బాబు ఆ పదవి ఎవరికి ఇస్తారో..?
చంద్రబాబునాయుడు ఏ పని చేసినా వెనక రాజకీయం ఉంటుంది. పైగా ఆయన రాజకీయ దురంధరుడు. ఇదిలా ఉంటే ఏపీలోనే టీడీపీ పునాదులు కదలిపోతున్న వేళ తెలంగాణాలో అసలు [more]
చంద్రబాబునాయుడు ఏ పని చేసినా వెనక రాజకీయం ఉంటుంది. పైగా ఆయన రాజకీయ దురంధరుడు. ఇదిలా ఉంటే ఏపీలోనే టీడీపీ పునాదులు కదలిపోతున్న వేళ తెలంగాణాలో అసలు [more]
చంద్రబాబునాయుడు ఏ పని చేసినా వెనక రాజకీయం ఉంటుంది. పైగా ఆయన రాజకీయ దురంధరుడు. ఇదిలా ఉంటే ఏపీలోనే టీడీపీ పునాదులు కదలిపోతున్న వేళ తెలంగాణాలో అసలు పార్టీ అన్నది ఉందా అన్న డౌట్లు అందరికీ కలగడం సహజం. నిజానికి 2014 ఎన్నికల తరువాత తెలంగాణాలో టీడీపీ చాప చుట్టేసింది. కానీ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత జాతీయ పార్టీగా టీడీపీని బాబు ప్రకటించారు. దాంతో చంద్రబాబుకు ఆ హోదా ఉండాలి అంటే కచ్చితంగా తెలంగాణాలో టీడీపీ ఒకి ఒక ప్రెసిడెంట్, కార్యవర్గమూ ఉండాల్సిందే.
ఆ ఒక్కడూ …?
తెలంగాణాలో టీడీపీకి గట్టి నాయకులు అంటూ ఎవరూ లేరు. ఆ మాత్రం పలుకుబడి ఉన్నవారు అంతా ఏనాడో గోడ దూకేశారు. ఇక ఎల్. రమణ కూడా పార్టీని వీడిపోతున్నారు. ఆయన చాన్నాళ్ళుగా తెలంగాణాలో టీడీపీ అన్న పార్టీ ఒకటి ఉంది అనిపించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఆయన చంద్రబాబుకు అత్యంత విధేయుడు. అందువల్లనే చంద్రబాబు ఆయన్ని అలా ఉంచి మాకూ పార్టీ శాఖ ఉందనిపించుకుంటూ వస్తున్నారు. రమణ అవసరం ఎవరికీ పడదు అనుకున్నారో లేక ఆయన ఎక్కడికీ పోలేరు అనుకున్నారో కానీ చంద్రబాబు మాత్రం ధిలాసాగానే ఇప్పటిదాకా ఉన్నారు. అయితే ఒక్కసారిగా రమణ బాబుకు బిగ్ షాక్ ఇచ్చేశారు.
వేటాడినా ….?
ఈ నేపధ్యంలో కొత్తగా తెలంగాణాకు ఒక అధ్యక్షుడి కోసం చంద్రబాబు కసరత్తు చేయాలి. గట్టిగా వేటాడాలి కూడా. మరి ఉన్న వారిలో ఎవరైనా దొరుకుతారా అంటే డౌటే అంటున్నారు. టీడీపీకి ఇపుడు మిగిలింది మాజీ కార్పోరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు అక్కడకక్కడ అంటున్నారు. వారికి తమ సొంత ప్రాంతంలోనే పెద్దగా పరపతి లేదు. సరే ఆ విషయం ఎలా ఉన్నా తెలంగాణాలో కొందరికైనా తెలిసిన ముఖం ఉంటే చాలు అన్నట్లుగా సీన్ ఉందిట. అయితే అలాంటి వారు బూతద్ధం వెతికిపెట్టినా దొరకడంలేదు. మరి చంద్రబాబు ఎవరిని తెచ్చి ఎన్టీఆర్ భవన్ లో కూర్చోబెడతారో చూడాలి.
బోలెడు అవసరాలున్నాయి ….
చంద్రబాబుకూ జాతీయ ప్రెసిడెంట్ హోదాను ఇవ్వడమే కాదు, 2023లో జరిగే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తే పొత్తుల కోసం కొన్ని పార్టీలు అయినా రెడీ అవుతాయి. అలా అక్కడ వారితో చెలిమి ఏపీలో బలం అయ్యేలా కూడా ఉంటుంది. దానికి తోడు కోట్ల ఆస్తిగా ఉన్న ఎన్టీయార్ భవన్ కి కూడా పార్టీ అన్నది అవసరం. దీంతో తెలంగాణా టీడీపీకి కొత్త సారధిని నియమించడం బాబుకు అన్ని విధాలుగా చాలా ముఖ్యమని అంటున్నారు. మరి ఆ కొత్త కామందు ఏ బాలక్రిష్ణగానో, లేక నందమూరి సుహాసిని గానో వస్తే కొంతలో కొంత నయం కదా అన్న మాట అయితే అక్కడ ఉన్న ఎన్టీయార్ అభిమానుల్లో ఉందిట. కానీ బాబుకు కావాల్సింది పార్టీ అలా ఉనికిలో ఉండడమేనని అంటున్నారు.