టీడీపీలో కలి పుట్టిస్తున్న కుప్పం…?
కుప్పం. ఈ పేరు వింటే తెలుగుదేశం శ్రేణులకు ఒక రకమైన ఉత్తేజం కలుగుతుంది. ఇక్కడ నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు ఏడుసార్లు పోటీ చేసి ఎదురులేని నేతగా [more]
కుప్పం. ఈ పేరు వింటే తెలుగుదేశం శ్రేణులకు ఒక రకమైన ఉత్తేజం కలుగుతుంది. ఇక్కడ నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు ఏడుసార్లు పోటీ చేసి ఎదురులేని నేతగా [more]
కుప్పం. ఈ పేరు వింటే తెలుగుదేశం శ్రేణులకు ఒక రకమైన ఉత్తేజం కలుగుతుంది. ఇక్కడ నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు ఏడుసార్లు పోటీ చేసి ఎదురులేని నేతగా నిలిచారు. తొలిసారి కుప్పం నుంచి 1989లో పోటీ చేస్తే చంద్రబాబు నాటి అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ గా రాష్ట్రవ్యాప్తంగా ఎదిగారు. 1994లో పోటీ చేస్తే కీలకమైన రెవిన్యూ, ఆర్ధిక శాఖ మంత్రిత్వ శాఖలను చేపట్టారు. ఆ మీదట ఎనిమిది నెలలు తిరగకుండానే ఏపీకి సీఎం కూడా అయ్యారు. అది లగాయితూ చంద్రబాబు ముమ్మారు సీఎం గా మరో మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా రాణిస్తున్నారు. తాము ఓటేసి గెలిపించిన చంద్రబాబు ఏపీలోనూ, జాతీయ స్థాయిలోనూ వెలుగొందడం కుప్పం వాసులకు కూడా ఆనందం కలిగించే విషయమే.
తీర్పుతో మార్పు…..
అటువంటి కుప్పం ఒక్కసారిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంది. చంద్రబాబు అంతటి నాయకుడు 2019లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తొలి రెండు రౌండ్లూ వెనకబడడం అప్పట్లోనే సంచలనం అయింది. ఇక ఆ తరువాత చూస్తే పంచాయతీ ఎన్నికల్లో అతి పెద్ద బొక్క పడిపోయింది. ఏకంగా 88 పంచాయతీలకు గానూ 74 వైసీపీ పరం అయ్యాయి అంటే చంద్రబాబుకు, ఆయన పార్టీ టీడీపీకి కూసాలు మొత్తం కదిలిపోయినట్లే అయ్యాయి.
వినకూడని మాట….
ఇక పంచాయతీ ఎన్నికల ఫలితాల తరువాత కుప్పంలో ఏం జరిగిందో అని కంగారు పడి హడావుడిగా పరుగులు తీశారు చంద్రబాబు. మూడు రోజుల పాటు ఆయన సొంత నియోజకవర్గంలో టూర్ చేశారు. అయితే చంద్రబాబుకు ఈసారి అనూహ్యమైన పరిణామాలే ఎదురయ్యాయని చెప్పాలి. కుప్పంలో ఎక్కడ చూసినా సినీ నటుడు జూనియర్ ఎన్టీయార్ ఫ్లెక్సీలు కనిపించాయి. అంతే కాదు బాబు ప్రసంగానికి అడ్డు తగులుతూ జై జూనియర్ ఎన్టీయార్ నినాదాలూ వినిపించాయి. జూనియర్ ని తీసుకువచ్చి ప్రచారం చేయించాలని ఆయనకు ఓటేసి ఆదరించిన ప్రియమైన కుప్పం వాసులు కోరడం నిజంగా చంద్రబాబుకు షాక్ లాంటి పరిణామమే.
అనుకున్నది ఒకటి…?
తాను ఉన్నాను అని ధైర్యం చెబుదామని చంద్రబాబు కుప్పం టూర్ చేస్తే పార్టీ క్యాడర్ రివర్స్ లో బాబుకు గాలి తీసేసింది. చంద్రబాబు ఎదురుగానే జూనియర్ నామస్మరణ చేయడం అంటే బాబు అవుట్ డేటెడ్ అని చెప్పకనే చెప్పేసినట్లే కదా. అంతే కాదు, లోకేష్ ని ఫ్యూచర్ లీడర్ గా టీడీపీలో అసలు ఒప్పుకోవడంలేదు అన్నది కూడా అర్ధమైపోతోంది కదా. చంద్రబాబు తెలివిగా నందమూరి వంశాన్ని తప్పించి నారా వారికి తెలుగుదేశాన్ని స్థిరం చేశారు. తన వరకూ నాయకత్వ లక్షణాలతో పార్టీని సమర్ధంగానే పాతికేళ్ళ పాటు నడిపారు. రెండు సార్లు అధికారంలోకి తెచ్చారు. ఇక యువ సీఎం జగన్ ముందు చంద్రబాబు కూడా సరిపోడని కుప్పం జనమే తీర్మానించడమే ఇక్కడ విశేషం. పైగా బాబుకు వయసు అయిపోయిందని, లోకేష్ నాయకత్వ పటిమ మీద డౌట్లు ఉన్నాయని కచ్చితమైన నిజాన్నే చంద్రబాబుకు ఎదురుపడి మరీ చెప్పారనుకోవాలి. మొత్తానికి కుప్పం జనాలూ, పార్టీ క్యాడర్ బాబుకు వినిపించిన భవిష్యత్తు వాణితో పాటు జూనియర్ కావాలని కోరిన తీరుతో టీడీపీలో కలి పుట్టిందని అంటున్నారు.