బాబు ఆ హడావిడి ఎందుకు చేయడం లేదు?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏదీ కలసి రావడం లేదు. గతంలో తాను తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయనను ప్రశ్నిస్తున్నాయి. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెయిరీలను [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏదీ కలసి రావడం లేదు. గతంలో తాను తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయనను ప్రశ్నిస్తున్నాయి. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెయిరీలను [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏదీ కలసి రావడం లేదు. గతంలో తాను తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయనను ప్రశ్నిస్తున్నాయి. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెయిరీలను మూసివేసిన సంఘటనను ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. తన హెరిటేజీ లాభాల బాటలో పయనించేందుకే చంద్రబాబు ప్రభుత్వ డెయిరీలను మూసివేసే దిశగా నిర్ణయం తీసుకున్నారని, చంద్రబాబు తన హయాంలో అనేక ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మంచి అవకాశమే అయినా…
నిజానికి మూడు రాజధానుల అంశం నుంచి విశాఖలో టీడీపీ నిలదొక్కుకోవాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఉద్యమం లో చంద్రబాబు కీలక పాత్ర పోషించాలి. ఇసుక కొరత, అక్రమ కేసులు వంటి వాటిపై దీక్షకు దిగే చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారన్న ప్రశ్నలు వినపడుతున్నాయి. ముందుగానే తన పార్టీకి చెందిన పల్లా శ్రీనివాసరావు చేత దీక్ష చేయించి చంద్రబాబు మమ అనిపించేశారు.
వ్యతిరేకత ఉన్న ప్రాంతంలో….
విశాఖకు పరిపాలన రాజధాని వద్దన్నప్పుడు ఉత్తరాంధ్రలో ప్రజలు చంద్రబాబుకు వ్యతిరేకమయ్యారు. కొండ్రుమురళి వంటి నేతలు చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపట్టారు. మూడు రాజధానుల జగన్ ప్రతిపాదనను స్వాగతించారు. ఈ సమయంలో అనుకోకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం వచ్చింది. అయితే దీనిపై మోదీకి చంద్రబాబు ఒక లేఖ రాసి ఊరుకున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
పూర్వ వైభవం తెచ్చేందుకు…..
ఉత్తరాంధ్రలో టీడీపీకి క్షేత్రస్థాయిలో బలం ఉంది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి ప్రత్యేక మైన ఓటు బ్యాంకు ఉంది. కానీ మొన్నటి ఎన్నికల్లో జగన్ దానిని ఎగురేసుకుపోయారు. ఈ నేపథ్యంలో పార్టీకి పూర్వవైభవం తేవాలంటే చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగాలంటున్నారు. అయినే దానికి, కాని దానికి దీక్షలకు దిగే చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు దిగడంలేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరించారని, అందుకే ఇప్పడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు సీరియస్ ఎఫెర్ట్ పెట్టడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి.