పదాలు పెదవి దాటుతున్నది అందుకేనా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబులో అసహనం రోజురోజుకూ పెరిగిపోతుంది. దీంతో ఆయన కొన్ని పదాలు పెదవి దాటుతుండటం విమర్శలకు తావిస్తున్నాయి. సీనియర్ నేతగా నలభై ఏళ్ల రాజకీయ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబులో అసహనం రోజురోజుకూ పెరిగిపోతుంది. దీంతో ఆయన కొన్ని పదాలు పెదవి దాటుతుండటం విమర్శలకు తావిస్తున్నాయి. సీనియర్ నేతగా నలభై ఏళ్ల రాజకీయ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబులో అసహనం రోజురోజుకూ పెరిగిపోతుంది. దీంతో ఆయన కొన్ని పదాలు పెదవి దాటుతుండటం విమర్శలకు తావిస్తున్నాయి. సీనియర్ నేతగా నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అదుపు తప్పి మాట్లాడుతున్నారన్నది వాస్తవం. ఈ ఫ్రస్టేషన్ కు అనేక కారణాలున్నాయి. ఒకటి వైసీపీ ప్రభుత్వం దూకుడుగా వెళుతుండటం, పార్టీ నేతలను అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెడుతుండటం.
గతంలో బాబు ఆదేశాలు…..
నిజానికి దీనిపై న్యాయపరంగా చంద్రబాబు నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు. టీడీపీ నేతల వ్యాపారాలపై ప్రభుత్వం వేటు వేసినప్పుడు న్యాయస్థానాల ద్వారా అడ్డుకోగలిగారు. కొందరు టీడీపీ నేతలు తమ వ్యాపారాలకు నష్టం వచ్చి ఆర్థికంగా డీలా పడిపోయారు. గతంలో చంద్రబాబు నుంచి ఏ ఆదేశం వెళ్లినా అది క్షేత్రస్థాయిలో అమలు జరిగేది. 2004 నుంచి 2014 వరకూ విపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు చెప్పినట్లే నేతలు నడుచుకునే వారు.
లైట్ తీసుకుంటుండటంతో….
కానీ గడచిన ఇరవై నెలలుగా చంద్రబాబుకు నేతలను కట్టడి చేయడం సాధ్యం కావడం లేదు. పార్టీ ఇది కాకుంటే ఇంకొకటి అన్న ధోరణి నేతల్లో పెరిగిపోయిందంటున్నారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా చేరవేస్తుండటం, దానిని ఏమాత్రం అడ్డుకున్నా ఉన్న కొద్ది పరపతి స్థానికంగా తాము కోల్పోతామన్న ఆందోళన నేతల్లో స్పష్టంగా కన్పిస్తుంది. స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వస్తేనే తమకు వచ్చే ఎన్నికల్లో లాభిస్తుందన్న నమ్మకంతో అనేక మంది నేతలు ఉన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి సయితం తెచ్చారు.
పంచాయతీ ఎన్నికల్లోనూ….
అందుకే చంద్రబాబు పంచాయతీ ఎన్నికలపై ఎంత గొంతుచించుకున్నా తెలుగుతమ్ముళ్లు లైట్ తీసుకున్నారంటారు. స్థానిక ఎమ్మెల్యేల వత్తిడితో కొందరు పోటీ చేయడానికే భయపడుతున్నారన్న విషయం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చింది. తమ చేత బలవంతంగా నామినేషన్ వేసినా ప్రచారం చేయలేమని కొందరు ముందుగానే చెబుతుండటం పార్టీ నేతల్లో ఆందోళనకు కల్గిస్తుంది. అందుకే వరస ఇబ్బందులు నేతలు ఏకరవుతు పెడుతుండటంతోనే చంద్రబాబులో అసహనం ఎక్కువయిందంటున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు విమర్శలకు తావిస్తున్నాయి. ఆయన వయసుకు అలాంటి భాష తగదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినపడుతున్నాయి.