ఒక్క వికెట్ తీయలేదుగా…. ?
రెండేళ్ళు టైమ్ అంటే ఎక్కువే మరి. ఈపాటికి వ్యతిరేకత ఎంతో కొంత గూడు కట్టుకుని ఉండాలి. కానీ ఏపీలో జగన్ సర్కార్ మీద జనాలలో మాత్రం అలాంటి [more]
రెండేళ్ళు టైమ్ అంటే ఎక్కువే మరి. ఈపాటికి వ్యతిరేకత ఎంతో కొంత గూడు కట్టుకుని ఉండాలి. కానీ ఏపీలో జగన్ సర్కార్ మీద జనాలలో మాత్రం అలాంటి [more]
రెండేళ్ళు టైమ్ అంటే ఎక్కువే మరి. ఈపాటికి వ్యతిరేకత ఎంతో కొంత గూడు కట్టుకుని ఉండాలి. కానీ ఏపీలో జగన్ సర్కార్ మీద జనాలలో మాత్రం అలాంటి నెగిటివిటీ అయితే లేదు. దాన్ని పెంచడంతో తెలుగుదేశం వేస్తున్న బాల్స్ అన్నీ కూడా సైడ్ రూట్లో పోతున్నాయి. ఒక్క వికెట్ కూడా పడడంలేదు. మరో వైపు బౌలింగ్ చేయలేక చంద్రబాబు టీమ్ కి అలుపు వచ్చేస్తోంది. ఒక వికెట్ పడితే చాలు గ్యాలరీలో కూర్చున్న పసుపు తమ్ముళ్ళకు హుషార్ వస్తుంది. అదే టైంలో అధికార వైసీపీలో స్ట్రగుల్ మొదలవుతుంది. కానీ అదే జరగడంలేదు.
అంతా రొటీన్ …?
తెల్లారి లేస్తే ఏపీలోని పదమూడు జిల్లాలలో ఉన్న సీనియర్లు, మాజీ మంత్రులకు ఒకే ఒక పాయింట్ హై కమాండ్ నుంచి వస్తుంది. దాన్ని వారు పట్టుకుని జగన్ సర్కార్ మీద విరుచుకుపడతారు. మధ్యాహ్నానికి దానిమీద అనుకూల మీడియాలో స్క్రోలింగ్స్ వెల్లువెత్తుతాయి. అక్కడితో ఆ దీపావళి టపాసులు అన్నీ కూడా అయిపోతాయి. అంతే సాయంత్రం ఇక ఎవరి ఇంట్లో వారు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు. ఇదే గత రెండేళ్ళుగా టీడీపీలో సాగుతున్న వ్యవహారం. దీనికి తోడు చంద్రబాబు జూమ్ యాప్ మీటింగ్స్ తో కొంత పొలిటికల్ హడావుడి ఉంటుంది.
ఇష్యూస్ లేవా ?
భావ దారిద్రం అని కొందరి ఉద్దేశించి అంటూంటారు. అది పార్టీలకు రాకూడదు అంటారు. కటౌట్ ఫుల్ కంటెంట్ నిల్ అని కూడా చెబుతారు. టీడీపీ విషయం చూస్తే హిస్టరీ గ్రేట్. ప్రెజెంట్ డౌట్ అని కూడా సెటైర్లు పేల్చుతున్నారు. ఎంతసేపూ జగన్ ఫ్రాక్షనిస్టూ, దొంగ, దోపిడీదారు, రాజారెడ్డి రాజ్యాంగం, అవినీతి, వేల కోట్లు దిగ మింగేస్తున్నారు. ఇలాంటి స్క్రిప్ట్ తోనే టీడీపీ విమర్శలు స్టార్ట్ అవుతాయి. వీటిలో జనాలకు కనెక్ట్ అయ్యే ఇష్యూ ఒక్కటి అయినా ఉందా అన్నది తలపండిన తమ్ముళ్లే చెప్పాలి. జగన్ని తిట్టే ఉత్సహాంలో వేయ్యో వంతు ప్రజా సమస్యల మీద నాయకులు చూపించడం లేదు. అందరూ అందరే అన్నట్లుగానే పరిస్థితి ఉంది. దీంతోనే జనాలకు టీడీపీ ప్రెస్ మీట్లు, నాయకుల మాటలు తెగ బోర్ కొట్టిస్తున్నాయని అంటున్నారు.
లీడర్స్ గాయబ్ ….
ఇక తెలుగుదేశం నాయకులు ఎవరూ రెండేళ్ళుగా రోడ్ల మీదకు వచ్చిన దాఖలాలు పెద్దగా లేవు. ఇదంతా చంద్రబాబు లాంటి అపర చాణక్యుడి వ్యూహాలు వెలవెల పోవడం వల్లనే అని చెప్పాలి. టీడీపీలో చంద్రబాబు సర్వం సహా. ఆయన తప్పితే కుమారుడు లోకేష్ మాత్రమే పార్టీలో ఫోకస్ కావాలి. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ హోదాలో అచ్చెన్నాయుడు అయినా జనంలోకి వెళ్లకూడదు. మరీ ఇలా రూల్స్ పెట్టుకుంటేనే పార్టీ అన్నది మీడియాలో తప్ప ఎక్కడా జనంలో కనిపించడంలేదు అంటున్నారు తమ్ముళ్ళు. ఒక విధంగా టీడీపీ కూడా కాంగ్రెస్ కి నకలు అన్నట్లుగా తయారైంది అన్న విమర్శలు కూడా అందుకే వస్తున్నాయి. ఒక నాయకుడిని రెండవ వారు తొక్కేయడం, చివరికి ఎవరూ జనాల్లో కనిపించకపోవడం. ఇదే టీడీపీలో సాగుతోంది. అందరి కంటే ముందు అధినాయకత్వానికే మరో లీడర్ షిప్ అన్నది ఉండకూడదు అన్న దూరాలోచన ఉంటే పార్టీకి పూర్వ వైభవం వచ్చేది ఎపుడు అన్నదే ఆవేదన. ఏది ఏమైనా టీడీపీ చేతిలో బంతులు అయిపోతున్నాయి కానీ వైసీపీ వికెట్లు మాత్రం పడడంలేదు అంటే దీని మీద పసుపు శిబిరం సీరియస్ గా ఆలోచించాల్సిందే.