బాబుకు ఇది తప్ప మరో మార్గం లేదట
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తక్షణ కర్తవ్యం విశ్వసనీయతను పెంచుకోవడమే. ఆయనకు వచ్చే ఎన్నికల్లో విజయం దక్కాలంటే కేవలం పొత్తుల వల్లనే సాధ్యం కాదు. ప్రజల్లో విశ్వసనీయత [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తక్షణ కర్తవ్యం విశ్వసనీయతను పెంచుకోవడమే. ఆయనకు వచ్చే ఎన్నికల్లో విజయం దక్కాలంటే కేవలం పొత్తుల వల్లనే సాధ్యం కాదు. ప్రజల్లో విశ్వసనీయత [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తక్షణ కర్తవ్యం విశ్వసనీయతను పెంచుకోవడమే. ఆయనకు వచ్చే ఎన్నికల్లో విజయం దక్కాలంటే కేవలం పొత్తుల వల్లనే సాధ్యం కాదు. ప్రజల్లో విశ్వసనీయత లేకపోతే ఎవరితోపొత్తు పెట్టుకున్నా గెలుపు అనేది సాధ్యం కాదన్నది విశ్లేషకుల అంచనా. కేవలం ప్రభుత్వంపై బురద జల్లడమే కాకుండా తనపై నమ్మకం పెంచేలా చంద్రబాబు చేసుకోవాల్సి ఉంటుంది. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పాల్సి ఉంటుంది. అవి కూడా ఆచరణ సాధ్యమయి ఉండాల్సి ఉంటుంది.
విషమ పరీక్షే….
చంద్రబాబుకు 2024 ఎన్నికలు విషమ పరీక్షగానే చెప్పుకోవాలి. తాను బీజేపీ, జనసేనతో కలసి పోటీ చేయవచ్చన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. అది సక్సెస్ అయి పొత్తులు ఏర్పడినా ప్రజలు ఆదరిస్తారన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో అన్ని పార్టీలతో కలసి మహాకూటమిని ఏర్పాటు చేసినా ప్రజలు తిరిగి టీఆర్ఎస్ కే పట్టం కట్టారు. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని పార్టీ సీనియర్ నేతలు సయితం చెబుతున్నారు.
ప్రభుత్వంపై వ్యతిరేకతను….
సహజంగా ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంటుంది. వాటిని తన పరం చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించాల్సి ఉంటుంది. జగన్ మీద అవినీతి ఆరోపణలు చేసి లాభం లేదు. ఫ్యాక్షన్ ముద్ర వేసినా ప్రయోజనం లేదు. ఎందుకంటే అవి విని విని జనం విసిగెత్తిపోయి ఉన్నారు. తన రాజకీయ అనుభవంతో ఆంధ్రప్రదేశ్ ను ఎలా అభివృద్ధి చేస్తానన్న విషయాన్ని చంద్రబాబు చెప్పగలగాల్సి ఉంది.
నమ్మకం కలిగించడమెలా?
అమరావతి రాజధానిని చూపెడితే ఈసారి కూడా జనం అంగీకరించరు. అందుకే తాను అధికారంలోకి వస్తే పారిశ్రామికాభివృద్ధి తో పాటు సంక్షేమపథకాలను కూడా అందిస్తానని ప్రజలకు చంద్రబాబు చెప్పగలగాలి. వారిలో తనపై నమ్మకం కల్గించగలగాలి. అప్పుడే ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న కొన్ని వర్గాలైనా చంద్రబాబు దరి చేరతాయి. అంతే తప్ప ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేసి అధికారంలోకి రావాలంటే కుదరని పని అన్న విశ్లేషణలు పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. చంద్రబాబు ఇప్పటికైనా తన పంథాను మార్చుకోవాలని ఆ పార్టీ నేతలే కోరుతున్నారు.