బాబు ఆ ఒక్క ఆశ కూడా అడుగంటి పోయనట్లేనా?
చంద్రబాబు నాయుడిది రాజకీయాల్లో నలభై ఏళ్ల అనుభవం. ఆయన అంచనాలు ఎప్పుడూ తప్పుకాలేదు. గెలుపోటముల మాట ఎలా ఉన్నప్పటికీ ఆయనకు ఉన్న నెట్ వర్క్ తో ఎప్పటికప్పుడు [more]
చంద్రబాబు నాయుడిది రాజకీయాల్లో నలభై ఏళ్ల అనుభవం. ఆయన అంచనాలు ఎప్పుడూ తప్పుకాలేదు. గెలుపోటముల మాట ఎలా ఉన్నప్పటికీ ఆయనకు ఉన్న నెట్ వర్క్ తో ఎప్పటికప్పుడు [more]
చంద్రబాబు నాయుడిది రాజకీయాల్లో నలభై ఏళ్ల అనుభవం. ఆయన అంచనాలు ఎప్పుడూ తప్పుకాలేదు. గెలుపోటముల మాట ఎలా ఉన్నప్పటికీ ఆయనకు ఉన్న నెట్ వర్క్ తో ఎప్పటికప్పుడు సమాచారం ఎక్కడి నుంచైనా అందే వీలుంది. కీలక స్థానాల్లో చంద్రబాబు వీర విధేయులు ఉండటమే ఇందుకు కారణం. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ నెట్ వర్క్ ను ఉంచుకున్న చంద్రబాబు మొన్నటి వరకూ పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి.
రెండేళ్లలోనే?
చంద్రబాబు అధికారం కోల్పోయి రెండేళ్లు మాత్రమే అవుతుంది. ఈ రెండేళ్లలో ఎన్నో కష్టాలు. పార్టీని నడపలేని పరిస్థితి. నేతలు మాట వినని స్థితి. వరస ఓటములు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఏ ఎన్నిక జరిగినా గెలుపు మాట వినిపించలేదు. దీంతో చంద్రబాబు జగన్ పాలన ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని భావించారు. జమిలి ఎన్నికలు వస్తాయని చంద్రబాబు అంచనా వేసుకున్నారు. తనకు ఢిల్లీ నుంచి ఖచ్చితమైన సమాచారం ఉందని కూడా చంద్రబాబు చెప్పారు.
జమిలి ఎన్నికలొస్తాయని….
జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయిందని 2022 లోనే జమిలి ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు పదే పదే చెప్పేవారు. పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపేందుకు ఇలా చెబుతున్నారని తొలుత భావించినా ఆయనకు బీజేపీలో ఉన్న కీలక నేతలు సమాచారాన్ని చేరవేశారన్న ప్రచారం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పదే పదే ఆ ప్రస్తావన తేవడంతో ఇక జమిలి ఎన్నికలకు క చంద్రబాబు సిద్ధమయిపోయారు.
ప్రస్తు పరిస్థితుల్లో…..
కానీ ఇప్పుడు పరిస్థిితి జమిలి ఎన్నికలు కాదు గదా? అసలు 2024 ఎన్నికలు జరుగుతాయా? అన్న సందేహం తలెత్తుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలను పెడితేనే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది మోదీ ప్రభుత్వం జమిలి ఎన్నికలకు వెళ్లే అవకాశమే లేదు. ఆ సాహసం కూడా చేయదు. దీంతో చంద్రబాబు కొన్నాళ్లుగా పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లినట్లయిందంటున్నారు. 2024 వరకూ వెయిట్ చేయాల్సిందే తప్ప మరో ఆప్షన్ లేదు.