తమ్ముళ్ళ ధిక్కారాల బిగ్ సౌండ్ ?
తెలుగుదేశం పార్టీ క్రమ శిక్షణ కలిగిన పార్టీ. ఎవరూ గీత దాటరు అంటూ చెప్పే గీతా ప్రవచనాలకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. చంద్రబాబు అంటే చండశాసనుడని, ఆయన్ని [more]
తెలుగుదేశం పార్టీ క్రమ శిక్షణ కలిగిన పార్టీ. ఎవరూ గీత దాటరు అంటూ చెప్పే గీతా ప్రవచనాలకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. చంద్రబాబు అంటే చండశాసనుడని, ఆయన్ని [more]
తెలుగుదేశం పార్టీ క్రమ శిక్షణ కలిగిన పార్టీ. ఎవరూ గీత దాటరు అంటూ చెప్పే గీతా ప్రవచనాలకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. చంద్రబాబు అంటే చండశాసనుడని, ఆయన్ని చూస్తేనే చాలు తమ్ముళ్ళు జడుసుకుంటారని చెప్పిన కధలు చందమామ కాలం నాటివిగా మిగిలిపోతున్నాయి. ఏకంగా కుప్పంలోనే పంచాయతీ ఎన్నికల్లో బాబు పరువు పోవడంతో తమ్ముళ్లు కట్టు తప్పేస్తున్నారు. దీనికంటే ముందు కూడా గత ఎన్నికల్లో 23 సీట్లతో చంద్రకళలు టీడీపీలో తగ్గినప్పుడే మరి కొందరు నాయకులు ధిక్కరించేశారు.
లైట్ తీసుకుంటున్నారా….?
చంద్రబాబుని ఇంద్రుడు చంద్రుడు అని భుజానికెత్తుకుని మోసే అనుకూల మీడియా ఉంటే ఉండొచ్చు గాక కానీ తమ్ముళ్ళకు కూడా సొంత వివేచన ఉంది కదా. వారికి కూడా వాస్తవాలు తెలుస్తాయి కదా. అందుకే ఇపుడు వారు టీడీపీ అధినాయకుని వైఖరిని తప్పు పడుతున్నారు. తమకు తాముగా గొంతు విప్పుతున్నారు. చంద్రబాబు చాణక్యం చేయగలడు కానీ ప్రజాబలాన్ని సానుకూలం చేసుకోలేడు అన్న నిజం తెలిసిన తరువాత కేశినేని నానిలే కాదు మరింతమంది నేతలు కూడా గొంతు పెద్దది చేస్తారు. నిజానికి టీడీపీ దారుణంగా ఓడిన తరువాత చంద్రబాబు ఆదేశాలను లైట్ తీసుకుంటున్న నేతలు పసుపు పార్టీలో అంతకంతకు పెరిగిపోతున్నారు.
నేనే అంటున్న నాని….
రాజ్యం వీర భోజ్యం అన్నారు. గెలిచే వాడే మొనగాడు, ఓడినా కూడా గొప్పే అనుకునే వారిని వారికి మద్దతుగా నిలుస్తున్న పెద్దలకు కూడా విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా గట్టి హెచ్చరికలే జారీ చేశారు. ఆరుగురు ఎమ్మెల్యేలు ఓడిన చోట గెలిచిన ఎంపీని నేను అంటూ నాని పలికిన పలుకుకు అధినాయకత్వానికే చురకలు అని చెప్పుకోవాలి. ప్రజల ఓట్లతో గెలిచాను అంటున్న నాని తాను ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ పార్లమెంట్ లో బిల్లు పెడితే చంద్రబాబునే ఎదిరించి నిలబడ్డాడని కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తానికి కేశినేని నాని పార్టీ ఓడిన తరువాత నుంచే గొంతు పెంచారు. పంచాయతీల్ పార్టీ పరువు పోయిన తరువాత మరింతగా స్వరం మార్చారు అంటున్నారు.
ఇదే తోవలో….
ఇక విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే తాను సర్వ స్వతంత్రుడిగానే వ్యవహరిస్తున్నారు. ఆయన తన మానాన తాను టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి చంద్రబాబుకే షాక్ ఇచ్చేశారు. ఇక గంటా రాజకీయం ఎప్పటినుంచో టీడీపీ సైకిల్ కి ఎదురుగా సాగుతోంది. ఇంకో వైపు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అయితే సొంతంగా స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. స్టీల్ ప్రైవేటీకరణ విషయం మీద వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే టీడీపీ అక్కడ పోటీకి పెట్టదు, ఇది నా మాట అంటున్నారు. మరో వైపు కాబోయే హోం మంత్రిని తానేనని చెప్పేసుకుంటున్నారు. ఇప్పటికీ కొందరు పార్టీ బాధ్యులు జనంలోకి అసలు రారు, మాజీ మంత్రులు చంద్రబాబు ఆదేశాలు ఏ కోశానా పట్టించుకోరు. మొత్తానికి కుప్పంలో పంచాయతీలు ఓడాక బాబుకు తమ్ముళ్ళ తలనొప్పులు ఎక్కువ అయ్యాయి. ఇక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో కూడా ఓడిపోతే టీడీపీకి ఇంకెన్ని ఇబ్బందులు వస్తాయో చూడాలి.