కళ్ళు తెరిచినా… మూసినా జగనే…?
రాజకీయాలు ఎంతలా మారిపోయాయంటే ప్రత్యర్ధిని పట్టుకుని ఎన్ని కొత్త తిట్లు తిడితే అంతలా ఓట్లు పడతాయని అధినాయకులు ఫిక్స్ అయిపోయారు. దేశంలో ఎంతటి పెద్ద నాయకుడు అయినా [more]
రాజకీయాలు ఎంతలా మారిపోయాయంటే ప్రత్యర్ధిని పట్టుకుని ఎన్ని కొత్త తిట్లు తిడితే అంతలా ఓట్లు పడతాయని అధినాయకులు ఫిక్స్ అయిపోయారు. దేశంలో ఎంతటి పెద్ద నాయకుడు అయినా [more]
రాజకీయాలు ఎంతలా మారిపోయాయంటే ప్రత్యర్ధిని పట్టుకుని ఎన్ని కొత్త తిట్లు తిడితే అంతలా ఓట్లు పడతాయని అధినాయకులు ఫిక్స్ అయిపోయారు. దేశంలో ఎంతటి పెద్ద నాయకుడు అయినా సరే మైక్ ముందుకు రాగానే తాను చేసిన పనులు చెప్పరు, తాను ఏం చేయబోతున్నదీ అసలు చెప్పరు. ఎదుటి పక్షాన్ని నానా రకాలుగా తిట్టడనే పనిగా పెట్టుకుంటున్నారు. మరి దీని వల్ల ఓట్లు నిజంగా రాలుతాయా అంటే అసలు రాలవు అని తేలుతూనే ఉంది. దేశంలో 2014, 2019 ఎన్నికల్లో జనాలు బీజేపీని గెలిపించారు అంటే ఆ పార్టీ మీద ఆశలు పెంచుకుని, పనితీరు చూసి అనుకోవాలి. 2014లో ఏపీలో చంద్రబాబుని గెలిపించినా, 2019లో జగన్ కి అవకాశం ఇచ్చినా వారి నాయకత్వం మీద నమ్మకంతో తప్ప మరోటి కానే కాదు.
బాబు మారరుగా…?
ఇక ఏపీలో చూస్తే చంద్రబాబుకు కనులు తెరచినా మూసినా జగనే కనిపిస్తున్నారు. జగన్ పేరు ఆయన రోజులో తక్కువలో తక్కువ కొన్ని వందల సార్లు జపిస్తూ వస్తున్నారు. నిజమే తన చేతిలో అధికారాన్ని జగన్ లాగేసుకున్నాడు అన్న అక్కసు ఉంటుంది. మరి ఇంతటి పెద్ద మనిషి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబు దాన్ని దాటుకుని వాస్తవంలోకి రాలేకపోతే ఎలా పార్టీ బాగుపడుతుంది. జగన్ని తిడితే ఓట్లు పడతాయి అనుకుంటే బాబు కంటే చాలా బాగా సినీ డైలాగులు వల్లిస్తూ పవన్ కళ్యాణ్ కూడా తిట్టగలరు. మరి చంద్రబాబు మాత్రం తాను మారను గాక మారను అంటున్నారు.
ఉచిత ప్రచారం ….
జగన్ సైలెంట్ గా ఉంటారు. ఆయన మీడియా ముందుకు రారు, జనాలకు కనిపించరు, కానీ ఆయన పేరుని సొంత పార్టీ వారి కంటే ఎక్కువగా చంద్రబాబు, లోకేష్ జపిస్తారు. ఇది చాలదా జగన్ కి ఉచిత ప్రచారంగా ఉపయోగపడడానికి. జగన్ మీద జనాలకు వ్యతిరేకత ఉంటే అది టీడీపీకే ఎందుకు టర్న్ అవాలి. ఏపీలో బీజేపీ జనసేన కూటమి కూడా ఉన్నాయి కదా. తాను ఏం చేస్తానో చెబితేనే కదా చంద్రబాబుని జనాలు మరోసారి ఎన్నుకునేది. ఈ మౌలికమైన విషయాన్ని వదిలేసి బాబు జగన్ మీద నిత్యం విమర్శలు చేస్తూ నేల విడిచేశారు. దాంతోనే పంచాయతీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్నారు.
పడకేసింది…..
ఇక మరో వైపు చూసుకుంటే ఏపీలో బలమైన టీడీపీ పడకేసింది. క్షేత్ర స్థాయిలో కూడా క్యాడర్ చెదురుతోంది. చంద్రబాబుకు వయసు అయిపోయింది అన్న భావన ఇపుడు దిగువ స్థాయిలో కూడా చర్చకు వస్తోంది. చంద్రబాబు పడుతున్న ఆరాటం, ఆయన పేలవమైన పోరాటాన్ని చూసి తమ్ముళ్ళే సందేహపడుతున్నారు. అయినా చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. స్థానిక ఎన్నికలలో ఈ విపరీత ప్రచారం ఏంటి. దాదాపుగా పదిహేను వందలకు పైగా పార్టీ పదవులు నాయకులకు పంపిణీ చేశారుగా. మరి వారంతా ఏమైనట్లు. వారికి బాధ్యతలు అప్పగించి చంద్రబాబు డైరెక్షన్ కే పరిమితం అయితే చాలదా. ఎన్ని చేసినా అధికార పార్టీకే మొగ్గు అన్నది తెలియదా. మొత్తానికి చంద్రబాబు అభాసుపాలు అవుతున్నారు. జగన్ ఫోబియాలో పడి యాక్షన్ ప్లాన్ ఏదీ లేకుండా చేతులెత్తేశారు.
..