చంద్రబాబు స్కెచ్ సక్సెస్… దటీజ్ 40 ఇయర్స్ ఇండ్రస్ట్రీ
ఎవరు ఏమనుకున్నా రాజకీయాల్లో చంద్రబాబు వ్యూహాలు సక్సెస్ అవుతాయి. 90 శాతం సక్సెస్ రేటు ఉంటుందంటారు. నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో కొన్ని సార్లు చంద్రబాబు [more]
ఎవరు ఏమనుకున్నా రాజకీయాల్లో చంద్రబాబు వ్యూహాలు సక్సెస్ అవుతాయి. 90 శాతం సక్సెస్ రేటు ఉంటుందంటారు. నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో కొన్ని సార్లు చంద్రబాబు [more]
ఎవరు ఏమనుకున్నా రాజకీయాల్లో చంద్రబాబు వ్యూహాలు సక్సెస్ అవుతాయి. 90 శాతం సక్సెస్ రేటు ఉంటుందంటారు. నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో కొన్ని సార్లు చంద్రబాబు వ్యూహాలు, నిర్ణయాలు సత్ఫలితాలివ్వకపోయినా కష్టసమయాల్లో మాత్రం ఆయన స్కెచ్ పార్టీని ఒడ్డును పడేసిందంటారు. అందుకే చంద్రబాబు పై పార్టీ నేతలకు అంతటి నమ్మకం. దాదాపు పదిహేను నెలలుగా పార్టీ కోలుకోలేని స్థితిలో ఉంది. ఎవరూ బయటకు వచ్చే పరిస్థితి లేదు.
పదిహేను నెలలుగా…..
మరోవైపు కరోనా కూడా రావడంతో పార్టీ కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు అనేక సార్లు పిలుపు నిచ్చినా పెద్దగా స్పందన కన్పించిందీ లేదు. మరో వైపు ప్రభుత్వం మరింత దూకుడుతో వ్యవహరిస్తుంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు రాజకీయంగా వేసిన స్కెచ్ ఫలించిందంటున్నారు. వాస్తవానికి గత మార్చిలో నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించాల్సి ఉంది.
వాటిని పక్కన పెట్టి….
అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాటిని పక్కన పెట్టి పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే దీని వెనక చంద్రబాబు ఆలోచన ఉందని అంటున్నారు. పంచాయతీ ఎన్నికలు ముందుగా జరిగితే గ్రామాల వారీగా ఓటర్లు చీలిపోతారు. రెండు, మూడు వర్గాలు గ్రామాల వారీగా తయారవతాయ. తర్వాత జరిగే ప్రతి ఎన్నికకు తమకు అనుకూలంగా పరిస్థితులు మారతాయి. దీనికి తోడు తొలుత పంచాయతీ ఎన్నికలు జరిగితే తమకు అన్ని రకాలుగా లాభం ఉంటుందని అంచనా వేశారు.
తిరుపతి ఉప ఎన్నికకు ముందే….?
తిరుపతి ఉప ఎన్నికకు ముందే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే అక్కడ కూడా తమకు సానుకూల ఫలితాలు వస్తాయని చంద్రబాబు భావించారు. చంద్రబాబు భావించినట్లుగానే నామినేషన్లు వేసేందుకు తెలుగుదేశం పార్టీ తరుపున పెద్దయెత్తున క్యాడర్ తరలి రావడం చంద్రబాబులో ఉత్సాహాన్ని నింపిందని చెప్పాలి. ఎన్నికలు జరిగినా, జరగకపోయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ సాయంతో చంద్రబాబు వేసిన స్కెచ్ పార్టీకి లాభించిందనే చెప్పాలి. రానున్న మూడేళ్లలో పార్టీ కార్యక్రమాలు ఊపందుకోవడానికి, క్యాడర్ భయపడకుండా రోడ్డు మీదకు రావడానికి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఉపయోగపడిందనే చెప్పాలి.