జగన్ కి ప్రియమైన బిరుదు ఇచ్చేస్తున్న బాబు ?
చంద్రబాబుకు ఎన్నో బిరుదులు ఉన్నాయి. వాటిలో రాజకీయ దురంధరుడు, అపర చాణక్యుడు, వ్యూహకర్త, మేధావి, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వంటివి ఆనందం కలిగించేవి అయితే వెన్నుపోటు అన్న [more]
చంద్రబాబుకు ఎన్నో బిరుదులు ఉన్నాయి. వాటిలో రాజకీయ దురంధరుడు, అపర చాణక్యుడు, వ్యూహకర్త, మేధావి, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వంటివి ఆనందం కలిగించేవి అయితే వెన్నుపోటు అన్న [more]
చంద్రబాబుకు ఎన్నో బిరుదులు ఉన్నాయి. వాటిలో రాజకీయ దురంధరుడు, అపర చాణక్యుడు, వ్యూహకర్త, మేధావి, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వంటివి ఆనందం కలిగించేవి అయితే వెన్నుపోటు అన్న బిరుదు మాత్రం చేదు కషాయం లాగానే ఉంటుంది. వెన్నుపోటు అంటేనే ఏపీ రాజకీయాల్లో బాబు గుర్తుకు వచ్చేలా చేసింది 1995 పొలిటికల్ ఎపిసోడ్. నిజానికి తెలుగు రాజకీయాల్లో నాదెండ్ల భాస్కరరావుది తొలి వెన్నుపోటు. అయితే ఆయన అన్న గారి కుటుంబ సభ్యుడు కాడు, పైగా ముఖ్యమంత్రి కుర్చీని లాక్కున్నాడు కానీ ఏకంగా పార్టీని, ఆ పార్టీకి ఉన్న బ్యాంక్ ఖాతాలను కూడా హోల్ సేల్ గా లాగేయలేదు. మరో వైపు కన్న బిడ్డలను కూడా ఎన్టీయార్ కి విలన్లుగా చేసి ఎదురు నిలబెట్టలేదు. అందుకే 1995 చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు అంతటి జగద్విఖ్యాతం అంటారు.
మరీ అంత తొందరా …?
తెలంగాణాలో షర్మిల కొత్త పార్టీ పెడతారని ఇప్పటికైతే వట్టి ఊహాగానాలు తప్ప ఇంకా అది ఆచరణలోకి రాలేదు. ఇక మీడియాతో షర్మిల మాట్లాడుతూ జగన్ కి తనకు విభేధాలు ఏవీ లేవన్నట్లుగానే చెప్పుకొచ్చారు. తాను తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తానని అంటున్నారు. ఇలా అంతా క్లారిటీగా ఉండగా సొంత చెల్లెలుకు అన్నగా జగన్ వెన్నుపోటు పొడిచాడు అంటూ చంద్రబాబు అర్జంటుగా అభాండం వేయడం వెనక చవకబారు రాజకీయం తప్ప మరోటి లేదన్నది వాస్తవం.
లాజిక్ ఉందా…?
ఇక షర్మిల తానే స్వయంగా అన్న జగన్ ముఖ్యమంత్రి కావాలని వూరూ వాడా పట్టుకుని తిరిగారు. అటువంటిది షర్మిల ఏదో సీఎం అవుతాను అంటే జగన్ అడ్డుకుని ఆ కుర్చీ లాగేసినట్లుగా చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు అంటూ బాబు విమర్శలు చేయడమే విడ్డూరం. ఇక ఇదే తీరున భవిష్యత్తులో జగని మీద ఆయన వ్యతిరేక ప్రచారం మొదలుపెడతారు అనుకోవాలి. ఇంతకాలం జగన్ని ఫ్రాక్షనిస్ట్, ఫేక్ ముఖ్యమంత్రి, పులివెందుల రాజకీయం అంటూ విమర్శలు చేసిన చంద్రబాబుకు ఈ కొత్త బిరుదు దొరికినట్లు ఉందని అంటున్నారు.
పేటెంటు హక్కులెవరికి …?
పాతికేళ్ళుగా వెన్నుపోటు బిరుదుని బరువుగా మోస్తున్న చంద్రబాబుకు తాను మరీ ఇంత సులువుగా దాన్ని జగన్ కి అప్పగిస్తానని అనుకోని ఉండరు. ఇలా షర్మిల తెలంగాణాలో రాజన్న రాజ్యం అనగానే అలా జగన్ వెన్నుపోటు వీరుడు అంటూ తెగ సంబరంతో హాట్ కామెంట్స్ చేస్తున్నారు. సరే ఇది రాజకీయం, పైగా ప్రజాస్వామ్యం, ఎవరు ఎవరిని ఎన్ని అయినా అనుకోవచ్చు. ఎన్ని విమర్శలు అయినా చేసుకోవచ్చు. కానీ వెన్నుపోటు బిరుదు మీద పేటెంట్ హక్కులు మాత్రం చంద్రబాబువే అని అంతా అనే మాట. అదేలా అంటే సొంత మామను సీఎం సీట్లోంచి కూలదోసి ఏకంగా కుటుంబానికే దూరం చేసిన చంద్రబాబు వెన్నుపోటు తెలుగు జనం అంత తేలికగా మరచిపోతారా. మొత్తానికి తన పక్కన జగన్ కూడా ఉండాలనుకుని వెన్నుపోటు మాట బాబు పదే పదే వాడినా రాజకీయంగా ఆయనకు అంత ఉపయోగం ఉంటుందని కూడా ఎవరూ అనుకోరు.