అనుభవం.. అనుభవం.. అనుకుంటే అభాసుపాలవుతున్నారే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ అప్ డేట్ అవుతానంటారు. డెబ్భయి ఏళ్ల వయసయినా 29 ఏళ్ల కుర్రాడిలా తన ఆలోచనలు ఉంటాయంటారు. వయసు పెరిగినా మనసు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ అప్ డేట్ అవుతానంటారు. డెబ్భయి ఏళ్ల వయసయినా 29 ఏళ్ల కుర్రాడిలా తన ఆలోచనలు ఉంటాయంటారు. వయసు పెరిగినా మనసు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ అప్ డేట్ అవుతానంటారు. డెబ్భయి ఏళ్ల వయసయినా 29 ఏళ్ల కుర్రాడిలా తన ఆలోచనలు ఉంటాయంటారు. వయసు పెరిగినా మనసు మాత్రం యంగ్ అని చెబుతుంటారు. కానీ చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ నేతలకు తలనొప్పిగా మారాయి. ఔట్ డేటెడ్ నిర్ణయాలు తీసుకుని పార్టీని ఇబ్బంది పెట్టడమే కాకుండా, ప్రజల్లో చంద్రబాబు సయితం నవ్వుల పాలు అవుతున్నారు.
ఇప్పుడు ఎవరు చెప్పినా….?
పార్టీ నేతలకు ఇది అర్థమవుతున్నా ఆయనకు చెప్పలేని పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు ఇప్పుడు ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేరంటున్నారు. సమావేశానికి వచ్చినా తాను అనుకుంది చెప్పి వెళ్తారు తప్పించి, సీనియర్ నేతల సలహాలు తీసుకోవడం కూడా ఇటీవల కాలంలో మానేశారని పార్టీ వర్గాలే బహిరంగంగా చర్చించుకుంటున్నాయి. ఇటీవల చంద్రబాబు స్వయంగా పంచాయతీ ఎన్నికల మ్యానిఫేస్టో ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు.
మ్యానిఫేస్టోను విడుదల చేసి…..
చంద్రబాబు పంచాయతీ ఎన్నికల మ్యానిఫేస్టో విడుదల చేసి నవ్వుల పాలయ్యారు. పంచాయతీ ఎన్నికలకు ఎప్పుడూ ఇలాంటి మ్యానిఫేస్టోను ఏ పార్టీ విడుదల చేయలేదు. కానీ చంద్రబాబు మాత్రం ఫ్రస్టేషన్ లో , ఏదో ఒకటి చేయాలని, జగన్ ప్రభుత్వాన్ని నిలదీయాలన్న ఉత్సాహంతో మ్యానిఫేస్టో విడుదల చేశారంటున్నారు. ఈ విషయంలో ఎవరినీ సంప్రదించకుండా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు పార్టీ ఇబ్బందుల్లో పడింది. వైసీపీకి ఆయుధంగా దొరికింది.
ముందుగా అభ్యర్థిని ప్రకటించి…..
ఇక తిరుపతి ఉప ఎన్నికల్లోనూ అభ్యర్థి విషయాన్ని ముందుగా ప్రకటించి చంద్రబాబు తప్పుచేశారంటున్నారు. పనబాక లక్ష్మిని మూడు నెలలు ముందుగా ప్రకటించి ఏం సాధించారని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆమె ప్రచారానికే శ్రీకారం చుట్టలేదని, ముందుగా ప్రకటించి చంద్రబాబు ప్రత్యర్థులకు భయం అనేది లేకుండా చేశారంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు ఇటీవల కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడమే కాకుండా, పార్టీకి ఏమాత్రం ఉపయోగం లేకుండా పోతాయంటున్నారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ప్రజల్లో పలుచన కావడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలే కారణమన్న కామెంట్స్ కూడా విన్పిస్తున్నాయి.