టిడిపి కి కాపీయింగ్ కలిసొస్తుందా లేదా ?
తెలుగుదేశం పార్టీ ఇప్పటికి తీరు మార్చుకోవడం లేదు. సొంత వ్యూహాలు లేక రాజకీయాల్లో వరుస షాక్ లు తింటున్నారు సైకిల్ పార్టీ బ్యాచ్. నలభై ఏళ్ళ రాజకీయ [more]
తెలుగుదేశం పార్టీ ఇప్పటికి తీరు మార్చుకోవడం లేదు. సొంత వ్యూహాలు లేక రాజకీయాల్లో వరుస షాక్ లు తింటున్నారు సైకిల్ పార్టీ బ్యాచ్. నలభై ఏళ్ళ రాజకీయ [more]
తెలుగుదేశం పార్టీ ఇప్పటికి తీరు మార్చుకోవడం లేదు. సొంత వ్యూహాలు లేక రాజకీయాల్లో వరుస షాక్ లు తింటున్నారు సైకిల్ పార్టీ బ్యాచ్. నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నా ఎవరో ఒకరి సక్సెస్ ఫార్ములా ఫాలో అయిపోవడం పసుపు పార్టీకి వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయిందన్న విమర్శలు పెరుగుతున్నా దాన్ని వారు పట్టించుకోవడం లేదు. కొత్త ఆలోచనలతో కొనఊపిరితో ఉన్న పార్టీకి ప్రాణ ప్రతిష్ట చేయడానికి వృద్ధ నాయకత్వమే కారణమని పసుపు దళంలో యువతరం నెత్తి నోరుకొట్టుకుంటున్నా వినేవారు ఏరి. ప్రస్తుతం ఎపి లో టిడిపి కి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది బిజెపి. తన స్థానాన్ని కమలం ఆక్రమించేందుకు అనుసరిస్తున్న వ్యూహాలనే టిడిపి ఇప్పుడు కాపీ కొట్టేస్తుంది చంద్రబాబు పార్టీ.
అంతర్వేది నుంచి రామతీర్ధం వరకు …
అంతర్వేది లో రథం దగ్ధం అయిన వెంటనే బిజెపి అనుసరించే అన్ని ఫార్ములాలను ముందే అధినేత చంద్రబాబు అమల్లో పెట్టేశారు. ఇక రామతీర్ధం సంఘటన జరిగాక బాబు తీరే పూర్తిగా మారిపోయింది. కాషాయం పార్టీ సైతం కళ్ళు తేలేసేలా ఆయన ముఖ్యమంత్రి జగన్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి హాట్ టాపిక్ గానే నడుస్తున్నాయి. అక్కడితో ఆయన ఆగితే గా ఎంతో మేధో మథనం చేసి బిజెపి రామతీర్ధం టూ కపిల తీర్ధం రథయాత్ర తలపెడితే మేము ఎక్కడా తగ్గేది లేదని ధర్మ పరిరక్షణ యాత్ర అంటూ తెలుగుదేశం ప్రకటించడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేసింది.
కామ్రేడ్స్ షాక్ తిన్నారుగా …
కామ్రేడ్స్ అయితే ఈ పరిణామాలపై ముక్కున వేలేసుకున్నారు కూడా. సెక్యులర్ పార్టీ గా ఉన్న టిడిపి పూర్తి మత పార్టీగా అవతారం దాల్చడం దీనికి ప్రతిగా మరో సెక్యులర్ పార్టీ వైసిపి అధినేత సైతం పంచి కట్టి గోపూజలకు దిగడం వంటి వి చూసి నోట మాటరావడం లేదు కమ్యూనిస్ట్ లకు. ఎపి లో ఇదేమి చోద్యం రా బాబు అనే పరిస్థితి కి చంద్రబాబుపొలిటికల్ ఎత్తుగడలే కారణమని విశ్లేషకులు భావిస్తుంటే, కొత్తగా ఆలోచించి ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహాలు రచించే స్ట్రాటజిస్ట్ లు ఇప్పుడు టిడిపి కి అత్యవసరం అనే చర్చ సైతం జోరుగానే నడుస్తుంది. లేకపోతే ఈ కాపీయింగ్ తో మరింత వెనక్కి పోతామని పసుపు దళంలో ఆందోళన అధినేత చంద్రబాబు పరిగణలోనికి తీసుకుంటారో లేదో చూడాలి.