ఇక్కడ మరీ ఇంత వీకయితే ఎలా?
ఏపీ రాజకీయాల గురించి ఎవరు మాట్లాడినా.. ముందు ప్రస్తావించేది రెండు కీలకమైన ఉభయగోదావరి జిల్లా లు. ఇక్కడ జనాల పరంగా, పార్టీల పరంగా,నాయకుల పరంగా మరీ ముఖ్యంగా [more]
ఏపీ రాజకీయాల గురించి ఎవరు మాట్లాడినా.. ముందు ప్రస్తావించేది రెండు కీలకమైన ఉభయగోదావరి జిల్లా లు. ఇక్కడ జనాల పరంగా, పార్టీల పరంగా,నాయకుల పరంగా మరీ ముఖ్యంగా [more]
ఏపీ రాజకీయాల గురించి ఎవరు మాట్లాడినా.. ముందు ప్రస్తావించేది రెండు కీలకమైన ఉభయగోదావరి జిల్లా లు. ఇక్కడ జనాల పరంగా, పార్టీల పరంగా,నాయకుల పరంగా మరీ ముఖ్యంగా సామాజిక వర్గాల పరంగా కూడా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. దీంతో ఇక్కడ పాగా వేస్తే.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు సునాయాస మార్గం ఏర్పడుతుందని నాయకులు, పార్టీలు కూడా భావిస్తుంటాయి. గత ఎన్నికల్లో తూర్పుగోదావరిలో నాలుగు చోట్ల టీడీపీ విజయం సాధించింది. పశ్చిమ గోదావరిలోనూ రెండు స్థానాల్లో విజయం దక్కించుకుంది.
పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్నా….
ఈ ఆరుగురిలో ఇద్దరు మాత్రమే కొత్త కాగా, మిగలిన వారు పార్టీతో ఎంతో అనుబంధం ఉన్నవారే. అంతేకాదు.. పార్టీ అధినేతతలోనూ చాలా చనువు ఉన్న నాయకులే. అంతేకాదు.. పార్టీ విషయంలో ఇప్పటి వరకు నిబద్ధతతో పనిచేస్తున్నవారే. కానీ, ఎందుకో.. గడిచిన రెండు సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు పార్టీకి తీవ్ర ఇబ్బందిగా పరిణమించాయి. ఓడిపోయినంత మాత్రాన పార్టీ పని అయిపోయి నట్టు కాదనే విషయాన్ని ఇక్కడ నేతలు గుర్తించలేక పోతున్నారనే వాదన ఉంది. రాజకీయాల్లో ఈ క్వేషన్లు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి.
ఎవరి రాజకీయాలు వారివే…
అంతేకాదు.. ఎవరికి వారుగానే రాజకీయాలు చేసుకోవడం.. ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించడం గెలిచిన వారిలో కనిపిస్తే.. ఓడిపోయిన వారు.. తమకు పార్టీతో పనిలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు తమకు ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి.. పార్టీని డిఫెన్స్‌లో పడేశారు. తూర్పుగోదావరిలో పిల్లి అనంతలక్ష్మి, పశ్చిమలో జ్యోతుల నెహ్రూ వంటి వారు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. అలాగని పార్టీకి దూరం అవుతారా ? అంటే.. అది కూడా లేదు. తాము పార్టీలోనే ఉంటామని చెబుతారు.
కార్యక్రమాలకు దూరం….
కానీ, ఎక్కడా ఎలాంటి కార్యక్రమానికీ హాజరుకారు. రెండు జిల్లాల్లో ఐదారు నియోజకవర్గాలకు అసలు ఇన్‌చార్జ్‌లే లేరు. దీంతో బలమైన గోదావరి జిల్లాల్లో టీడీపీలో నాయకత్వ లేమి, అంతర్గత వైరాలు, విభేదాలు పార్టీ పుట్టి మరింత ముంచేస్తాయంటున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి సర్దుకుంటాయా? లేక.. ఇలానే ఉంటాయా? అనేది ఆసక్తిగా మారింది. చంద్రబాబు 2014లో అధికారంలోకి రావడానికి ఈ గోదావరి జిల్లాలే కారణం. మరి అలాంటి చోట ఇప్పుడు పార్టీ పరిస్థితి దిగజారుతున్నా కనీసం ఖాళాగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను నియమించడం, పార్టీ కేడర్‌లో మనోధైర్యం నింపడం చేయకపోవడంతో సైకిల్ దారి ఏ తీరాలకు పోతుందో ? కూడా తెలియట్లేదు.