బాబుకు 38… పవన్ కి 18…మరింకేం…?
రాజకీయాలు అంటే వేరే ఏమీ కాదు కేవలం అంకెల గారడీ అని తలపండిన వారు చెబుతారు. ఎంత మంది జనాలు మన వెనక ఉన్నారు అని కాదు, [more]
రాజకీయాలు అంటే వేరే ఏమీ కాదు కేవలం అంకెల గారడీ అని తలపండిన వారు చెబుతారు. ఎంత మంది జనాలు మన వెనక ఉన్నారు అని కాదు, [more]
రాజకీయాలు అంటే వేరే ఏమీ కాదు కేవలం అంకెల గారడీ అని తలపండిన వారు చెబుతారు. ఎంత మంది జనాలు మన వెనక ఉన్నారు అని కాదు, ఎన్ని ఓట్లు వచ్చాయన్నది ముఖ్యం. అంతే కాదు ఎంత మంది మనకు వ్యతిరేకంగా ఉంటే ఉండొచ్చు గాక. అనుకూలుర ఓట్లు బాక్స్ లో పడితే చాలు, కుర్చీ మనదే, రాజ్యమూ మనదే. మరి ఇవన్నీ తెలుసు కాబట్టే చంద్రబాబు కొత్త సినిమాకు వచ్చిన కలెక్షన్లను ఎక్కువ చెప్పినట్లుగా తరచూ తన పార్టీ గురించి పాపులారిటీని గురించి బాగానే ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు.
అధికారమేనా…?
పంచాయతీ ఎన్నికల్లో 38 శాతం ఓట్ల షేరింగ్ తమకు వచ్చిందని, ఇక వైసీపీ మీద జనాలకు విరక్తి కలిగిందని, వచ్చేది తామేనని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగానే ఢంకా భజాయించారు. మరి గత సార్వత్రిక ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చాయి కదా ఈసారి రెండు శాతం తగ్గాయని ఎవరూ అడగకూడదు, చంద్రబాబు మార్క్ లాజిక్ అలాగే ఉంటుంది. ఏపీలో వైసీపీ పని అయిపోయింది. దానికి పంచాయతీ ఎన్నికలు ఒక ఉదాహరణ అంటూ బాబు అదే పనిగా సౌండ్ చేస్తున్నారు. దాని వల్ల జనాలు అటు నుంచి ఇటు మొగ్గుతారని, అనుకున్న కార్యం అలా నెరవేరుతుందని చంద్రబాబు ఆశ.
ఈయనా అదే రూట్ ….
రాజకీయాలకు కొత్త కావచ్చేమో కానీ ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు పట్లు గుట్లూ అన్నీ జనసేనాని పవన్ కి కూడా బాగానే అలావాటు పడ్డాయి. ఇంకా ఆయన పెదవి విప్పలేదేంటి అని అంతా అనుకుంటున్న వేళ తమ పార్టీకి కూడా పంచాయతీ బాగానే పట్టం కట్టిందని పవన్ తెగ పొంగిపోతున్నాడు. ఏకంగా 18 శాతం ఓటింగ్ జనసేన ఖాతలో పడిందట. ఇక మార్పు మొదలైందట. అధికారంలోకి రేపు వచ్చేది మేమే అన్న ఒక్క మాట అనలేదు కానీ అచ్చం చంద్రబాబు లాగానే పవన్ కూడా ఏపీలో వైసీపీ ఇంటికి వెళ్ళాల్సిందే అనే అర్ధం వచ్చేలా మాట్లాడారు.
వాపుని చూసి …
పంచాయతీ ఎన్నికలకు అసలు ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి సింహ వాటా గ్యారంటీ. దాంతో వారు మురిసిపోతే ఇంతే సంగతులు, ఇక విపక్షాలు కూడా ఇక్కడే తమకు విజయమని సంతోషిస్తే కూడా తప్పే. పైగా ఇవి ముఖ్యమంత్రి ఎన్నికలు కావని జనాలకు కూడా తెలుసు. అసలు ఎన్నికల్లో మాత్రం వారు చంద్రబాబు, జగన్, చంద్రబాబు, పవన్ లను పోలిక చూసుకుని మరీ ఓటేస్తారు. ఇక చంద్రబాబు జగన్ పాలనలోని తేడాను కూడా గమనించి ఓట్లేస్తారు. అలాగే పవన్ రాజకీయ స్థిరత్వం కూడా కచ్చితంగా జనం ముందుకు చర్చకు వస్తుంది. ఇవన్నీ మరచిపోయి చిన్న పిల్లవాడి మాదిరిగా ఒక ప్రశ్నకు ఆన్సర్ తెలుసు కాబట్టి మొత్తం పాస్ అంటే డేంజరే మరీ.