చంద్రబాబు వ్యూహం వికటించిందా?
పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. ఏకగ్రీవ ఎన్నికలకు వైసీపీ ప్రభుత్వం ఎక్కువగా మొగ్గు చూపుతుంది. అనేక చోట్ల పంచాయతీల్లో వేలం నిర్వహించి ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుంటున్నారు. అధికార [more]
పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. ఏకగ్రీవ ఎన్నికలకు వైసీపీ ప్రభుత్వం ఎక్కువగా మొగ్గు చూపుతుంది. అనేక చోట్ల పంచాయతీల్లో వేలం నిర్వహించి ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుంటున్నారు. అధికార [more]
పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. ఏకగ్రీవ ఎన్నికలకు వైసీపీ ప్రభుత్వం ఎక్కువగా మొగ్గు చూపుతుంది. అనేక చోట్ల పంచాయతీల్లో వేలం నిర్వహించి ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుంటున్నారు. అధికార పార్టీ వైసీపీ దెబ్బకు టీడీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ ఎన్నికలు గ్రామ స్థాయిలో హోరా హోరా జరుగుతున్న సమయంలో నిధుల సమస్య టీడీపీకి ఇబ్బందికరంగా మారింది.
ఇరవై నెలలుగా….
గత ఇరవై నెలలుగా టీడీపీ నేతలు నియోజకవర్గాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయిన టీడీపీ అభ్యర్థులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాము అసెంబ్లీ ఎన్నికలకు ఖర్చుతో అప్పులు ఊబిలో ఇరుక్కుపోయామని ఇప్పటికే టీడీపీ నేతలు కేంద్ర నాయకత్వానికి చెబుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నందున ఇప్పుడిప్పుడే తమపై ఎలాంటి ఖర్చులను రుద్దవద్దని కొందరు నేతలు మొహమాటం లేకుండా చెబుతున్నారు.
వందల సంఖ్యలో…..
పంచాయతీ ఎన్నికలంటే ఒక్క నియోజకవర్గంలో వందల సంఖ్యలోనే పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపాలంటే కనీసం ఖర్చు లక్షల్లో ఉంటుందంటున్నారు. నిజానికి టీడీపీలో చాలా మంది నేతలు పంచాయతీ ఎన్నికలను ఇప్పుడు కోరుకోలేదంటున్నారు. గ్రామ స్థాయిలో వైసీపీ బలంగా ఉండటంతో ముందు ముందు మరింత బలహీనమవుతామన్న ఆందోళన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతుంది.
ఖర్చుకు వెనకాడుతూ….
ఇప్పటికే కొందరు టీడీపీ మద్దతుదారులు మాజీ ఎమ్మెల్యేల వద్దకు వచ్చి వాపోతున్నారు. తాము నామినేషన్లను వేయలేమని, ఆర్థికంగా ఆదుకుంటే తప్ప ముందుకు వెళ్లలేమని చెబుతున్నారు. ప్రధానంగా రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఈ పరిస్థితి ఉందని టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఆ ప్రాంత నేతల నుంచి సమాచారం వచ్చింది. దీంతో చంద్రబాబు నేతలకు ఎంత హితబోధ చేసినా క్షేత్ర స్థాయిలో ఫలితం లేకుండా పోతుందంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు వ్యూహం పంచాయతీ ఎన్నికల్లో వికటించిందంటున్నారు.