డేంజర్ లో పడినట్లే బాబూ… ?
క్రెడిబిలిటీ అని ఇంగ్లీష్ లో సింపుల్ గా అంటారు. దాన్నే తెలుగులో విశ్వసనీయత అని బరువైన మాటతో చెబుతారు. నిజానికి దీన్ని సంపాదించడం అంటే అనంత సాగరంలో [more]
క్రెడిబిలిటీ అని ఇంగ్లీష్ లో సింపుల్ గా అంటారు. దాన్నే తెలుగులో విశ్వసనీయత అని బరువైన మాటతో చెబుతారు. నిజానికి దీన్ని సంపాదించడం అంటే అనంత సాగరంలో [more]
క్రెడిబిలిటీ అని ఇంగ్లీష్ లో సింపుల్ గా అంటారు. దాన్నే తెలుగులో విశ్వసనీయత అని బరువైన మాటతో చెబుతారు. నిజానికి దీన్ని సంపాదించడం అంటే అనంత సాగరంలో అలుపెరగని ఈత ఈదినట్లే. సమాజంలో ఉండే ప్రతీ వ్యక్తికీ ఇది ఉండాల్సిందే. విశ్వసనీయత మీదనే విజయాలు ఆధారపడతాయి. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఇపుడు అదే పెద్ద ప్రశ్నగా మారుతోంది. దానికి చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా చేస్తూ వస్తున్న అనేక రకాలైన రాజకీయ విన్యాసాలే కారణమని చెప్పకతప్పదు.
ఎంత రాజకీయమైనా ?
రాజకీయాల్లో కుప్పి గెంతులు తప్పవు, ఫ్లేట్ ఫిరాయించడాలూ అక్కడ షరా మామూలే. అలాగని పూటకో మాట మాట్లాడితే విలువ ఉంటుందా. ఎపుడు ఏ వైపునకు జరిగినా, మరో వైపు నుంచి తొలగినా జనాలకు చెప్పుకోవడానికి కన్వీనియెంట్ గా ఒక పాయింట్ ఉండాలి కదా. వారు కూడా అవును అదే కరెక్ట్ అనుకునేలా ఉండాలి కదా . చంద్రబాబు నాయుడు విషయంలో చూస్తే అలాంటి దశలు అన్నీ ఎపుడో దాటేశారు. ఆయన ఎన్నిసార్లో జనాలను తప్పులు జరిగాయి ఇక మీదట వాటిని జరగనివ్వను అంటూ వినయపూర్వకమైన వైఖరితో అడిగారు. కానీ అధికారంలోకి వచ్చాక షరా మామూలుగానే కధ సాగిపోతూ వస్తోంది. అందుకే జనాలు నమ్మడం మానేశారు అని ఎన్నికల ఫలితాలు రుజువుచేస్తున్నాయి.
అసలుకే ఎసరు …?
సరే జనాల సంగతి తరువాత చూసుకోవచ్చు ముందు తన పొలిటికల్ కమ్యూనిటీలో చంద్రబాబు విశ్వాసం కలిగిస్తున్నారా అంటే అది కూడా నిరాశగానే ఉంది. ఏపీలో బీజేపీకి ఏం బలం ఉందని చంద్రబాబుని తోసిరాజంటోంది. నిజానికి నిన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ, అవకాశం ఉంటే రేపు మళ్లీ అధికారం కోసం ఆశ పెట్టుకునే పార్టీ కూడా టీడీపీయే. అలాంటి పార్టీ కోరి మద్దతు ఇస్తాను అంటే వద్దు అంటూ ముఖం మీదనే తలుపు వేస్తున్నారు కాషాయదళం నేతలు అంటే ఇక్కడ తప్పు వారిది కాదు అచ్చంగా బాబుదే. చంద్రబాబు తన సాటి రాజకీయ పక్షాల వద్ద కూడా క్రెడిబిలిటీ కోల్పోయాడు అన్నదే ఇక్కడ పాయింట్. ఇది చాలా ప్రమాదకరమైనది. గతంలో ఎన్నడూ లేనిదీ కూడా.
ముగిసిన అధ్యాయమే…?
చంద్రబాబు రాజకీయం ముగిసిన అధ్యాయమని వైసీపీ నేతలు అదే పనిగా చెబుతున్నారు. వారికి ఆ ధీమా ఎక్కడ నుంచి వచ్చింది అంటే టీడీపీ అధినాయకుడి పోకడలు, పార్టీలో ఉన్న నిర్లిప్త వాతావరణం చూసి మాత్రమే అనుకోవాలి. చంద్రబాబు మాటలను జనం నమ్మడం లేదు సరేననుకుందాం, తోటి పార్టీలు కూడా నమ్మడంలేదు దాన్ని కూడా సరేననుకుందాం. కానీ సొంత పార్టీ వారు కూడా నమ్మడంలేదా. ఇది కదా అసలైన పాయింట్. అంటే ఇప్పటిదాకా చంద్రబాబు విన్యాసాలు అన్నీ చూసేసిన తమ్ముళ్ళు ఆయన చెప్పే ఏ ఒక్క మాటనూ సీరియస్ గా తీసుకోవడంలేదా. కళ్లకు కనిపిస్తున్న ఘటనలు అదే నిజం అంటున్నాయి. మహానాడు లాంటి అత్యున్నత వేదికలు కూడా ఇదే విషయాన్ని చాటి చెబుతున్నాయి. ఇపుడు కదా చంద్రబాబు డేంజర్ లో పడిపోయినట్లు అనుకోవాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. అంటే ఇంట్లో దండీగా మద్దతు దక్కాలి. చంద్రబాబుకు 2014 దాకా లభించిన మద్దతు అదే. కానీ 2024 ఎన్నికలకు వెళ్ళబోతున్న టీడీపీకి ఇంటి మద్దతు కూడా కరవు అవుతోందా అన్నదే చర్చ. అదే జరిగితే మాత్రం దేశ చరిత్రలో తనకంటూ కొన్ని కొన్ని పేజీలను సంపాదించుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యాయం ముగిసినట్లే అనుకోవాలేమో.