ముసలోళ్ళకు టాటా… ?
వయసు పాదరసం లాంటిది. జారిపోతుంది. దాన్ని పట్టుకోలేరు కూడా. మరి అలాంటి వయసు ఎక్కడ మైనస్ అయినా రాజకీయాల్లో మాత్రం ఈ రోజు దాకా ప్లస్ గానే [more]
వయసు పాదరసం లాంటిది. జారిపోతుంది. దాన్ని పట్టుకోలేరు కూడా. మరి అలాంటి వయసు ఎక్కడ మైనస్ అయినా రాజకీయాల్లో మాత్రం ఈ రోజు దాకా ప్లస్ గానే [more]
వయసు పాదరసం లాంటిది. జారిపోతుంది. దాన్ని పట్టుకోలేరు కూడా. మరి అలాంటి వయసు ఎక్కడ మైనస్ అయినా రాజకీయాల్లో మాత్రం ఈ రోజు దాకా ప్లస్ గానే ఉంటోంది. ఎందుకంటే తలపండిన వారే ప్రజా ప్రతినిదులుగా నాయకులుగా రాణిస్తారు అని ఒక నమ్మకం తరాలుగా ఉంటూ వస్తోంది. కానీ ఇపుడు మాత్రం సీన్ మారుతోంది. ఏపీలో యువ ముఖ్యమంత్రిగా జగన్ రావడంతో పాటు ఆయన పార్టీ తరఫున గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలలో వంద మంది దాకా యాభై ఏళ్ల లోపు వారు ఉండడంతో మిగిలిన పార్టీల మీద కూడా ఆ ప్రభావం గట్టిగా పడుతోంది.
వందకు వందట ….
వైసీపీలో పోలిస్తే టీడీపీ వృద్ధ పార్టీలా తయారు అయింది. ఎటు చూసినా స్వీటి సిక్స్ టీ లీడర్లే కనిపిస్తున్నారు. దాంతో వారి చేత పరుగులు పెట్టించడం కష్టమైపోతోందిట. ఇక ఈనాటి జనాలకు కనెక్ట్ కావడం కూడా వారికి బహు ఇబ్బందిగా ఉంటోందిట. సోషల్ మీడియా యుగంలో జనాల బాడీ లాంగ్వేజ్ మాటల తీరు అన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి. అయితే సీనియర్లు మాత్రం ఇంకా రొడ్డకొట్టుడు టైప్ తో రొటీన్ గానే కనిపించడమే టీడీపీకి అతి పెద్ద మైనస్ అని వ్యూహకర్తలు గుర్తించారుట. అర్జంటుగా అలాంటి వారిని తప్పించేయాల్సిందే అని కూడా సూచిన్స్తున్నారుట. దీంతో రేపటి ఎన్నికలలో వందకు వంద సీట్లూ కంప్లీట్ గా యూత్ కే ఇవ్వాలని చంద్రబాబు దాదాపుగా డిసైడ్ అయ్యారని అంటున్నారు.
అనుభవం అంతేనా…?
2014 నుంచి 2019 ఎన్నికల దాకా చంద్రబాబు వల్లించింది అనుభవం అన్న మంత్రాన్ని. కానీ జనాలు మాత్రం దాన్ని పెద్దగా రిసీవ్ చేసుకోవడం లేదు. యువ రక్తం కావాలని వారు జగన్ వైపునకు వెళ్ళిపోయారు. అందువల్ల ఓల్డ్ గ్రాండ్ పార్టీగా టీడీపీ మిగిలిపోతోంది. దాంతోనే ఇలాంటి ప్రయోగం చేయాలనుకుంటున్నారుట. మరో వైపు వైసీపీ వచ్చే ఎన్నికల్లో మిగిలిన ముసలీ ముతకా నాయకులను కూడా తప్పించి యూత్ కీ, కొత్త వారికీ చాన్సులు ఇవ్వాలని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. మరి ఇలా రెండు పార్టీలు గట్టిగా ఆలోచిస్తూంటే అనుభవం కలిగిన సీనియర్ల సంగతేంటి అన్న ప్రశ్న వస్తోంది. వారు రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుని రామ క్రిష్ణ అనుకోవడమే మిగిలింది అంటున్నారు.
కనిపించరంతే …?
మొత్తానికి చూస్తే జగన్ చూపించిన ఈ దారి ఇపుడు చంద్రబాబుకి కూడా మార్గం అవుతోంది. దాంతో రెండు ప్రధాన పార్టీలూ యూత్ కే ఓటు అంటున్నాయి. 2024 ఎన్నికలలో వీరికే అటూ ఇటూ కూడా టికెట్లు దక్కడం ఖాయం. వీరిలో ఎవరు గెలిచినా వచ్చే అసెంబ్లీ పూర్తిగా యువ రక్తంతో నిడిపోవడం ఖాయం. అంటే రేపటి అసెంబ్లీలో చంద్రబాబు లాంటి కొందరు తప్ప మిగిలిన వారంతా యాభై అయిదేళ్ల లోపు వారే ఉన్నా ఆశ్చర్యం లేదు అంటున్నారు. నిజంగా అదే జరిగితే ఏపీ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయమే ఆవిష్కృతమవుతుంది అనడంలో సందేహమే లేదు.