బాబు ప్రయత్నాలు మామూలుగా లేవుగా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు నేతలను యాక్టివ్ చేయడం ఇబ్బందికరంగా మారింది. మరో మూడేళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉండనుంది. ఈ మూడేళ్ల పాటు అధికార [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు నేతలను యాక్టివ్ చేయడం ఇబ్బందికరంగా మారింది. మరో మూడేళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉండనుంది. ఈ మూడేళ్ల పాటు అధికార [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు నేతలను యాక్టివ్ చేయడం ఇబ్బందికరంగా మారింది. మరో మూడేళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉండనుంది. ఈ మూడేళ్ల పాటు అధికార పార్టీ తో యుద్ధం చేయాలని చంద్రబాబు పిలుపు నిస్తున్నారు. కానీ నేతలు మాత్రం తమ వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. మూడేళ్ల పాటు ఈ కేసులు, ఆర్థిక ఇబ్బందులు తాము తట్టుకోలేమని నిర్మొహమాటంగా కొందరు చెబుతున్నారు.
జమిలి ఎన్నికలొస్తాయని….
నిన్నమొన్నటి వరకూ చంద్రబాబు జమిలి ఎన్నికలు వస్తాయని పదే పదే చెప్పేవారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ముందు వరకూ ఇదే తంతు కొనసాగేది. తనకు ఢిల్లీ నుంచి సమాచారం ఉందని, జమిలి ఎన్నికలు వస్తాయని చంద్రబాబు చెప్పేవారు. దీంతో నేతలు కూడా జమిలి ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు జమిలి ఎన్నికల ఊసు లేదు. కేంద్రంలో బీజేపీ కూడా ఆ ఆలోచన విరమించుకున్నట్లే కనపడుతుంది.
బెయిల్ రద్దవుతుందని….
దీంతో చంద్రబాబు జగన్ కు జైలు శిక్ష పడక తప్పదన్న సంకేతాలు మళ్లీ మొదలు పెట్టారు. జగన్ బెయిల్ రద్దవుతుందని, వచ్చే ఎన్నికల నాటికి జగన్ నేతృత్వంలో ఆ పార్టీ ఎన్నికలకు వెళ్లలేదని చంద్రబాబు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెబుతున్నట్లు తెలుస్తోంది. జగన్ జైలుకు వెళితే వైసీపీలో కూడా ఆధిపత్య పోరు ఎక్కువై, తమకు అడ్వాంటేజీగా మారుతుందని, ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకం కావాలని చంద్రబాబు చెబుతున్నారు.
యాక్టివ్ చేయడానికే….
అయితే ఇదంతా నేతలను యాక్టివ్ చేయడానికేనన్నది అందరికీ తెలిసిందే. గత రెండేళ్లుగా వేళ్ల మీద లెక్క పెట్టే నియోజకవర్గాల్లో తప్ప ఎక్కడా టీడీపీ నేతలు యాక్టివ్ గా లేరు. అందరూ ముసుగుతన్ని పడకేశారు. ఎన్నికలకు ఒక ఏడాది ముందు వారు యాక్టివ్ అయ్యే అవకాశముంది. అయితే ఇప్పటి నుంచే వారిని ప్రజల్లోకి పంపి పార్టీని బలోపేతం చేయాలన్నది చంద్రబాబు ప్రయత్నం. అందుకే చంద్రబాబు జమిలీ, బెయిల్ రద్దు వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు.