చంద్రబాబు ఆఖరి అస్త్రం అదేనట…?
ప్రత్యేక హోదా అంటే ఏంటి అని ఎవరినైనా అడిగితే గబుక్కున సమాధానం చెప్పలేరు. అసలు హోదా అంటూ గొంతు చించుకుని అరచిన బీజేపీ నేతలు కూడా ప్రత్యేక [more]
ప్రత్యేక హోదా అంటే ఏంటి అని ఎవరినైనా అడిగితే గబుక్కున సమాధానం చెప్పలేరు. అసలు హోదా అంటూ గొంతు చించుకుని అరచిన బీజేపీ నేతలు కూడా ప్రత్యేక [more]
ప్రత్యేక హోదా అంటే ఏంటి అని ఎవరినైనా అడిగితే గబుక్కున సమాధానం చెప్పలేరు. అసలు హోదా అంటూ గొంతు చించుకుని అరచిన బీజేపీ నేతలు కూడా ప్రత్యేక హోదా గురించి అసలే ఏమీ చెప్పలేరు. ఇక హోదా ఏపీలో జనాలకు ఎంతవరకూ గుర్తు ఉందో ఎవరికీ తెలియదు. కానీ రాజకీయ నాయకులు మాత్రం ప్రత్యేక హోదాను ఏ సమయాన అయినా కూడా తమ ఆయుధంగా మార్చుకోగలరు, అవసరం అయితే వాళ్ళే గుర్తు చేసి మరీ జనాలను ఇరిటేట్ చేయగలరు. హోదా గీదా జాంతా నై అంటూ ఓ వైపు బీజేపీ కన్నెర్ర చేస్తూంటే వైసీపీ మాత్రం ప్లీజ్ హోదా గురించి చూడండి అని అపుడపుడు అంటోంది. ఇపుడు అదే ప్రత్యేక హోదాతోనే ఎన్నికల గోదాలోకి దూకేయడానికి టీడీపీ రెడీ అయిపోతోంది.
హిట్ అవుతుందా…?
మునిసిపల్ ఎన్నికల వేళ ప్రత్యేక హోదాను ఒక ఆయుధంగా వాడుకోవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మధ్య విశాఖ వచ్చిన చంద్రబాబు కూడా ప్రత్యేక హోదా ఏమైంది జగన్ అంటూ గట్టిగానే గర్జించారు. మునిసిపాలిటీలలో విద్యావంతులు, మేధావులు, చదువరులు ఉంటారు కాబట్టి హోదా అంశం ఆటంబాంబులా పేలుతుంది అని టీడీపీ పెద్దలు విశ్వసిస్తున్నారు. మరీ ముఖ్యంగా విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రత్యేక హోదా తోక పట్టుకుని ఈదేయాలని టీడీపీ గట్టిగానే డిసైడ్ అయిందట.
సెంటిమెంట్ దెబ్బ….
విశాఖ విషయంలో జనాలను రెచ్చగొట్టడానికి టీడీపీ వద్ద అనేక అంశాలు ఉన్నాయట. అందులో అగ్ర తాంబూలం ప్రత్యేక హోదాదే అని అంటున్నారు. ఆ తరువాత విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని కూడా రగిలించి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. అదే సమయంలో స్మార్ట్ సిటీగా, ఆర్ధిక రాజధానిగా ఉన్న విశాఖకు జగన్ ఏమీ చేయలేదని కూడా టీడీపీ గట్టిగా ప్రచారం చేయనుందని అంటున్నారు. 22 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదాను తేలేని జగన్ అభివృద్ధి నిరోధకుడు అంటూ జనాల్లో వైసీపీకి తీవ్ర వ్యతిరేకత పెంచడానికి పసుపు పార్టీ పెద్ద ప్లాన్లే వేస్తోందిట. హోదా సెంటిమెంట్ అస్త్రం విశాఖలో బాగా పండుతుందని కూడా తమ్ముళ్ళు ఆలోచిస్తున్నారుట.
రోడ్లే ఉదాహరణగా….
రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలలో రోడ్లు దారుణంగా ఉన్నాయని, రెండేళ్ల అధికారంలో జగన్ ఏం చేశారని, చెంచాడు సిమెంట్ కూడా వేసి రోడ్ల మీద గోతులను పూడ్చలేకపోయారని టీడీపీ ప్రధాన అభియోగం, అదే విధంగా ఆర్ధిక రాజధానిగా తాము విశాఖను చేస్తే జగన్ రాజధాని అంటూ ఏమీ లేకుండా చేశాడని కూడా టీడీపీ గట్టిగానే విమర్శలు సంధించనుందిట. మరి ఇవన్నీ జనాల బుర్రల్లోకి ఎక్కుతాయా. వైసీపీని దించేసి టీడీపీని నెత్తి మీద పెట్టుకుంటారా. ప్రత్యేక హోదాతో మునిసిపోల్స్ లో లిట్మస్ టెస్ట్ చేయడానికి సిద్ధపడిన టీడీపీకి సక్సెస్ రూట్ జనాలు చూపిస్తారా అంటే రాజకీయ తెర మీద ఇవన్నీ చూడాల్సిందే.