బాబు లాస్ట్ మినిట్ లో ఝలక్ ఇస్తారా?
రాజకీయాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వాడే అసలైన నేత. తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు దీనికి అచ్చుగుద్దినట్లు సరిపోతారు. పార్టీ పని అయిపోయిందనుకున్న సమయంలో పొత్తులతో [more]
రాజకీయాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వాడే అసలైన నేత. తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు దీనికి అచ్చుగుద్దినట్లు సరిపోతారు. పార్టీ పని అయిపోయిందనుకున్న సమయంలో పొత్తులతో [more]
రాజకీయాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వాడే అసలైన నేత. తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు దీనికి అచ్చుగుద్దినట్లు సరిపోతారు. పార్టీ పని అయిపోయిందనుకున్న సమయంలో పొత్తులతో టీడీపీని అధికారంలోకి తేవడంలో చంద్రబాబు వ్యూహాలే పనిచేశాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసుకుంటూ ముందుకు వెళతారన్న పేరుంది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలయిన చంద్రబాబు ఈసారి పొత్తులతోనే దిగుతారు.
బీజేపీతో మరికొంతకాలం….
అయితే బీజేపీతో కలసి వెళ్లే అవకాశముందని అందరూ భావిస్తున్నారు. కానీ చంద్రబాబు ఆలోచన వేరే రకంగా ఉందంటున్నారు. ప్రస్తుతం బీజీపీతో స్నేహపూర్వమైన వాతావరణంలో మెలగడం అన్ని విధాలుగా చంద్రబాబుకు అవసరం. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండటంతో బీజేపీతో మంచి సంబంధాలు కొనసాగిస్తేనే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నుంచి తనను, తన పార్టీని రక్షించుకునే వీలుంటుంది. బీజేపీ అండ కూడా లేకపోతే వైసీపీ మరింత రెచ్చిపోయే అవకాశముంది.
దేశ వ్యాప్తంగా….
నిజానికి దేశ వ్యాప్తంగా మోదీ ఇమేజ్ డ్యామేజీ అయింది. బీజేపీ అంటేనే పేద, మధ్య తరగతి ప్రజలు మండిపడుతున్నారు. ఏ వర్గం కూడా కేంద్ర ప్రభుత్వ పాలన పట్ల సంతృప్తికరంగా లేదు. ఇది అనుభవమున్న నేత చంద్రబాబుకు తెలియంది కాదు. అయితే కాంగ్రెస్ నాయకత్వం బలహీనంగా ఉంది. మోదీని ఎదుర్కొనే విపక్షం జాతీయ స్థాయిలో లేదు. ఇప్పడిప్పుడే మోదీకి వ్యతిరేకంగా కూటమి రూపుదిద్దుకుంటుంది.
పవార్ కూటమికి దగ్గరయ్యే?
ప్రశాంత్ కిషోర్ వ్యూహరచనతో శరద్ పవార్ నేతృత్వంలో ఈ కూటమి త్వరలో బలంగా మారుతుందన్న అంచనాలున్నాయి. కాంగ్రెస్ తో కలసి నడిచే అవకాశాలున్నాయి. ఈ కూటమి బలోపేతమయ్యే తీరును బట్టి చంద్రబాబు నిర్ణయం ఉంటుందన్నారు. రాష్ట్రంలో బీజేపీతో కలసి పోట ీచేసినా ప్రయోజనం లేదు. ఆ పార్టీకి ఓటు బ్యాంకు లేదు. పవన్ కల్యాణ్ ను కలుపుకుంటే చాలు. అదే పరిస్థితుల్లో శరద్ పవార్ నేతృత్వంలోని కూటమి బలంగా తయారయితే చంద్రబాబు ఆ రూట్ లో వెళ్లే అవకాశాలున్నాయి. ఆ కూటమిలోని నేతలందరూ చంద్రబాబు పాత మిత్రులే. అందుకే చంద్రబాబు పొత్తు నిర్ణయం ఎన్నికలకు చివరి ఏడాది ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.