షష్టి పూర్తి బ్యాచ్ కు ఇక మంగళమేనట
తెలుగుదేశం పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు కీలకమైన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దానికి కారణం ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు తాజాగా చేసిన వీడియో కామెంట్స్ [more]
తెలుగుదేశం పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు కీలకమైన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దానికి కారణం ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు తాజాగా చేసిన వీడియో కామెంట్స్ [more]
తెలుగుదేశం పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు కీలకమైన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దానికి కారణం ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు తాజాగా చేసిన వీడియో కామెంట్స్ అని తెలుస్తోంది. అచ్చెన్నాయుడు తిరుపతి హొటలో లోకేష్ మీద చేసిన కామెంట్స్ టీడీపీలో అగ్గి పుట్టించాయి. ఒక విధంగా అది అచ్చెన్నాయుడు గొంతు మాత్రమే కాదు పార్టీలో మొత్తం సీనియర్ల భావన అలా ఉంది అంటున్నారు. దాంతో చంద్రబాబు తొందరలోనే కఠిన చర్యల దిశగా సాగుతారని అంటున్నారు. టీడీపీలో ఎన్నడూ చూడని సంచలన నిర్ణయాలు కూడా ఉంటాయని చెబుతున్నారు.
వారికి మంగళమే….
పార్టీలో ఎన్టీయార్ టైమ్ లో చేరి ఇప్పటికీ సీటు వదలకుండా రాజకీయాల్లో కొనసాగుతున్న సీనియర్లే లోకేష్ ని పక్కా జూనియర్ గా చూస్తున్నారు అన్నది టీడీపీ అధినాయకత్వం భావన. వారు పూర్తిగా అవుట్ డేటెడ్ అయిపోయినా పార్టీలో ఉంటూ పెద్ద మర్యాదను కోరుకుంటున్నారని కూడా విమర్శలు ఉన్నాయి. సీనియర్లకు లోకేష్ ఎపుడూ కళ్ల ముందు చిన్న వాడిగానే కనిపిస్తాడు అన్న మాట కూడా ఉంది. దాంతో ఆయన ఇపుడు పార్టీని లీడ్ చేస్తున్నా కూడా వారు అసలు ఖాతరు చేయడంలేదని కూడా అంటున్నారు. ఈ నేపధ్యంలో ఏకంగా సీనియర్లనే పార్టీకి దూరంగా పెడితే మొత్తం వ్యవహారం కొలిక్కి వస్తుంది అన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు.
రాహుల్ తరహా ఆపరేషన్ ….
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్యనే టీడీపీ కూడా ఇపుడు ఎదుర్కొంటోంది. రాహుల్ గాంధీ వృద్ధ నాయకులను వద్దు అనుకుంటున్నారు. కానీ వారు సోనియా గాంధీ చుట్టూ చేరి పార్టీని తమకు తోచిన విధంగా మూస పద్ధతిలో నడపాలని అనుకుంటున్నారు. దాంతో పాటు రాహుల్ గాంధీని ఏ పనీ చేయనీయకుండా సీనియర్లు అడ్డుపుల్లలు వేస్తున్నారు అని కూడా చెబుతారు. ఈ నేపధ్యంలో యంగ్ బ్లడ్ తో పార్టీని నింపాలని చాలా కాలంగా రాహుల్ ప్రయత్నం చేస్తున్న సంగతి విధితమే. ఇపుడు అదే తీరున కొత్త వారిని యువతరాన్ని పార్టీలో కీలకమైన స్థానాలలో పెడితే ఆటోమెటిక్ గా లోకేష్ కి పూర్తి ఆధిపత్యం వస్తుంది అని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు అంటున్నారు.
అంతా కొత్తగా….?
ఇక్కడ జగన్ ఫార్ములాను కూడా చంద్రబాబు అనుసరిస్తారు అంటున్నారు. ఊరూ పేరు లేని వారిని, కొత్త వారినీ తెచ్చి కీలకమైన పదవులు ఇస్తే వారు విధేయతతో పాటు పట్టుదలతో కసితో పనిచేస్తారని, పార్టీ పటిష్టం కావడానికి అది బాగా ఉపయోగపడుతుంది అని కూడా లెక్కలు వేస్తున్నారుట. తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుని చంద్రబాబు టోటల్ టీడీపీలో కొత్త నెత్తురు ఎక్కించే ప్రయత్నం చేస్తారని టాక్. మొత్తానికి అచ్చెన్న నోరు జారిన ఫలితంగా టీడీపీకి షష్టి పూర్తి బ్యాచ్ తమ్ముళ్ళు పూర్తిగా తిలోదకాలు ఇవ్వాల్సి ఉంటుందని పసుపు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.