాబు దీక్షా దక్షతలకు అసలైన సవాల్ ఇపుడు ఎదురు అవుతోంది అంటున్నారు. చంద్రబాబు ఎన్నో యుద్ధాల్లో ఆరి తేరిన యోధుడే కావచ్చు కానీ అన్ని యుద్ధాలూ ఒకేలా [more]
చంద్రబాబు దీక్షా దక్షతలకు అసలైన సవాల్ ఇపుడు ఎదురు అవుతోంది అంటున్నారు. చంద్రబాబు ఎన్నో యుద్ధాల్లో ఆరి తేరిన యోధుడే కావచ్చు కానీ అన్ని యుద్ధాలూ ఒకేలా [more]
చంద్రబాబు దీక్షా దక్షతలకు అసలైన సవాల్ ఇపుడు ఎదురు అవుతోంది అంటున్నారు. చంద్రబాబు ఎన్నో యుద్ధాల్లో ఆరి తేరిన యోధుడే కావచ్చు కానీ అన్ని యుద్ధాలూ ఒకేలా ఉండవు. అన్నీ ఎత్తులూ జిత్తులూ కూడా ఎపుడూ పారవు. చంద్రబాబు ఇపుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆయన చుట్టూ తెలియకుండానే పద్మవ్యూహాన్ని ప్రత్యర్ధి పార్టీలు పన్నాయి. దాంతో చంద్రబాబు ఎలా బయటకు వస్తారా అన్నది సొంత పార్టీ వారికే కలవరపెట్టేలా ఉంది.
కాపాడుకోవాలిగా…?
గంప కింద కోళ్ళున్నాయి. పైన గద్దలు తిరుగుతున్నాయి. ఆదమరిస్తే చాలు ఠక్కున దిగివచ్చి లటుక్కున వాటిని పైకి ఎగరేసుకుపోతాయి. ఇదీ టీడీపీలో ఇపుడు చంద్రబాబు పరిస్థితి. ఒక వైపు కాదు రెండు వైపులా కూడా చంద్రబాబుకు ఇబ్బందులు ఇపుడు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ దూకుడు తెలిసిందే. జగన్ ఫస్ట్ టార్గెట్ తెలుగుదేశం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో పాటు ఇపుడు బీజేపీ కూడా రెడీ అవుతోంది. ఆ పార్టీ కూడా తెలుగు తమ్ముళ్లనే గురి పెట్టింది. దాంతో ఇపుడు తమవారిని కాపాడుకోవడం ఎలా అన్నది అతి పెద్ద బెంగగా చంద్రబాబుకు మారిందట.
ఆశపెట్టి మరీ ….
రాజకీయాల్లో ఇపుడు నిబద్ధత నైతికతల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. మునుపటి మాదిరిగా నాయకుడు ఏం చెబితే అది వినేందుకు నేతాశ్రీలు సిధ్ధంగా లేరు. పార్టీ కోణం కంటే కూడా తమకు వ్యక్తిగతంగా ఎంతదాకా లాభం అన్నదే ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో ఇతర పార్టీలు ఆశలు పెట్టినా ప్రలోభాలు కల్పించినా కూడా దానికి లొంగని నాయకులు ఉన్నారంటే నమ్మడం కష్టమే. ఓ వైపు చంద్రబాబు టీడీపీ భవిష్యత్తు గురించి ఎంత ఊదరగొడుతున్నా కూడా నాయకులు తమదైన విశ్లేషణలు చేసుకుంటారు. దాంతో వారు జంప్ చేయడానికి రెడీ అయితే ఆపడం ఎవరి తరం కాదు. కానీ అలా ఆపరేషన్ స్టార్ట్ కాకుండా చూసుకోవడం అన్నదే చంద్రబాబు ముందున్న పెద్ద టాస్క్ లా కనిపిస్తోందిట.
రేసులో వెనకబడి…..
ఏపీలో ఇపుడు తెలుగుదేశం పార్టీ రేసులో వెనకబడి ఉంది. మాట్లాడితే వైసీపీ బీజేపీల గురించే పొలిటికల్ గా చర్చ వస్తోంది. చూసేసిన సినిమాగా టీడీపీని భావించిన వారు, ఇక ఈ పార్టీలో తమకు అవకాశాలు దక్కవు అని భావించే వారు. ఇక వివిధ సమీకరణ కారణంగా పార్టీ పదవులు దక్కని వారు పక్క చూపులు చూస్తున్నారని టాక్. అలాంటి వారిని బతిమాలి బుజ్జగించినా ఎంతకాలం ఉంటారు అన్నది కూడా తెలియడంలేదు. అధికారం ఉంటేనే పార్టీ బతుకుతుంది అన్న సూత్రం అమలవుతున్న వర్తమాన రాజకీయాల్లో టీడీపీ వంటి బలమైన ప్రాంతీయ పార్టీ కూడా దానికి అతీతం కాదని తేలిపోతున్న వేళ చంద్రబాబు వచ్చే ఎన్నికల దాకా టీడీపీని ఈ స్వరూపంలో కాపాడుకోవడం అంటే అంతకంటే పెద్ద పోరాటం వేరేది ఉండదు అంటున్నారు. చూడాలి మరి ఈ విషమ పరిస్థితుల వేళ చంద్రబాబు నాయకత్వ దక్షతలు ఎలా బయటపడతాయో.