నివేదికలు చూసి నివ్వెర పోవడం తప్ప?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పార్టీ వ్యవహారం తలనొప్పిగా మారింది. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వస్తున్న నివేదికలు చంద్రబాబును నివ్వెరపరుస్తున్నాయి. పార్టీ నేతలు క్యాడర్ ను [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పార్టీ వ్యవహారం తలనొప్పిగా మారింది. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వస్తున్న నివేదికలు చంద్రబాబును నివ్వెరపరుస్తున్నాయి. పార్టీ నేతలు క్యాడర్ ను [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పార్టీ వ్యవహారం తలనొప్పిగా మారింది. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వస్తున్న నివేదికలు చంద్రబాబును నివ్వెరపరుస్తున్నాయి. పార్టీ నేతలు క్యాడర్ ను పూర్తిగా గాలికి వదిలేశారు. హైకమాండ్ ఇచ్చిన పార్టీ కార్యక్రమాలను కూడా నేతలు పట్టించుకోవడం లేదు. ఇటీవల పది అంశాలతో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు స్వయంగా పిలుపిచ్చినా వంద నియోజకవర్గాల్లో ఆ ఊసే లేదని నివేదికలు అందాయి.
వంద నియోజకవర్గాల్లో…..
దాదాపు వంద నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జులు చేతులెత్తేశారనే చెప్పాలి. పార్టీ కార్యక్రమాల నిర్వహణ ఖర్చును భరించలేక కొందరు, అధికార పార్టీ పెట్టే కేసులకు భయపడి మరికొందరు ఇలా దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు జూమ్ యాప్ లో నిత్యం వారికి నూరిపోస్తున్నా ఫలితం లేదు. ఎన్నికలకు ఏడాది ముందు చూసుకోవచ్చులేనన్న ధీమా వారిలో కన్పిస్తుంది. ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళితే చేతి చమురు భారీగా వదులుతుందని, ఎన్నికల సమయానికి ఆర్థికంగా ఇబ్బందులు పడతామని కొందరు నేరుగా చెబుతున్నారు.
నేరుగా మాట్లాడుతూ….
అందుకోసం చంద్రబాబు ఈ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఒక్కొక్క నియోజకవర్గం ఇన్ ఛార్జితో నేరుగా మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. వారితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి అవసరాలు, సమస్యలను నేరుగా చంద్రబాబు అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారు. కేసుల వంటి సమస్యలయితే పార్టీ చూసుకుంటుందని భరోసా ఇస్తున్నారు. ఆర్థిక సమస్యల విషయంలో మాత్రం ఎటువంటి హామీ ఇవ్వడం లేదు.
భరోసా నింపుతూ….
వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని చంద్రబాబు చెబుతున్నారు. ఇందుకు పక్కా లెక్కలతో వారికి వివరిస్తున్నారని తెలిసింది. కూటమితోనే వచ్చే ఎన్నికలకు వెళతామని, భవిష్యత్ ఉంటుందని చంద్రబాబు ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన నలుగురైదుగురు నేతలకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఈ మూడేళ్లు మాత్రం ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొనాలని, అక్రమ కేసులకు భయపడవద్దని చంద్రబాబు వారికి చెబుతున్నారు. మొత్తం మీద పార్టీ పరంగా వస్తున్న నివేదికలు నివ్వెర పరుస్తున్నా, వాటిని సెట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.