సొంత సర్వేతో బాబుకు షాక్…?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సర్వేల మీద ఉన్న మమకారం ఎదురుగా నాయకులతో ముఖాముఖీ చేసినా కనిపించదు. కాగితాల మీద రాసిన రాతలను నమ్మి నేతల తలరాతలను [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సర్వేల మీద ఉన్న మమకారం ఎదురుగా నాయకులతో ముఖాముఖీ చేసినా కనిపించదు. కాగితాల మీద రాసిన రాతలను నమ్మి నేతల తలరాతలను [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సర్వేల మీద ఉన్న మమకారం ఎదురుగా నాయకులతో ముఖాముఖీ చేసినా కనిపించదు. కాగితాల మీద రాసిన రాతలను నమ్మి నేతల తలరాతలను మార్చేయడమే చంద్రబాబుకు ఉన్న అలవాటు. అయితే బాబు సర్వేల్లో ఒకటి రెండు తప్ప ఎపుడూ ఏదీ నిజం కాలేదు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్న సర్వేను నమ్మి బాబు తెగ అతి ధీమాను ప్రదర్శిచారు. చివరికి 23కి సీట్లు జారి సీఎం సీటు దిగకతప్పింది కాదు.
సగం బలమేనా…?
తెలుగుదేశం పార్టీని ఎన్టీయార్ ప్రారంభించినపుడు 23 జిల్లాలలో పూర్తిగా ఉండేది. ఇపుడు 13 జిల్లాలకు అది క్షీణించింది. అధికారం పోయి రెండేళ్ళు అవుతున్న వేళ పార్టీ పరిస్థితి ఏంటో చూద్దామని చంద్రబాబు తాజాగా ఒక సర్వే చేయించారుట. ఆ సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయట. మూడు నెలల క్రితం కొత్త కార్యవర్గాలు వేసి అన్ని జిల్లాలలో భారీ ఎత్తున పదవుల పంపిణీ చేశారు. ఇక నాయకులు జనంలో ఉంటూ పార్టీని పవర్ లోకి తెచ్చేస్తారు అని చంద్రబాబు ఫుల్ జోష్ లో ఉన్న వేళ వచ్చిన సర్వే ఫలితాలు సగానికి సగం సైకిల్ పార్టీ గాలి తీసేశాయట.
అర్ధ సెంచరీ షాక్…?
తెలుగుదేశం పార్టీ మొత్తం 175 నియోజకవర్గాల్లో 50 నియోజకవర్గంలో అసలు ఉనికిలోనే లేదని సర్వే ఫలితాలు షాకింగ్ నిజాలు చెప్పేశాయట. ఇక మరో 31 నియోజకవర్గాల్లో నాయకులు ఉన్నా కూడా తమ సొంత పనులు తప్పించి పార్టీని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు అన్నది తేలిన సత్యంగా ఉందిట. దీంతో చంద్రబాబుకు గట్టి షాక్ తగిలింది అంటున్నారు. పార్టీ ఏపీలో చాలా దూకుడుగా పరుగులు తీస్తోందని, ఎపుడు ఎన్నికలు వచ్చిన విజయం తమదేనని ధీమాగా ఉన్న చంద్రబాబుకు తాజా నిజాలు మింగుడు పడనీయడం లేదు అంటున్నారు.
ఎప్పటికీ విపక్షమేనా…?
పార్టీలో ఇపుడున్న పరిస్థితిని అద్ధం పట్టిన ఈ సర్వేను చూసిన తరువాత చంద్రబాబులో ఫస్ట్రేషన్ మరింత పెరిగింది అంటున్నారు. మొత్తం 175 సీట్లలో కేవలం వంద చోట్ల మాత్రమే టీడీపీ ఉనికిని చాటుకుంటోంది అంటే అధినాయకత్వం బెంబేలెత్తిపోదా. ఇక ఈ వంద సీట్లలోనే రేపటి ఎన్నికల్లో పోటీ పడితే సగానికి సగం వచ్చినా ఎప్పటికీ విపక్షం సీటే టీడీపీకి శాశ్వతం అయ్యేట్లుగా ఉందని అంటున్నారు. తమ్ముళ్ళు గత రెండేళ్లుగా పార్టీని పూర్తిగా పట్టించుకోవడం లేదన్నది దాచినా దాగని నిజం. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి విపక్షం మీద ఉక్కు పాదం మోపడం ఒక కారణం అయితే ప్రభుత్వానికి ఎదురెళ్ళి ఇబ్బందులు పడడం ఎందుకన్న ముందు చూపుతోనే మెజారిటీ నేతలు ఉన్నారట. ఇక్కడ చంద్రబాబుకు కూడా తెలిసిన ఒక నగ్న సత్యం ఉంది. చంద్రబాబు తరువాత టీడీపీలో ఫ్యూచర్ లీడర్ ఎవరు అన్న బెంగతోనే నేతలు గమ్మున ఉంటున్నారన్నది ఆ నగ్న సత్యం. మరి ఆ డౌట్ తీరేంతవరకూ టీడీపీకి ఇంతే సంగతులు అనే చెబుతున్నారు.