ఈసారీ వారి మద్దతు బాబుకు కష్టమేనట
ఏ పార్టీకైనా మేధావుల అవసరం చాలానే ఉంటుంది. పార్టీకి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, నిధుల సేకరణలకు కూడా మేధావులతోనే పని అవసరం. కాబట్టి.. ఏ పార్టీ అయినా [more]
ఏ పార్టీకైనా మేధావుల అవసరం చాలానే ఉంటుంది. పార్టీకి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, నిధుల సేకరణలకు కూడా మేధావులతోనే పని అవసరం. కాబట్టి.. ఏ పార్టీ అయినా [more]
ఏ పార్టీకైనా మేధావుల అవసరం చాలానే ఉంటుంది. పార్టీకి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, నిధుల సేకరణలకు కూడా మేధావులతోనే పని అవసరం. కాబట్టి.. ఏ పార్టీ అయినా మేధావులకు ప్రాధాన్యం ఇస్తుంది. ఆయా పార్టీల నడతను బట్టి, యాంగిల్‌ను బట్టి.. మేధావులు పార్టీలతో మమేకం అవుతారు. గతంలో టీడీపీతో అనేక మంది మేధావులు ఉండేవారు. కానీ, రానురాను ఈ పరిస్థితి మారిపోయింది. టీడీపీలో మేధావులు తగ్గుతున్నారు. అటు ఎన్నారైల నుంచి ఇటు.. దేశంలోని అనేక మంది మేధావులు పార్టీకి దూరం జరుగుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబు పాలన అన్నా, నాయకత్వం అన్నా మేథావులు ఎంతో ఇష్టపడేవారు. అలాంటి మేథావులు ఇప్పుడు లేరు. జాతీయ స్థాయిలో చంద్రబాబును వేన్నోళ్లు పొగిడిన వారంతా ఇప్పుడు ఆయన మాటే ఎత్తడం లేదు.
అనుసరిస్తున్న విధానాలు….
కేంద్రంలోని పార్టీలతో సంబంధాలు బలోపేతం చేయాలన్నా.. రాష్ట్రంలో విద్యావంతులను పార్టీవైపు నడిపించాలన్నా.. కూడా మేధావుల అవసరం చాలానే ఉంది. అయితే… ఇప్పుడు చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు.. ఇతరత్రా కారణాలతో మేధావులు టీడీపీకి దూరంగా జరుగుతున్నారని అంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కారును టార్గెట్ చేయాలనేది మేధావుల మాట. గడిచిన ఏడేళ్లుగా ఆయన కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మేధావి వర్గాలు.. మోడీపై గుస్సాగా ఉన్నారు.. ముఖ్యంగా అర్బన్ నక్సలిజం పేరిట.. మేధావులను అరెస్టు చేయడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.
విధానాలను తరచూ మారుస్తూ…
అదే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, రాష్ట్ర పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించడం.. ఇలా అనేక అంశాలను మేధావులు టార్గెట్‌గా తీసుకుని.. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. అయితే.. ఆయా అంశాలపై సీనియర్ నాయకుడిగా.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన చంద్రబాబు.. ఏమాత్రం పట్టించుకోకపోవడాన్ని.. ప్రశ్నించకపోవడాన్ని మేధావులు జీర్ణించుకోలేక పోతున్నారు. రాజకీయంగా చంద్రబాబు ప్రతిసారి సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి విధానాలు మార్చుకోవడం, కప్పదాట్లు ఇవన్నీ ఆయన్ను ప్రజలకే కాకుండా.. మేథావులకు కూడా దూరం చేశాయి.
ఎన్నారైల నుంచి కూడా….
తాజాగా చంద్రబాబు చేపట్టిన ఏ అంశానికి కూడా మేధావుల నుంచి మద్దతు రావడం లేదు. ఒక్క మేధావులు మాత్రమే కాదు.. గతంలో చంద్రబాబుకు ఎన్నారైల సపోర్ట్ బలంగా ఉండేది. ఇప్పుడు వారు కూడా ఆయన్ను పట్టించుకోండం లేదు. ఇటీవల ఎన్నారైల నుంచి కూడా మద్దతు లేకుండా పోయింది. ఉదాహరణకు కరోనా సమస్య పరిష్కారం.. పరిహారం వంటి అంశాలు.. కేంద్రంలోని మోడీ సర్కారుకు సంబంధించిన విషయాలు. దీనిపై సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మోడీపై విరుచుకుపడింది. ఈ క్రమంలో మోడీని విమర్శించడం మానేసి. కేంద్ర విధానాలను తప్పుబట్టడం మానేసి.. రాష్ట్రంపై పడడం.. జగన్‌ను విమర్శించడం.. చంద్రబాబు స్థాయికి తగదని అంటున్నారు పరిశీలకులు. అందుకే మేధావులు దూరమవుతున్నారని చెబుతున్నారు.