చంద్రబాబు కేరాఫ్ బెజవాడ … నిజమేనా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. విజయవాడ ప్రాంతంలో సొంత ఇంటి నిర్మాణానికి చంద్రబాబు రెడీ అయ్యారు. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. విజయవాడ ప్రాంతంలో సొంత ఇంటి నిర్మాణానికి చంద్రబాబు రెడీ అయ్యారు. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. విజయవాడ ప్రాంతంలో సొంత ఇంటి నిర్మాణానికి చంద్రబాబు రెడీ అయ్యారు. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెబుతున్నారు. ఇందుకోసం స్థల పరిశీలన కూడా చేస్తున్నట్లు తెలిసింది. విజయవాడ లేదా గంటూరు, మంగళగిరి మధ్యలో ఇల్లు ఉండేలా చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.
హైదరాబాద్ కే….?
నిజానికి చంద్రబాబు పక్కా ఏపీకి చెందిన వారే. అందులో ఎటువంటి సందేహం లేదు. కుప్పంలో ఆయనకు సొంత ఇంటితో పాటు వ్యవసాయభూములు కూడా ఉన్నాయి. అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ లో చంద్రబాబు ఇంటిని నిర్మించుకోవడం విమర్శలకు తావిస్తుంది. చంద్రబాబు పొరుగు రాష్ట్రంలో ఉంటున్నారని తరచూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో ఉండి తమను విమర్శించడమేంటని వారు నిలదీస్తున్నారు.
జగన్ పైన కూడా…?
గతంలో వైఎస్ జగన్ పైన కూడా ఇదే రకమైన విమర్శలు ఉండేవి. లోటస్ పాండ్ లోనే ఏపీ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శించేవారు. అయితే ఎన్నికలకు ముందుగానే జగన్ తాడేపల్లిలో పార్టీ కార్యాలయంతో పాటు సొంత ఇంటిని నిర్మించుకున్నారు. హైదరాబాద్ ముద్రను జగన్ చెరిపేసుకోగలిగారు. కానీ అదే పరిస్థితి ఇప్పుడు చంద్రబాబుకు వచ్చింది. కరోనా కారణంగా చంద్రబాబు గత రెండేళ్ల నుంచి హైదరాబాద్ కే పరిమితమయ్యారు.
అద్దెఇంట్లో…..
చుట్టపుచూపుగా ఏపీకి వచ్చి పోతున్నారన్న విమర్శలున్నాయి. కరకట్ట మీద ఇల్లు ఉన్నప్పటికీ అది అద్దె ఇల్లు కావడంతో చంద్రబాబు స్థానికతను వైసీపీ ప్రశ్నిస్తూనే ఉంది. దీంతో చంద్రబాబు సొంత ఇంటిని నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మంగళగిరిలో ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికలకు ముందే స్వగృహ ప్రవేశం కూడా చేస్తే తనపై పరాయి ముద్ర తొలగిపోతుందన్న భావనలో చంద్రబాబు ఉన్నారు. ఇందుకోసం ముఖ్య నేతలు స్థలాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.