పతనం ఇంత తొందరగా…?
తెలుగుదేశం పార్టీ అంటే క్యాడర్ బేస్డ్ పార్టీ అని ఎవరైనా చెబుతారు. దేశంలో అతి తక్కువ పార్టీలకే ఈ రకమైన అంకితభావం కలిగిన క్యాడర్ ఉంది. ఇక [more]
తెలుగుదేశం పార్టీ అంటే క్యాడర్ బేస్డ్ పార్టీ అని ఎవరైనా చెబుతారు. దేశంలో అతి తక్కువ పార్టీలకే ఈ రకమైన అంకితభావం కలిగిన క్యాడర్ ఉంది. ఇక [more]
తెలుగుదేశం పార్టీ అంటే క్యాడర్ బేస్డ్ పార్టీ అని ఎవరైనా చెబుతారు. దేశంలో అతి తక్కువ పార్టీలకే ఈ రకమైన అంకితభావం కలిగిన క్యాడర్ ఉంది. ఇక పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంది. టీడీపీకి ఏపీ కంచుకోట అని ఒక మాట కూడా ఉంది. తెలంగాణాలో తెలుగుదేశం వీక్ అయిన సందర్భంలో కూడా ఏపీ కాపు కాసింది. అటువంటి టీడీపీని ఒక్క దెబ్బకు వైసీపీ చిత్తు చేసి పారేసింది. జగన్ మాస్టర్ ప్లాన్ తో కూకటి వేళ్ళతో టీడీపీ కదిలిపోయేలా ఉంది.
లీడర్లు మారరా…?
కాంగ్రెస్ పార్టీ కల్చర్ నిండా తెలుగుదేశంలో ప్రవేశించింది. వర్గాలుగా నేతలు విడిపోయారు. అంతే కాదు ఒక నాయకుడిని మరొకరు ఓడించడం అన్నది కూడా అలవాటు చేసుకున్నారు. నిజానికి చంద్రబాబు మాట ఫైనల్ అని ఇప్పటిదాకా నాయకులు అంతా పనిచేసిన వాతావరణం ఉండేది. నచ్చకపోయినా చంద్రబాబు చెప్పారు కాబట్టి పార్టీకి చమటోడ్చేవారు. కానీ ఇపుడు బాబునే ధిక్కరిస్తున్నారు. తెలుగుదేశానికి ఎంతో బలమున్న విజయవాడ నడిబొడ్డున పార్టీ పరువును ఏడు గోతుల లోతున తీసి పాతేశారు. బుద్దా వెంకన్న బోండా ఉమా లాంటి వారు బాహాటంగా కేశినేని నాని కూతురు మేయర్ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించడమే కాదు ఓడించారు అన్న ప్రచారం కూడా పార్టీలో జోరుగా సాగుతోంది.
దొరికిపోయారా….?
విజయవాడలో ఇరవై మంది అభ్యర్ధుల దాకా ఓడిపోవడానికి టీడీపీ పెద్దలు కారణమని యదుపాటి రామయ్య అనే నాయకుడు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ ఇపుడు వైరల్ అవుతోంది. బుద్దా వెంకన్నను ఉద్దేశించే ఇలా పెట్టారని అంటున్నారు. మరి ఇంత పెద్ద సంఖ్యలో పార్టీ అభ్యర్ధులు ఓడిపోవడానికి సొంత పార్టీయే కారణమని క్యాడర్ ఆక్రోసిస్తూంటే ఇక ఆ పార్టీకి గతీ గత్యంతరం ఉంటాయా. చంద్రబాబు సైతం విజయవాడ గొడవలను తీర్చలేక దండం పెట్టేసిన సీన్ కూడా కనిపించింది. చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి వస్తే ఆయన వాహనంలో లోకల్ ఎంపీగా కేశినేని నాని కనిపించకపోవడం పెద్ద చర్చ అయింది. మరి చంద్రబాబు ఇదంతా చూసినా సరిచేయలేకపోయారు అంటేనే పట్టు జారుతోంది అని అర్ధం చేసుకోవాలి.
జగన్ చేస్తున్నది అదే ….
తెలుగుదేశం పార్టీని ఎక్కడ కొట్టాలో అక్కడే జగన్ కొడుతున్నారు. మిగిలిన పార్టీలలో నాయకులు వెళ్తే ఆ పార్టీ ఖతం అవుతుంది. టీడీపీ అలాంటిది కాదు, అందుకే క్యాడర్ కే లీడర్ల మీద విశ్వాసం లేకుండా ఉన్న సీన్ ని జగన్ క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు. పెద్ద నాయకుల మీద వైసీపీ నిఘా ఉంటోంది. వారు బయటకు వచ్చి క్యాడర్ వెంట నిలువలేని పరిస్థితి తాజాగా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో అంతా చూశారు. ఇక టీడీపీలో నేతల మధ్య విభేధాలు కూడా దీనికి కి ఆజ్యం పోస్తున్నాయి. విశాఖలో కూడా పదవులు అనుభవించిన నాయకులు ఎవరూ స్థానిక ఎన్నికల ప్రచారానికి రాలేదు. ఇదేమని చంద్రబాబు కూడా అడగలేని నిస్సహయతలో ఉన్నారు. మొత్తానికి చూస్తే తెలుగుదేశం పార్టీ పతనం ఇంత తొందరగా జరుగుతుంది అని కరడు కట్టిన అభిమానులు కూడా ఊహించడంలేదు. దానికి వైసీపీ సగం కారణం అయితే మిగిలిన పనిని పసుపు తమ్ముళ్ళే పూర్తి చేస్తున్నారు అంటున్నారు.