చంద్రబాబు అంతటి పిరికివాడు మరొకరు లేరట
చంద్రబాబు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన మంత్రిగా ముఖ్యామంత్రిగా ప్రతిపక్ష నేత గా అనేక హోదాలలో సేవలు అందించారు. అంత మాత్రం చేత చంద్రబాబు గురించి [more]
చంద్రబాబు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన మంత్రిగా ముఖ్యామంత్రిగా ప్రతిపక్ష నేత గా అనేక హోదాలలో సేవలు అందించారు. అంత మాత్రం చేత చంద్రబాబు గురించి [more]
చంద్రబాబు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన మంత్రిగా ముఖ్యామంత్రిగా ప్రతిపక్ష నేత గా అనేక హోదాలలో సేవలు అందించారు. అంత మాత్రం చేత చంద్రబాబు గురించి అన్నీ జనాలకు తెలిసాయనుకోవడం పొరపాటే అవుతుంది. చంద్రబాబు అసలే గుంభనంగా ఉంటారు. ఏది మాట్లాడితే ఎంత లాభమో ఆచీ తూచీ మరీ ఆయన మాట్లాడుతారు. ఇక తన ఫ్యామిలీని కూడా ఆ మధ్య దాకా బయటకు తీసుకురాని నైజం చంద్రబాబుది. అప్పట్లో వైఎస్సార్ తన సతీమణిని విజయమ్మతో కలసి బయటకు రావడంతో బాబు కూడా భువనేశ్వరిని అపుడపుడు జనాల ముందుకు తెస్తూ కనిపిస్తున్నారంతే.
టోటల్ గా తెలుసా….?
చంద్రబాబు గురించి ఎవరికీ తెలియని నిజాలు నాకు తెలుసు. ఆయన్ని టోటల్ గా స్క్రీనింగ్ చేశాను అంటున్నారు వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబుతో విద్యార్ధి దశ నుంచే తనకు గొడవలు ఉన్నాయని కూడా ఫ్లాష్ బ్యాక్ విప్పేశారు. చంద్రబాబును ఆంధ్ర దేశంలో నాడూ నేడూ ఎదుర్కొంది తానేనంటూ కూడా తన గొప్పతనాన్ని కూడా బయటపెట్టుకున్నారు. చంద్రబాబు విద్యార్ధిగా ఉన్నపుడే చేసిన అరాచక రాజకీయాలను నిలువరించిన వాడిని అని కూడా చెప్పుకున్నారు.
వట్టి పిరికి……
చంద్రబాబు మాట్లాడితే చాలు ఖబడ్దార్ అంటూ ప్రత్యర్ధులకు హెచ్చరికలు జరీ చేస్తారు. నేను ఎవరికీ భయపడను అంటూ కూడా ఉంటారు. ఎంతో మందిని చూశాను మీరెంత అంటూ ప్రత్యర్ధులను తెగ రెచ్చగొడతారు. అటువంటి బాబులో పిరికి మనిషి నిలువెల్లా ఉన్నాడు అంటున్నారు పెద్దిరెడ్డి. ఆయన మాటల డాంభికం అంతా ఉత్తిత్తిదే అని కూడా అసలు సీక్రెట్ చెప్పేశారు. చంద్రబాబు అలా పెద్ద మాటలు మాట్లాడుతారు కానీ బాగా భయస్థుడు అంటూ ఆయన ఇజ్జత్ తీసేశారు.
క్రెడిట్ ఆయదేనా…?
ఏపీలో చంద్రబాబు హవాను అడ్డుకుంది. ఆయన పొలిటికల్ లైఫ్ కి బ్రేకులు వేసింది నాడు వైఎస్సార్ అయితే నేడు జగన్ అని అంతా అంటారు. మరి పెద్దిరెడ్డి మాత్రం తానే బాబుకు అసలైన స్పీడ్ బ్రేకర్ ని అని చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో. వైసీపీలో పెద్దిరెడ్డి సీనియర్ మంత్రి. పైగా జగన్ తండ్రి వైఎస్సార్ కాలం నాటి వాడు. ఆయనకు జగన్ కూడా ఎంతో విలువ ఇస్తున్నారు. చిత్తూరు జిల్లా వరకూ పెద్దిరెడ్డి హవా సాగుతోంది. అయితే వైఎస్సార్, జగన్ చరిష్మా లేకుండా ప్రభుత్వం ఏర్పడలేదు, అందులోనే పెద్దిరెడ్డి మంత్రిగా ఉంటున్నారు. ఈ సంగతి తెలిసి కూడా పెద్దిరెడ్డి తాను చంద్రబాబుని ఢీ కొట్టిన బడా నేతను అని చెప్పుకోవడం ద్వారా ఏమైనా కొత్త సంకేతాలు ఇస్తున్నారా అన్న డౌట్లు అయితే వైసీపీ పెద్దలకు వస్తున్నాయట.