ఆ నలుగురిని అలా వదిలేసినట్లేనా?
చంద్రబాబు నాయుడు తెలుగు రాజకీయాల్లో సీనియర్ నేత. 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నేత. అలాంటి చంద్రబాబు ఈసారి మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. తన పార్టీ [more]
చంద్రబాబు నాయుడు తెలుగు రాజకీయాల్లో సీనియర్ నేత. 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నేత. అలాంటి చంద్రబాబు ఈసారి మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. తన పార్టీ [more]
చంద్రబాబు నాయుడు తెలుగు రాజకీయాల్లో సీనియర్ నేత. 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నేత. అలాంటి చంద్రబాబు ఈసారి మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. తన పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు నలుగురు అధికార పార్టీకి వత్తాసు పలికినా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. కనీసం వారిపై అనర్హత వేటు వేయాలన్న పిటీషన్ ను కూడా చంద్రబాబు పార్టీ అధినేతగా స్పీకర్ కు ఇవ్వలేకపోయారు.
దారుణ ఓటమి తర్వాత…?
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమిని చవిచూసింది. 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన ఓటమి. ఈ ఓటమిని జీర్ణించుకుని నిలదొక్కుకుందామనుకునే లోపే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. వారు పార్టీకి రాజీనామా చేయకుండానే వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్నారు.
అనర్హత వేటు…..
టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ కుమార్ లు పార్టీని వీడారు. నలుగురు జగన్ ను కలసి కండువా కప్పుకోకపోయినా మద్దతుదారులుగా మారారు. ఈ నలుగురిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటి వరకూ చంద్రబాబు స్పీకర్ కు అనర్హత పిటీషన్ ఇవ్వలేదు. వారిని చూసీ చూడనట్లు వదిలేశారు. ఇది పార్టీ క్యాడర్ లో ఇబ్బందిగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎటూ ఈ నలుగురు టీడీపీ నుంచి పోట ీచేయరు.
వైసీపీని ఇరకాటంలో పెట్టే ఛాన్స్…..
చీరాల, గన్నవరం, గంటూరు పశ్చిమ, విశాఖ సౌత్ నియోజకవర్గాల నుంచి టీడీపీ తరుపున కొత్త వారిని పోటీకి దింపాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో వీరి పట్ల చంద్రబాబు మెతక వైఖరిని ఎందుకు అవలంబిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. స్పీకర్ కు అనర్హత పిటీషన్ ఇచ్చినా పెద్దగా ఫలితం ఉండదు. వాస్తవమే. అయినా కూడా ఒక పార్టీ అధినేతగా పార్టీ నియమావళిని థిక్కరించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధినేతగా చంద్రబాబుపై ఉంది. కానీ చంద్రబాబు మాత్రం ఆ పని చేయలేకపోతున్నారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో వైసీపీ అనర్హత పిటీషన్ స్పీకర్ కు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. వైసీపీ కూడా రాజును బహిష్కరించలేదు. నలుగురిని పార్టీ నుంచి బహిష్కరించి చంద్రబాబు జగన్ ను ఇరకాటంలోకి నెట్టే వీలుంది. కానీ దానిని కూడా చంద్రబాబు ఉపయోగించుకోలేకపోతున్నారన్న టాక్ పార్టీలోనే విన్పిస్తుంది.