బాబుని చూస్తే జనాలు ఓట్లేయరా ?
అవును జనాలు మారిపోయారు. కొత్త ట్రెండ్ నడుస్తోంది ఇపుడు. చంద్రబాబు పాతికేళ్ళ క్రితం సీఎం అయ్యేనాటికీ నేటికీ చాలా తేడాయే వచ్చేసింది. అపుడు బోలెడు కబుర్లు చెబితే [more]
అవును జనాలు మారిపోయారు. కొత్త ట్రెండ్ నడుస్తోంది ఇపుడు. చంద్రబాబు పాతికేళ్ళ క్రితం సీఎం అయ్యేనాటికీ నేటికీ చాలా తేడాయే వచ్చేసింది. అపుడు బోలెడు కబుర్లు చెబితే [more]
అవును జనాలు మారిపోయారు. కొత్త ట్రెండ్ నడుస్తోంది ఇపుడు. చంద్రబాబు పాతికేళ్ళ క్రితం సీఎం అయ్యేనాటికీ నేటికీ చాలా తేడాయే వచ్చేసింది. అపుడు బోలెడు కబుర్లు చెబితే జనాలు నమ్మేవారు. మా మంచి బాబే అని ఓట్లేసేవారు. ఇపుడు తమకు పని జరగాలని చూస్తున్నారు. ఎవరు అధికారంలో ఉంటే మాకేంటి. మాకు రావాల్సినవి వచ్చాయా లేవా ఇదే సగటు ఓటరు ఆలోచన. ఈ పరిస్థితులు చంద్రబాబు లాంటి వారికి ఇబ్బంది పెట్టేవే. బాబు హామీలు అయితే బాగానే ఇస్తారు, పని మాత్రం చేయరు అని అంటారు. అదే మాటను ఇపుడు సొంత పార్టీలోనూ తమ్ముళ్ళే అంటున్నారు.
టీడీపీ పని సరి ….
శ్రీకాకుళం జిల్లాలో బలమైన నాయకుడిగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న అచ్చెన్నాయుడి ఇలాకాలోనే ఒక సీనియర్ తమ్ముడు ఏకంగా చంద్రబాబు నుంచి మొదలుపెట్టి అందరికీ కడిగిపారేశారు. టీడీపీకి బతుకూ భవిష్యత్తూ రెండూ లేవని కూడా తేల్చేశాడు. ఆయన శ్రీకాకుళం టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ కి ముఖ్య అనుచరుడు. ఆయన పేరు కిల్లి రామ్మోహననారావు. ఆయనది ఆముదాల వలస నియోజకవర్గం. ఆయన టీడీపీ అని అయిపోయింది అని బాహాటంగానే దండోరా వేస్తున్నాడు.
అచ్చెన్నకే షాక్….
ఇక అచ్చెన్నాయుడు రిగ్గింగ్ చేసి వరసగా గెలుస్తున్నాడు అని కూడా ఈ సీనియర్ తమ్ముడు లోగుట్టు బయటపెట్టేశాడు. ఈ మాటను ఇంతకాలం వైసీపీ నేతలు మాత్రమే అనేవారు, ఇపుడు పసుపు శిబిరానికి చెందిన సీనియర్ నేత కూడా ఇదే మాట అంటున్నాడు అంటే అచ్చెన్నకు ఇది భారీ షాకే మరి. అంతే కాదు తెలుగుదేశాన్ని ఎవరూ కాపాడలేరని కూడా ఆయన జోస్యం చెప్పేశారు. ఎందుకూ అంటే చంద్రబాబు ఒక్క మాట మీద నిలబడరుట. చెప్పిన మాట వేరు చేసేది వేరు, ఆయన అన్ని విషయాల్లోనూ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తారు అని కూడా కిల్లి రామ్మోహనరావు హాట్ కామెంట్స్ చేశారు.
ఇదీ క్యాడర్ మాట…
నిన్న కుప్పంలో మీరిక రెస్ట్ తీసుకోండి అని క్యాడర్ ముక్తకంఠంతో చంద్రబాబుని కోరింది. అది కూడా ఏకంగా బహిరంగ సభలోనే చెప్పేసింది. వారంతా దశాబ్దాలుగా ఓటేసి చంద్రబాబును భుజాల మీద మోస్తున్న వారు. కుప్పంలో అలా సౌండ్ వినిపిస్తే శ్రీకాకుళంలో క్యాడర్ నుంచి ఇలా షాక్ ఎదురైంది. అది చిత్తూరు అయినా సిక్కోలు అయినా ఒక్కటే మాట తమ్ముళ్ళంతా చెబుతున్నారు అనుకోవాలి. టీడీపీకి భవిష్యత్తు చంద్రబాబు నాయకత్వాన లేదన్నదే వారి మాట. క్యాడర్ ని చూసి ఇంతకాలం పొంగిపోయిన చంద్రబాబు ఇతర పెద్దలు ఇపుడు అదే క్యాడర్ పార్టీ దైన్యాన్ని బయటపెడుతూంటే ఏం సమాధానం చెబుతారు అన్నదే ఇక్కడ ప్రశ్న. మొత్తానికి సిక్కోలు తమ్ముడు టీడీపీకి మా చెడ్డ చిక్కులే తెచ్చేశాడుగా.