ఇలాగయితే… ఎలా…? తమ్ముళ్లలో అంతర్మధనం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు 2024 చివరి ఎన్నికలనే చెప్పాలి. ఆయన నేతృత్వంలో వెళ్లే చివరి ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపి చరిత్ర కెక్కాలన్నది తెలుగు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు 2024 చివరి ఎన్నికలనే చెప్పాలి. ఆయన నేతృత్వంలో వెళ్లే చివరి ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపి చరిత్ర కెక్కాలన్నది తెలుగు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు 2024 చివరి ఎన్నికలనే చెప్పాలి. ఆయన నేతృత్వంలో వెళ్లే చివరి ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపి చరిత్ర కెక్కాలన్నది తెలుగు తమ్ముళ్ల కోరిక. అయితే పరిస్థితి చూస్తుంటే అది నెరవేరేటట్లు కన్పించడం లేదు. చంద్రబాబులో ఏమాత్రం మార్పు రాలేదంటున్నారు. ఇంకా సీనియర్లు అంటూ పట్టుకుని వేలాడితే పార్టీ ఎదుగుదల కష్టమని తెలుగుదేశంపార్టీ యువనేతలు అభిప్రాయపడుతున్నారు.
పాత వారికే ఇస్తే….
ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. పాత వారికే టిక్కెట్లు మళ్లీ ఇస్తే దాదాపు 70 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి చెప్పలేమంటున్నారు. అందుకే కొత్త వారికి, యువకులకు ఇవ్వాలన్నది యువనేతల డిమాండ్. ప్రతి నియోజకవర్గంలో ఆర్థికంగా, సామాజికపరంగా బలమైన యువనేతలే ఉన్నారు. వారంతా పార్టీ కోసం ఎప్పటి నుంచో శ్రమిస్తున్నారు. కానీ సీనియర్ నేతల కారణంగా వారు రాజకీయంగా ఎదుగుదల లేదు.
అవకాశం ఇస్తే….
వీరంతా తమకు ఈసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుచి వస్తామని చెబుతున్నారట. ఇటీవల చంద్రబాబు జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లోనూ ఇదే కామెంట్స్ రావడం విశేషం. ప్రధానంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో యువనేతల హడావిడి ఎక్కువగా కన్పిస్తుంది. తమకుఎన్నికల నిధుల అవసరం కూడా లేదని కొందరు చెప్పేస్తున్నారట. కానీ పాత వారిని కాదని కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే ందుకు చంద్రబాబుకు ధైర్యం చాలడం లేదు.
చినబాబుతో త్వరలో….
మూడేళ్లు ముందుగానే అవకాశమిస్తే తాము ప్రజల్లోకి వెళతామని, కరోనా పరిస్థితులను కూడా లెక్కచేయమని రాయలసీమకు చెందిన ఒక యువనేత చెప్పారట. అయితే చంద్రబాబు మాత్రం ముందు పార్టీ కోసం పనిచేయండి తర్వాత చూద్దాం అని చెప్పడంతో వారు నిరాశగా మారారు. వీరంతా త్వరలో నారా లోకేష్ ను కలిసి తమ మనసులో మాటను చెప్పుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో సీినియర్ల ఆధిపత్యంతో యువత రాజకీయంగా ఇబ్బందిపడుతుంది.