మోడీ కొంపముంచడానికే బాబు రెడీ అయ్యారు కానీ…?
చంద్రబాబు అంటే మామూలు రాజకీయ నాయకుడు కారు అని అందరికీ తెలుసు. ఇక ఆయన ముందు చూపు కూడా గొప్పదే. 1994లో ఎన్టీయార్ అధికారంలోకి రారేమోనని డౌట్ [more]
చంద్రబాబు అంటే మామూలు రాజకీయ నాయకుడు కారు అని అందరికీ తెలుసు. ఇక ఆయన ముందు చూపు కూడా గొప్పదే. 1994లో ఎన్టీయార్ అధికారంలోకి రారేమోనని డౌట్ [more]
చంద్రబాబు అంటే మామూలు రాజకీయ నాయకుడు కారు అని అందరికీ తెలుసు. ఇక ఆయన ముందు చూపు కూడా గొప్పదే. 1994లో ఎన్టీయార్ అధికారంలోకి రారేమోనని డౌట్ కొట్టి కాంగ్రెస్ పెద్దలతో చీకటి ఒప్పందం చంద్రబాబు ముందుగా చేసుకున్నారని స్వయంగా ఎన్టీయారే అప్పట్లో ఆరోపించారు. అంతటి దూర దృష్టి బాబు సొంతం. అయితే చంద్రబాబు ఎన్నో ఎత్తులు వేస్తే కొన్ని బ్రహ్మాండంగా పారాయి. మరికొన్ని బెడిసికొట్టాయి. కానీ బాబు పొలిటికల్ కెరీర్ లో అతి పెద్ద ఫెయిల్యూర్ గా 2019 ఎన్నికలనే చెప్పుకోవాలంటారు.
ప్రధాని అయిపోవాలనే….?
చంద్రబాబు ఎన్నో సార్లు అంటూంటారు. తనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా కూడా కేవలం ఏపీ మీద ప్రేమతో ముఖ్యమంత్రి కుర్చీలోనే కుదురుకున్నానని, కానీ 2018 నాటికి చంద్రబాబు ఆశలు అంచనాలు ఏలా ఉన్నాయో చూస్తే మాత్రం వర్తమాన రాజకీయాల మీద బాబుకు ఉన్న ఆలోచనలు అవగాహన ఇంతేనా అనిపిస్తుంది. అప్పట్లో ప్రత్యేక హోదా పేరిట నానా యాగీ చేస్తూ మోడీ సర్కార్ నుంచి టీడీపీ వెనక్కు వచ్చేసింది. ఆ మీదట మోడీని బాబు తిట్టని రోజు లేదు. ధర్మ పోరాట దీక్షలు వగైరాలన్నీ బాబు ఆంధ్ర దేశంలోనూ చేశారు, ఢిల్లీ నడిబొడ్డునా చేశారు. ఇదంతా ఎందుకంటే ప్రధాని పదవి కోసమేనట.
వేల కోట్ల బడ్జెట్ ….
చంద్రబాబు ప్రధాని ప్రయోగానికి పెట్టిన ఖర్చు అక్షరాలా రెండు వేల కోట్ల రూపాయలట. ఈ విషయాన్ని ఆయన పార్టీలో నిన్నటిదాకా ఉన్న ఆయన సామాజికవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెబుతున్నారంటే నమ్మాల్సిందేగా. చంద్రబాబు కర్నాటక, బీహార్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఒడిషాలలో విపక్ష పార్టీలు గెలిచేందుకు చంద్రబాబు నాడు ఖర్చు పెట్టిన సొమ్ముట అది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే ప్రాంతీయ పార్టీల మద్దతుతో తాను దేశ ప్రధాని కావాలని బాబు భారీ స్కెచ్ వేశారని ఆయన చెప్పుకొచ్చారు.
జరిగితే అదిరిపోయేదే …?
ఇక ఏపీలో తన కుమార రత్నం ఫ్యూచర్ ఆఫ్ టీడీపీ లోకేష్ ని ముఖ్యమంత్రిని చేసి ఢిల్లీలో తాను ప్రధానిగా పగ్గాలు అందుకోవాలన్న ఊహలతో చంద్రబాబు తీసిన మల్టీ కలర్ పొలిటికల్ పిక్చర్ రియల్ లైఫ్ లో దారుణంగా చీదేసింది. అంతేనా టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 23 సీట్లకే ఆ పార్టీ పడిపోయింది. అందుకే విపక్ష కుర్చీలోకి వచ్చిన తరువాత చంద్రబాబు మనసు చెదిరి ఏదేదో మాట్లాడేస్తున్నారు అని వల్లభనేని విశ్లేషిస్తున్నారు. అవును కదా. ఇంతటి భారీ బడ్జెట్ మూవీని తీసి హిట్ అవుతుందని నమ్మిన బాబుకు కల చెదిరిపోతే మనసు పాడైపోదా. సరే గతమంతా ఓకే కానీ, ఇపుడైనా చంద్రబాబు ఏపీ రాజకీయాలను సరిగ్గానే అంచనా వేస్తున్నారా అన్నదే పెద్ద డౌట్ మరి.