బాబు అటెన్షన్ అంతా దానిపైనే…అందుకే ఆ టెన్షన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తిరుపతి టెన్షన్ బాగా పట్టుకుంది. తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు పార్టీ భవిష్యత్ ను నిర్దేశిస్తాయని చెప్పక తప్పదు. చంద్రబాబు ఇక [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తిరుపతి టెన్షన్ బాగా పట్టుకుంది. తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు పార్టీ భవిష్యత్ ను నిర్దేశిస్తాయని చెప్పక తప్పదు. చంద్రబాబు ఇక [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తిరుపతి టెన్షన్ బాగా పట్టుకుంది. తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు పార్టీ భవిష్యత్ ను నిర్దేశిస్తాయని చెప్పక తప్పదు. చంద్రబాబు ఇక మిగిలిఉన్న ఆశ తిరుపతి ఒక్కటే. ఇక్కడ కూడా ఫెయిలయితే ఆయన నాయకత్వానికే సమస్య ఏర్పడుతుంది. ఇప్పటివరకూ జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ దారుణ ఓటమి పాలయింది. అయితే తిరుపతి ఉప ఎన్నికను మాత్రం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
వారం రోజుల పాటు…
వారం రోజుల పాటు తిరుపతి పార్లమెంటు నియోజకకవర్గ పరిధిలో పర్యటించి క్యాడర్ ను ఉత్తేజ పర్చారు. ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. నిజానికి ఒక ఉప ఎన్నిక కోసం చంద్రబాబు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఎటూ ఓటమి తప్పదని ఆయనకు తెలియంది కాదు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉండటంతో గెలుపు అంత సులువు కాదన్నది చంద్రబాబుకు ముందే తెలుసు.
ఒక లక్షంతో….
అయినా చంద్రబాబు మాత్రం తిరుపతిలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఒకటి ఓటమి పాలయినా తన ఓటు బ్యాంకును పెంచుకోవడం, అధికార వైసీపీకి మెజారిటీని తగ్గించడం. గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన మెజారిటీ ఏమాత్రం తగ్గినా చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికల్లో సక్సెస్ అయినట్లే. అందుకోసమే ఆయన తాపత్రయం అంతా. గతంలో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ రావాలని పార్టీ నేతలకు చంద్రబాబు నిర్దేశించారు.
మెజారిటీ పెరగకుండా…?
దీంతో పాటు తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలతో ఎగిరెగిరిపడుతున్న బీజేపీకి చెక్ పెట్టే వీలుకలిగింది. టీడీపీ ని మూడో స్థానంలోకి నెట్టేస్తామని బీరాలు పలుకుతున్న బీజేపీకి ఈ ఫలితం ద్వారా తెలియజెప్పవచ్చు. తాను లేకుంటే మీరు జీరో అని సంకేతాలు ఇచ్చినట్లవుతుంది. అందుకే చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగారు. అయితే వైసీపీ మెజారిటీ ఏమాత్రం పెరిగినా చంద్రబాబు మాత్రం సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. మరి ఫలితం ఎలా ఉండనుందో చూడాలి.