బాబు సీటుకు ఇక తిరుగులేదా..?
ఓటమి పాలయినా.. పెద్దగా విజయాలు లేకపోయినా చంద్రబాబుకు మాత్రం ఒక విషయం కలసి వచ్చిందనే చెప్పాలి. గత ఇరవై నెలలుగా పడుతున్న టెన్షన్ కు తెరపడిందనే చెప్పాలి. [more]
ఓటమి పాలయినా.. పెద్దగా విజయాలు లేకపోయినా చంద్రబాబుకు మాత్రం ఒక విషయం కలసి వచ్చిందనే చెప్పాలి. గత ఇరవై నెలలుగా పడుతున్న టెన్షన్ కు తెరపడిందనే చెప్పాలి. [more]
ఓటమి పాలయినా.. పెద్దగా విజయాలు లేకపోయినా చంద్రబాబుకు మాత్రం ఒక విషయం కలసి వచ్చిందనే చెప్పాలి. గత ఇరవై నెలలుగా పడుతున్న టెన్షన్ కు తెరపడిందనే చెప్పాలి. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పెద్దగా విజయం సాధించలేకపోయినా పరవాలేదు. అధికార పార్టీ కావడంతో వైసీపీకే ఎడ్జ్ ఉంటుంది. మరి చంద్రబాబుకు ఒరిగిన లాభమేంటి? అదే ఆయన సీటు పదిలం. ఇక పార్టీని ఎవరూ వదిలే అవకాశాలు లేకపోవడం.
అతి తక్కువ స్థానాలతో….
2019 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా 23 స్థానాల్లో మాత్రమే గెలిచింది. హేమా హేమీలందరూ ఓటమి పాలయ్యారు. గత ఇరవై నెలలుగా వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించింది. ఇప్పటికి నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వదిలి వెళ్లిపోయారు. అధికారికంగా పార్టీని వీడకపోయినా వారంతా వైసీపీ మద్దతుదారులుగా మిగిలిపోయారు. ఒకదశలో పార్టీ నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేల వరకూ జారి పోతారన్న ప్రచారం జరిగింది.
నెలకొకరు వీడతారని….
కానీ వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ కుమార్ లు మాత్రమే ఈ ఇరవై నెలల్లో పార్టీని వీడిపోయారు. వీరితో పాటు నెలకు ఒకరు చొప్పున పార్టీని వీడతారని చంద్రబాబుకు కూడా సమాచారం అందింది. అనగాని సత్యప్రసాద్, గొట్టి పాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు లాంటి నేతలు కూడా పార్టీని వీడతారని ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు వీరందరిని కట్టడి చేయడానికి తీవ్రంగానే శ్రమించాల్సి వచ్చింది. గంటాశ్రీనివాసరావు లాంటి నేతలు పార్టీని వీడకపోయినా దూరంగా ఉన్నప్పటికీ పెద్ద నష్టమేమీ లేదని భావిస్తున్నారు.
ప్రతిపక్ష హోదాను….
మరో ఐదారుగురు పార్టీ మారితే చంద్రబాబు ప్రతిపక్ష స్థానానికి ఎసరు వస్తుంది. వైసీపీది కూడా అదే ఆలోచన. ప్రతిపక్షనేతగా చంద్రబాబును తప్పించాలన్నది ఆ పార్టీ వ్యూహం. అయితే పంచాయతీ ఎన్నికలు రావడంతో ఇక పార్టీ ఎమ్మెల్యేలు మారరన్న భరోసా చంద్రబాబులో కలుగుతుంది. గ్రామస్థాయిలో రెండు గ్రూపులుగా విడిపోవడం, ఎమ్మెల్యేలు సయితం తమ అభ్యర్థులను బరిలోకి దించాల్సి రావడంతో ఇక పార్టీని వదిలే ఛాన్స్ లేదంటున్నారు. మొత్తం మీద పంచాయతీ ఎన్నికల్లో విజయాల సంగతి పక్కన పెడితే చంద్రబాబు సీటు మాత్రం పదిలమయిందనే చెప్పాలి.