ఆ రెండు నియోజకవర్గాల్లో.. తికమకపెడుతున్న చంద్రబాబు
రెండు కీలక నియోజకవర్గాలు.. ఇద్దరు నేతల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చూపిస్తున్న ఉదాశీనత.. పార్టీపై ప్రభావం పడుతోందా ? ఆ రెండు నియోజకవర్గాల్లోనూ బలమైన కేడర్ [more]
రెండు కీలక నియోజకవర్గాలు.. ఇద్దరు నేతల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చూపిస్తున్న ఉదాశీనత.. పార్టీపై ప్రభావం పడుతోందా ? ఆ రెండు నియోజకవర్గాల్లోనూ బలమైన కేడర్ [more]
రెండు కీలక నియోజకవర్గాలు.. ఇద్దరు నేతల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చూపిస్తున్న ఉదాశీనత.. పార్టీపై ప్రభావం పడుతోందా ? ఆ రెండు నియోజకవర్గాల్లోనూ బలమైన కేడర్ ఉన్నప్పటికీ.. పార్టీ పుంజుకునే పరిస్థితి లేకుండా పోయిందా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబుకు ముందు నుంచి తెగూ తెంపు వైఖరి ఉండదు. ఏ విషయంలో అయినా నాన్చుతూ ఉంటారు. ఇప్పుడు ఈ రెండు నియోజకవర్గాల విషయంలోనూ అలాగే వ్యవహరిస్తుండడంతో పార్టీ అటూ ఇటూ కాకుండా పోతోంది. ఈ రెండు నియోజకవర్గాలు ఏవో కాదు ఒకటి కృష్ణా జిల్లా తిరువూరు, రెండు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు. ఈ రెండు నియోజక వర్గాలు కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. గత ఎన్నికల్లో ఈ రెండు చోట్లా టీడీపీ ఓడిపోయింది. ఇక్కడ ఓడినా పార్టీ తరపున ఎవరు నాయకులో కూడా సొంత పార్టీ వాళ్లకు.. అక్కడ నేతలుగా ఉన్న వాళ్లకే క్లారిటీ లేదు.
తిరువూరు నియోజకవర్గంలో….
విషయానికి వస్తే.. తిరువూరు నియోజకవర్గంలో నల్లగట్ల స్వామిదాసు పార్టీ కోసం గత రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. గతంలో రెండు సార్లు వరుసగా గెలిచిన ఆయన మూడుసార్లు ఓడారు. గత ఎన్నికల్లో ఆయన్ను పక్కన పెట్టి అప్పటి మంత్రి జవహర్‌కు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అందుకు ఓ కారణం కూడా ఉంది. 2014లో కొవ్వూరులో గెలిచిన జవహర్ ఆ తర్వాత మంత్రి అయ్యారు. నియోజకవర్గంలో ఆయన్ను వ్యతిరేకించే గ్రూప్ చంద్రబాబు సొంత సామాజిక వర్గంలో బలంగా ఉంది. చంద్రబాబు వారి ఒత్తిడికి తలొగ్గే జవహర్‌ను ఆయన సొంత నియోజకవర్గం అయిన కొవ్వూరుకు ఆయనకు ఇష్టం లేకపోయినా పంపారు. తీవ్ర వ్యతిరేక గాలులు వీచినా జవహర్ మిగిలిన పార్టీ నేతలతో పోలిస్తే గట్టి పోటీ ఇచ్చే ఓడారు.
దృష్టంతా కొవ్వూరు మీదనే…?
అనంతరం ఆయన తిరువూరు ఇన్చార్జ్గా ఉన్నా ఇక్కడ మనస్సు నిలవడం లేదు. ఆయన దృష్టంతా కొవ్వూరు మీదే ఉంది. ఎంత సొంత నియోజకవర్గం అయినా.. ఆయన ఇక్కడి టీడీపీ నాయకులకు చేరువ కాలేక పోయారు. ఆయన ఎప్పుడెప్పుడు కొవ్వూరు వెళ్లిపోతానా ? అన్న ఆశలతోనే ఉన్నారు. ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా ఉండడంతో కొవ్వూరు ఎప్పటకి అయినా తనకు దక్కకపోదా ? అని వెయిట్ చేస్తున్నారు. అయితే కొవ్వూరు కమ్మ వర్గం నేతలు మాత్రం జవహర్‌ను అక్కడకు రానివ్వమని భీష్మించుకునే ఉన్నారు. మరోవైపు జవహర్ కొవ్వూరు ఎప్పుడు వెళతారా ? అని స్వామిదాసు కాచుకుని ఉన్నారు. ఆయనకు తిరువూరు పగ్గాలు ఎప్పుడు వస్తాయా ? అని కళ్లుకాయలు కాచిపోయేలా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఇద్దరూ వేచి చూస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలపై…..
ఈ ప్రభావం తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలపై పడుతోంది. ఇద్దరూ బలమైన సామాజిక వర్గాలను తమ వెంట తిప్పుకొనే పరిస్థితి ఉన్నా.. చంద్రబాబు ఎటూ తేల్చకపోవడంతో ఇద్దరు వేచి చూస్తున్న ధోరణి కనిపిస్తోంది. అయితే.. కొవ్వురులో మాత్రం జవహర్ కు గత ఎన్నికలకు ముందున్న వ్యతిరేకత ఎక్కడా తగ్గక పోవడం గమనార్హం. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. దీనిని తగ్గించి.. తనకు పగ్గాలు అప్పగించాలనేది జవహర్ డిమాండ్. నల్లగట్లకు వ్యతిరేకత లేకపోయినా.. బాబు పట్టించుకోకపోవడంతో ఆయన మౌనం పాటిస్తున్నారు. ఎటు తిరిగీ.. రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన కేడర్ ఉన్నా.. బాబు అనుసరిస్తున్న ధోరణితో ఈ రెండు చోట్లా పార్టీ పరిస్థితి ఇబ్బందిగా ఉందనేది వాస్తవం.