బాబుని బాగా డిస్టర్బ్ చేస్తున్నాడే… ?
చంద్రబాబు ఒక పట్టాన డిస్టర్బ్ కారు. ఆయన పట్టుదల అలాంటిది. బాబు విషయంలో ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా కూడా ఆయన ఎక్కడా డీవియేట్ కూడా కారు. [more]
చంద్రబాబు ఒక పట్టాన డిస్టర్బ్ కారు. ఆయన పట్టుదల అలాంటిది. బాబు విషయంలో ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా కూడా ఆయన ఎక్కడా డీవియేట్ కూడా కారు. [more]
చంద్రబాబు ఒక పట్టాన డిస్టర్బ్ కారు. ఆయన పట్టుదల అలాంటిది. బాబు విషయంలో ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా కూడా ఆయన ఎక్కడా డీవియేట్ కూడా కారు. తాను అనుకున్నది చేసుకుపోవడమే చంద్రబాబుకు తెలుసు. అందుకే ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆయనకు లక్ష్యాలు తెలుసు. వాటిని సాధించడం ఎలాగో కూడా తెలుసు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లాన్ని ఎలా సొంతం చేసుకోవాలో ఇంకా బాగా తెలుసు. అన్నింటికి మించి విపక్షంలో ఉన్నపుడు చంద్రబాబు బుర్ర పాదరసంగా పనిచేస్తుందని అంటారు.
జగన్ తో పేచీ….
చంద్రబాబుకు ఇపుడు జగన్ నుంచి డిస్టర్బ్ అన్నది లేదు. ఎందుకంటే అది అలవాటు అయిపోయింది. మొదట్లో ఈ జగన్ ఏంటి గత సీఎంల లేరు అని చంద్రబాబు అనుకున్నారు. కానీ ఇపుడు జగన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకున్నారు. జగన్ మీద విమర్శలు గట్టిగానే చేస్తూ వెళ్తున్నారు. తొలి రెండేళ్ళూ జగన్ బాబుని ఏమీ చేయలేకపోయారు. ఇపుడు చేస్తారు అన్నది కూడా లేదు. చేసినా ఎన్నికల వేళ అది తనకే ప్లస్ అవుతుంది అన్న అంచనాలు ఎటూ బాబుకు ఉన్నాయి. దాంతో బాబు అలా ముందుకు పోతున్నారు.
బుర్ర పాడేనా….?
అయితే సొంత పార్టీతోనే చంద్రబాబుకు బుర్ర పాడు అవుతోంది. అయితే నేతలు ఇంకా నిద్ర లేవలేదు. వారిని లేపే పనిలో చంద్రబాబు ఒక వైపు బిజీగా ఉంటే మధ్యలో జూనియర్ ఎన్టీయార్ వచ్చేస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే తన మానాన తాను సినిమా చేసుకోకుండా చంద్రబాబుని తెగ చికాకు పెడుతున్నాడు. బాబు వెళ్ళేదారిలోనే జూనియర్ కనిపిస్తున్నాడు. ప్రత్యక్షంగా కాదు, ఫ్లెక్సీల రూపంలో టీడీపీ భవిష్యత్తులు చెప్పి మరీ భయపెట్టేస్తున్నాడు. తన చాణక్య రాజకీయంతో నందమూరి వారి పార్టీని నారా వారి పార్టీగా మార్చేసిన చంద్రబాబును మూడవ తరం నందమూరి కుర్రాడు అసలు నిద్రపోనీయడంలేదు.
అత్తావారి అడ్డాలోనూ..?
చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జూనియర్ ఎంటరై చాలా రోజులు అయింది. చంద్రబాబు లోకల్ బాడీ ఎన్నికల తరువాత వెళ్తే మీకు ఎందుకొచ్చిన ఆయాసం, జూనియర్ ఎన్టీయార్ ని పార్టీలోకి తెచ్చేద్దురూ అంటూ ఏకంగా చంద్రబాబు సభలోనే క్యాడర్ నుంచ్ నినాదాలు వినిపించాయి. ఇపుడు చూస్తే అత్తవారి వూరు కృష్ణా జిల్లాలోనూ అవే సౌండ్స్ వినిపిస్తున్నాయి. బాబు ఎంత చూడనట్లుగా ఉన్నా కూడా జూనియర్ ఇంతింతై నారా వారి బుర్రలో గడబిడ సృష్టించేస్తున్నాడు. అన్నింటి కంటే అతి పెద్ద వణుకు పుట్టే సౌండ్ ఏంటి అంటే కాబోయే సీఎం జూనియర్ ఎన్టియార్ అట. నిజంగా చంద్రబాబు తట్టుకోగలడా. మూడేళ్ళకు ముందే ఇలాంటి సీన్ ఉంటే ఎన్నికల వేళకు ఫ్లెక్సీల నుంచి జూనియర్ నేరుగా రంగంలోకి దిగిపోడు కదా అన్నదే నారా వారి అసలైన బాధట.