తిరుపతిలో చంద్రబాబు ఇలా సక్సెస్ అయ్యారట
చంద్రబాబు కొంత వరకూ సక్సెస్ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీని భారీ మెజారిటీ వైపు కాకుండా తగ్టించడంలో ఆయన సఫలమయ్యారు. మరో రకంగా కూడా చంద్రబాబు [more]
చంద్రబాబు కొంత వరకూ సక్సెస్ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీని భారీ మెజారిటీ వైపు కాకుండా తగ్టించడంలో ఆయన సఫలమయ్యారు. మరో రకంగా కూడా చంద్రబాబు [more]
చంద్రబాబు కొంత వరకూ సక్సెస్ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీని భారీ మెజారిటీ వైపు కాకుండా తగ్టించడంలో ఆయన సఫలమయ్యారు. మరో రకంగా కూడా చంద్రబాబు విజయవంతమయ్యారు. బీజేపీకి తాను లేకపోతే దిక్కులేదని ఈ ఫలితం ద్వారా చంద్రబాబు చెప్పకనే చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ముందు నుంచి అనుకుంటుందే. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎంపీ మరణంతో ఈ ఎన్నిక జరగడంతో అధికార పార్టీకి అడ్వాంటేజీ అని ఎవరైనా అంచనాకు రాగలరు.
ఓడిపోతామని తెలిసే?
నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదంటే నమ్మలేం. కానీ చంద్రబాబు పట్టుపట్టి ఇక్కడ పోటీకి పెట్టింది పార్టీని భవిష్యత్ లో బలోపేతం చేయడం కోసమే. ఇందులో చంద్రబాబు ఒకరకంగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. తిరుపతి ఉప ఎన్నిక వస్తుందని తెలిసిన వెంటనే గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుగానే అభ్యర్థిని ప్రకటించారు. పనబాక లక్ష్మి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో ఆమెనే తిరిగి నిలపాలని నిర్ణయించారు.
నేతలందరినీ…..
ఇక 70 మంది తో తిరుపతి ఉప ఎన్నికల కమిటీని వేశారు. అంతా చేసింది గెలుస్తామని కాదు. అందరి నాయకులను ఏకం చేయడానికి తిరుపతి ఉప ఎన్నిక చంద్రబాబుకు ఉపయోగపడిందనే చెప్పాలి. అచ్చెన్నాయుడు నుంచి కింది స్థాయి కార్యకర్తవరకూ కలసి కట్టుగా పనిచేశారు. అయితే చంద్రబాబు ముందునుంచి అనుకున్నట్లు తన బలం, బలగాన్ని వైసీపీ కంటే బీజేపీకి చూపించాలనుకున్నారు.
బీజేపీకి సంకేతాలు…?
బీజేపీ ఇక్కడ తాము ఏదో ఉందనుకున్న భ్రమలో ఉందని, ఆ భ్రమల నుంచి తప్పించడానికి చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికను ఉపయోగించుకున్నారు. వైసీపీ విజయం ఊహించిందే అయినా చంద్రబాబుకు ఇప్పుడు ఈ ఫలితం ద్వారా ఆనందం ఒక్కటే. జనసేన, బీజేపీ దారుణంగా దెబ్బతినడం. ఇప్పుడు ఆ రెండు పార్టీలు తనవైపు చూడక తప్పదని చంద్రబాబు భావిస్తున్నారు. ఆయన అనుకున్నదే నిజమయింది. టీడీపీయే వైసీపీకి ప్రత్యామ్నాయమని బీజేపీకి చంద్రబాబు బలంగా ఈ ఎన్నిక ద్వారా చెప్పగలిగారు. దీంతో బీజేపీ, జనసేన ఇక టీడీపీవైపు చూడాల్సిందే?