బాబును తక్కువగా అంచనా వేస్తే…?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ లైట్ గా తీసుకుంటున్నట్లు కనపడుతుంది. ఆయన వల్ల తనకు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి నష్టం ఉండదన్న భరోసా [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ లైట్ గా తీసుకుంటున్నట్లు కనపడుతుంది. ఆయన వల్ల తనకు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి నష్టం ఉండదన్న భరోసా [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ లైట్ గా తీసుకుంటున్నట్లు కనపడుతుంది. ఆయన వల్ల తనకు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి నష్టం ఉండదన్న భరోసా జగన్ లో కన్పిస్తుంది. అందుకే చంద్రబాబును లెక్కలోకే జగన్ తీసుకోవడం లేదు. అయితే ఇది ప్రమాదకరమైన ఆలోచన అని వైసీపీ నేతలే భావిస్తున్నారు. చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లో తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
బలమైన మీడియా….
చంద్రబాబు కు రాజకీయ అనుభవంతో పాటు బలమైన మీడియా ఆయనకు అండగా ఉంది. గత రెండేళ్ల నుంచి జగన్ ప్రభుత్వంపై జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే ఎల్లో మీడియా అంటూ జగన్ తేలిగ్గా కొట్టి పారేస్తున్నారు. కానీ అదే మీడియా ఎన్నికల సమయానికి ఇబ్బందులు పెట్టే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. జగన్ గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూ ల్లో పదే పదే చెప్పిన ఒక విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు.
వన్ సైడ్ తీర్పు…..?
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ వన్ సైడ్ తీర్పు ఇస్తారన్న జగన్ మాటలను పదే పదే ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు సయితం సమయం కోసం వేచి చూస్తున్నారు. జగన్ బీజేపీకి దూరమయితే తనకు మరింత అడ్వాంటేజీ అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకు ఢిల్లీలో ఇప్పటికే ఆయన లాబీయింగ్ స్టార్ట్ చేసినట్లు చెబుతున్నారు. దీంతో పాటు జగన్ పాలనలో అసంతృప్తిగా ఉన్న కొన్ని వర్గాలను చంద్రబాబు దగ్గర తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.
కోల్పోయిన ఓటు బ్యాంకును…?
ప్రధానంగా చంద్రబాబు పార్టీకి బీసీీలు వెన్నుదన్నుగా దశాబ్దాల కాలం నుంచి నిలుస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం బీసీలు వైసీపీ వైపు మొగ్గు చూపారు. అయితే వారిని తిరిగి పార్టీ వైపు రప్పించుకునేందుకు చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. భవిష్యత్ లో పార్టీ పరంగా తీసుకునే ఏ నిర్ణయమైనా బీసీలకు అనుకూలంగా ఉండనుంది. ఇక ఎస్సీల్లోనూ ఒక వర్గం మద్దతు తమకు లభిస్తుందని చంద్రబాబు విశ్వాసంతో ఉన్నారు. అలాగే తటస్థులు కూడా ఈసారి తమ వైపునకు మొగ్గు చూపుతారని, విచ్చలవిడిగా పథకాల పేరుతో పంపిణీ చేయడంతో తటస్థులు వైసీపీ పట్ల ఆగ్రహంతో ఉన్నారని చంద్రబాబు గుర్తించారు. ఇలా చంద్రబాబు చాపకింద నీరులా తన పని తాను చేసుకుబోతున్నారు. జగన్ మాత్రం చంద్రబాబును లైట్ గా తీసుకుంటున్నారు.