జగన్ ను అర్జంటుగా దించేసి వచ్చి కూర్చుంటే పోలా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాను అధికారంలో ఉంటే ఇలా కరోనా విజృంభించేది కాదని పదే పదే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ కూడా [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాను అధికారంలో ఉంటే ఇలా కరోనా విజృంభించేది కాదని పదే పదే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ కూడా [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాను అధికారంలో ఉంటే ఇలా కరోనా విజృంభించేది కాదని పదే పదే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ కూడా డిజాస్టర్ మేనేజ్ మెంట్ లో చంద్రబాబు తర్వాత ఎవరైనా అన్న వీడియోలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్న ప్రచారాన్ని ప్రజల్లోకి పంపేందుకు చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా మీద పూర్తిగా తనకు పట్టున్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తాను పార్టీ కార్యకర్తల కోసం ఏం చేశానో కూడా చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో ఉన్నా…?
కనీసం ఆక్సిజన్ సిలిండర్లను కూడా సమకూర్చుకోలేని దయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, వ్యాక్సినేషన్ ను కూడా సక్రమంగా పూర్తి చేయడం లేదని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అయితే ఆక్సిజన్, వ్యాక్సినేషన్ మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. కేంద్రం ఇచ్చిన మేరకే ఏపీకి ఆక్సిజన్ అయినా, వ్యాక్సినేషన్ నిల్వలయినా చేరుకుంటాయి. కానీ చంద్రబాబు మాత్రం జగన్ ప్రభుత్వం వైఫల్యమేనని చెబుతున్నారు.
195 మందిని రక్షించుకున్నానని…..
తాను అధికారంలో ఉండి ఉంటే కరోనా సమర్థవంతంగా కట్టడి చేయగలిగేవారినని చెబుతున్నారు. ఇందుకు ఆయన ఉదాహరణలకు కూడా చూపుతున్నారు. తాను టీడీపీ కార్యాలయంలో కరోనా వైరస్ బారిన పడిన 195 మందిని కాపాడుకోగలిగామని చెబుతున్నారు. అమెరికాలోని తెలుగు వైద్యుడు లోకేశ్వరరావు సాయంతో హోం క్వారంటైన్ లోనే ఉంచి తమ పార్టీ వారిని కాపాడుకోగలిగామని చంద్రబాుబ చెబుతున్నారు.
అందరిదీ ఇదే పరిస్థితే అయినా…?
నిజానికి కరోనా వైరస్ దేశమంతా వ్యాపించి ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని అందరికీ తెలుసు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించడంపై కూడా విమర్శలున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం వీటన్నింటినీ వదిలేసి తాను ఉండి ఉంటే కరోనాను కట్టడి చేయగలిగేవాడినని, తాము 195 మంది ప్రాణాలను కాపాడుకోగలిగామని చెబుతుండటంపై విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ సమయంలోనైనా రాజకీయాలు పక్కన పెట్టి ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తే బాగుంటుది.